Indian High Commissioner | బంగ్లాదేశ్‌లో భారత రాయబారిగా బెంగాల్ బీజేపీ నేత!
Indian High Commissioner | బంగ్లాదేశ్‌లో భారత రాయబారిగా (Indian High Commissioner) పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీజేపీ (BJP) సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి దినేశ్ త్రివేదీని (Dinesh Trivedi) కేంద్ర నియమించనుంది.
Indian High Commissioner | త్రినేత్ర.న్యూస్: బంగ్లాదేశ్‌లో భారత రాయబారిగా (Indian High Commissioner) పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీజేపీ (BJP) సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి దినేశ్ త్రివేదీని (Dinesh Trivedi) కేంద్ర నియమించనుంది. గుజరాతీ కుటుంబానికి చెందిన ఆయన కోల్‌కతాలో ప్రముఖ వ్యాపారవేత్తగా పేరొందారు. ప్రస్తుతం ఢాకాలో భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మ (Pranay Verma) పనిచేస్తున్నారు. ఆయనను బెల్జియం, యూరోపియన్ యూనియన్‌కు భారతదేశ రాయబారిగా కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ఏప్రిల్ 10న బదిలీ చేసింది. దీంతో ప్రణయ్ స్థానంలో రాజకీయ నాయకుడైన దినేశ్‌ను బంగ్లాలో భారత హైకమిషనర్‌గా నియమించనున్నట్లు తెలుస్తున్నది. ఇదే జరిగితే బంగ్లాలో హైకమిషనర్‌గా పనిచేయనున్న తొలి రాజకీయ నేతగా నిలువనున్నారు.
2024లో బంగ్లాదేశ్‌లో జరిగిన తిరుగబాటుతో ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం కుప్పకూలిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. దీంతో ఢాకాతో ఢిల్లీ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) ఘన విజయం సాధించడం, ప్రధానిగా తారిక్ రెహమాన్ బాధ్యతలు స్వీకరించడంతో.. ఇరు దేశాల మధ్య ఇప్పుడిప్పుడే సంబంధాలు పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఏప్రిల్ 8 నుంచి మూడు రోజుల పాటు ఆ దేశ విదేశాంగ మంత్రి ఖలీలుర్ రెహమాన్ భారత్‌లో పర్యటించారు. ఈ నేథప్యంలో బంగ్లాలో భారత హైకమిషనర్ మార్పు కూడా జరుగుతున్నది.

సీనియర్ రాజకీయ నేత అయిన త్రివేదీకి బంగ్లాతోసహా పలు భాషల్లో ప్రావీణ్యం ఉన్నది. ఆయన యూపీఏ ప్రభుత్వంలో 2011 నుంచి 2012 వరకు రైల్వేశాఖ మంత్రిగా, అంతకుముందు 2009 నుంచి 2011 వరకు కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. తృణమూల్ కాంగ్రెస్‌లో అత్యధిక కాలం కొనసాగు. సీఎం మమతా బెనర్జీకి సన్నిహితుడిగా పేరొందారు. అయితే 2021లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీలో చేరారు.
కాగా, సాధారణంగా బంగ్లాదేశ్‌లో భారత హైకమిషనర్‌గా ఐఎఫ్ఎస్ (IFS) అధికారినే నియమిస్తారు. ప్రణయ్ వర్మ కూడా ఫారెన్ సర్వీసెస్‌కు చెందిన అధికారే. అయితే 1971లో మాజీ ఐఎఫ్ఎస్ సుబిమల్ దత్‌ను అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఢాకాలో హైకమినర్‌గా నియమించింది. ఆయన 1947 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి. ఆ తర్వాత ఇప్పుడే ఒక రాజకీయ నేత బంగ్లాదేశ్‌కు కమిషనర్‌గా వెళ్తుండటం తొలిసారి.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Telangana World Bank Report | తెలంగాణ ఆర్థిక స్థితిపై వరల్డ్ బ్యాంక్ సంచలన రిపోర్ట్
- ●2 BHK | డబుల్ బెడ్రూం కాలనీల్లో వాణిజ్య దుకాణాల అమ్మకానికి వేలం.. వివరాలివే..!
- ●Srinivas Goud | ఆర్డీఎస్ వద్ద అక్రమ నిర్మాణాలతో తెలంగాణకు అన్యాయం
- ●Nasha Mukt Bharat Abhiyaan | మాదకద్రవ్య రహిత భారతదేశ నిర్మాణానికి సమిష్టి కృషినే కీలకం
- ●Kadiyam Srihari vs Konda Surekha | "నేను తప్పు చేయలేదు.. మంత్రి గారే తప్పుగా అర్థం చేసుకున్నారు": కొండా సురేఖ ఫిర్యాదుపై కడియం శ్రీహరి రియాక్షన్
- ●Jagga Reddy | నేను ఒకటేసారి 'కోడి'ని తిన్నట్టు ఉంది.. 'మేడిగడ్డ' కథ : జగ్గారెడ్డి

Telangana World Bank Report | తెలంగాణ ఆర్థిక స్థితిపై వరల్డ్ బ్యాంక్ సంచలన రిపోర్ట్

2 BHK | డబుల్ బెడ్రూం కాలనీల్లో వాణిజ్య దుకాణాల అమ్మకానికి వేలం.. వివరాలివే..!

Srinivas Goud | ఆర్డీఎస్ వద్ద అక్రమ నిర్మాణాలతో తెలంగాణకు అన్యాయం

Nasha Mukt Bharat Abhiyaan | మాదకద్రవ్య రహిత భారతదేశ నిర్మాణానికి సమిష్టి కృషినే కీలకం






