HYDRAA | హైడ్రా రిక్రూట్‌మెంట్‌కు పోటెత్తిన యువత.. సరూర్‌నగర్ స్టేడియం వద్ద ఉద్రిక్తత
HYDRAA | త్రినేత్ర.న్యూస్: డీఆర్ఎఫ్ అసిస్టెంట్ DRF Assistant, డ్రైవర్ (Driver) పోస్టుల భర్తీకి హైడ్రా (HYDRAA) రిక్రూట్‌మెంట్ డ్రైవ్ చేపట్టింది. శని, ఆదివారాల్లో ఫిజికల్ ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహిస్తున్నది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియానికి (Saroornagar Stadium) ఉద్యోగార్ధులు పోటెత్తారు.
HYDRAA | త్రినేత్ర.న్యూస్: డీఆర్ఎఫ్ అసిస్టెంట్ DRF Assistant, డ్రైవర్ (Driver) పోస్టుల భర్తీకి హైడ్రా (HYDRAA) రిక్రూట్‌మెంట్ డ్రైవ్ చేపట్టింది. శని, ఆదివారాల్లో ఫిజికల్ ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహిస్తున్నది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియానికి (Saroornagar Stadium) ఉద్యోగార్ధులు పోటెత్తారు. ఈవెంట్‌లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో తోపులాట జరిగింది. తెల్లవారుజామున 4 గంటల నుంచే యువత భారీగా స్టేడియానికి చేరుకున్నారు. ఊహించని విధంగా వేలాది మంది పోటెత్తడటంతో స్టేడియం మొత్తం కిక్కిరిసిపోయింది.
లోపలికి వెళ్లడానికి ఒక్కారిగా ఎగబడటంతో స్వల్ప తోపులాట జరిగింది. దీంతో ఉద్యోగార్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి లైన్లలో నిల్చున్నామని, కనీసం తాగడానికి నీళ్లు ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్వాహకుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాము జిల్లాల నుంచి వచ్చామని, తమపట్ల అధికారులు నిర్లక్ష్యంగా ప్రవర్తించారంటూ నిరుద్యోగులు వాపోతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం అభ్యర్థులకు టోకెన్ ఇచ్చి వెనక్కి పంపిస్తున్నట్లు సమాచారం. కాగా, 150 డీఆర్ఎఫ్ అసిస్టెంట్, డ్రైవర్ పోస్టులను హైడ్రా కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తున్నది.
మొత్తం పోస్టులు: 150
అర్హలు: పదో తరగతి ఉత్తీర్ణులై 35 ఏండ్ల లోపు వయస్కులై ఉండాలి. డ్రైవర్ పోస్టుకు పోటీపడే అభ్యర్థులకు చెల్లుబాటు అయ్యే ఒరిజినల్ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి.
ఎంపిక ప్రక్రియ: పూర్తిగా శారీరక సామర్థ్య పరీక్షల (Physical Tests) ఆధారంగానే ఉంటుంది. అభ్యర్థులు 800 మీటర్ల పరుగును 2 నిమిషాల 50 సెకన్లలో (170 సెకన్లు), 100 మీటర్ల పరుగును 15 సెకన్లలో పూర్తి చేయాలి. వీటితో పాటు 4 మీటర్ల లాంగ్ జంప్ , 7.2 కేజీల షాట్‌పుట్‌ను 6 మీటర్ల దూరం విసరడం లాంటి భౌతిక పరీక్షలు నిర్వహిస్తారు.
ఉద్యోగాల కోసం పోటెత్తిన నిరుద్యోగులు.. తోపులాట
150 డ్రైవర్ పోస్టులు ఉన్నాయని ప్రకటించిన హైడ్రా
సరూర్ నగర్ స్టేడియంలో ఆగస్టు 8, 9 తేదీల్లో ఈవెంట్స్ ఉంటాయని ప్రకటన
* 170 సెకన్లలో 800 మీటర్ల రన్నింగ్
* 15 సెకన్లలో 100 మీటర్లు
* లాంగ్ జంప్ 4 మీటర్లు
* 6 మీటర్ల షాట్‌పుట్ (7.2 KG)… pic.twitter.com/B23fEtPe3U— PulseNewsBreaking (@pulsenewsbreak) August 8, 2026
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●పదవుల మోజు పక్కనపెట్టండి.. పునాదులు తవ్వండి: ఢిల్లీ వేదికగా కమలనాథుల నయా ‘మిషన్ 2028’!
- ●Amazon Great Freedom Sale 2026 | అమెజాన్ గ్రేట్ ఫ్రీడం సేల్ షురూ.. భారీ డిస్కౌంట్ ధరలకు ఫోన్లు..
- ●US Senate | భారత్‌పై 100 శాతం టారిఫ్‌లు.. కీలక బిల్లుకు అమెరికా సెనేట్ ఆమోదం
- ●Road Accident | బస్సు బోల్తా.. ఏడుగురు మృతి
- ●Niharika Konidela | బంగారు బోనం ఎత్తిన మెగా డాటర్ నిహారిక కొణిదెల
- ●Wine Shops | మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. రేపు వైన్ షాపులు బంద్

పదవుల మోజు పక్కనపెట్టండి.. పునాదులు తవ్వండి: ఢిల్లీ వేదికగా కమలనాథుల నయా ‘మిషన్ 2028’!

Amazon Great Freedom Sale 2026 | అమెజాన్ గ్రేట్ ఫ్రీడం సేల్ షురూ.. భారీ డిస్కౌంట్ ధరలకు ఫోన్లు..

US Senate | భారత్‌పై 100 శాతం టారిఫ్‌లు.. కీలక బిల్లుకు అమెరికా సెనేట్ ఆమోదం

Road Accident | బస్సు బోల్తా.. ఏడుగురు మృతి






