man offers namaz in busy road | రద్దీ రహదారిపై నమాజ్ చేసిన వ్యక్తి.. అరెస్ట్ చేసిన పోలీసులు
man offers namaz in busy road | రద్దీ రహదారిపై ఓ వ్యక్తి నమాజ్ చేసి (man offers namaz in busy road) ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రం రాంపూర్ (Rampur)లో చోటు చేసుకుంది.
man offers namaz in busy road | రద్దీ రహదారిపై ఓ వ్యక్తి నమాజ్ చేసి (man offers namaz in busy road) ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రం రాంపూర్ (Rampur)లో చోటు చేసుకుంది. ఓ ప్రధాన కూడలిలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో ఓ వ్యక్తి రోడ్డు మధ్యలో నిల్చొని ప్రార్థనలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై పోలీసులు చర్యలు చేపట్టారు. సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు.
అదనపు పోలీస్ సూపరింటెండెంట్ అనురాగ్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని (Civil Lines police station area) షాబాద్ గేట్ క్రాసింగ్ (Shahabad Gate crossing) వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి నడిరోడ్డుపై నమాజ్ చేశాడు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ తతంగాన్నంతా అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అదికాస్తా వైరల్‌గా మారింది.
ఇక వైరల్ వీడియోపై పోలీసులు చర్యలు చేపట్టారు. బహిరంగ ప్రదేశాల్లో ఇలా నమాజ్ చేస్తూ ఇతరులకు, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించినందుకు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు వీడియో ఆధారంగా సదరు వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఆ వ్యక్తి మానసిక స్థితి సరిగా లేదని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
Also Read..
మే 6న వరంగల్‌లో బీఆర్ఎస్ భారీ బహిరంగసభ
బసవేశ్వరుని జయంతి సందర్భంగా కేసీఆర్ ఘన నివాళి
బులియన్ మార్కెట్లలో అనిశ్చిత ధోరణి.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






