త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Niharika Konidela | బంగారు బోనం ఎత్తిన మెగా డాట‌ర్ నిహారిక కొణిదెల

పాత‌బ‌స్తీలోని మీరాలం మండి బోనాల వేడుక‌ల్లో మెగా డాట‌ర్ నిహారిక కొణిదెల పాల్గొన్న‌ది. మహంకాళేశ్వర దేవాలయం అమ్మవారికి బంగారు బోనాన్ని స‌మ‌ర్పించింది. ఆలయ అర్చకులు నిహారిక‌కు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు

N

Entertainment | Published On Aug 8, 2026, 11.12 am IST

Niharika Konidela | బంగారు బోనం ఎత్తిన మెగా డాట‌ర్ నిహారిక కొణిదెల
Advertisement

Niharika Konidela | మెగా డాట‌ర్ నిహారిక కొణిదెల పాత‌బ‌స్తీ బోనాల వేడుక‌ల్లో పాల్గొన్న‌ది. మీరాలం మండిలోని శ్రీ మహంకాళేశ్వర దేవాలయం అమ్మవారికి బంగారు బోనాన్ని స‌మ‌ర్పించింది. అమ్మ‌వారి ఆల‌యంలో ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఆలయ అర్చకులు నిహారిక‌కు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. వేదమంత్రాల నడుమ అమ్మవారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందింది నిహారిక‌. ఆలయ అధికారులు నిహారిక‌ను ఘనంగా సత్కరించారు.

హైద‌రాబాద్ సంస్కృతి...

ఈ సంద‌ర్భంగా నిహారిక కొణిదెల‌ మాట్లాడుతూ.... ప్రధాన బోనాల ఉత్స‌వం రోజు షూటింగ్ ఉండటంతో ఆలయానికి రాలేకపోయాన‌ని, అందుకే అమ్మవారి దర్శనానికి వచ్చినట్లు తెలిపింది. తాను హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగినాన‌ని, ఇక్క‌డి సంస్కృతులు సంప్ర‌దాయాలు అంటే ఎంతో ఇష్ట‌మ‌ని అన్న‌ది. బోనాల వేడుక సందర్భంగా మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బోనాలు ఎత్తుకుని వెళ్లే దృశ్యాలు ఎప్పుడూ తనను ఎంతో ఆకట్టుకునేవని చెప్పారు.

అమ్మ‌వారి అనుగ్ర‌హం...

కొద్ది రోజుల క్రితమే నన్ను కూడా ఎవరైనా బోనాలకు తీసుకెళ్తే బాగుండేది అని మ‌న‌సులో అనుకున్నా. ఆ కోరిక ఇంత త్వరగా నెరవేరడం అమ్మవారి అనుగ్రహంగానే భావిస్తున్నా. మ‌రోసారి అమ్మవారి దర్శనం చేసుకునే అవకాశం కలగాలని కోరుకుంటున్నా అని నిహారిక అన్నారు.

సెల్ఫీల కోసం పోటీ...

నిహారిక ఆలయానికి వచ్చిన విషయం తెలుసుకున్న భక్తులు ఆమెతో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు పోటీప‌డ‌టంతో ఆల‌య‌ పరిసరాలు సందడిగా మారాయి.ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గాజుల అంజయ్య నిహారికకు ఆలయ చరిత్రతో పాటు ఆలయ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బోనాల ఉత్సవాల విశిష్టత, సంప్రదాయాలను వివరించారు.

క‌మిటీ కుర్రాళ్లు....

క‌మిటి కుర్రాళ్లు సినిమాతో ప్రొడ్యూస‌ర్‌గా మారింది నిహారిక కొణిదెల‌. ఇటీవ‌ల ప్ర‌క‌టించిన జాతీయ అవార్డుల్లో ఈ సినిమా రెండు పుర‌స్కారాల‌ను ద‌క్కించుకుంది. తొలి సినిమాతోనే నిర్మాత‌గా స‌త్తా చాటింది. ప్ర‌స్తుతం అన్న‌య్య వ‌రుణ్ తేజ్‌తో బ‌రి అనే సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమాలో నాగ‌బాబు ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు.

 

Advertisement
Advertisement