Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో అనిశ్చిత ధోరణి.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..
Gold And Silver Prices Today | అమెరికా-ఇరాన్‌ల మధ్య రెండో దఫా చర్చలపై కొనసాగుతున్న అనిశ్చితి కారణంగా అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు మిశ్రమ స్పందన కనబరుస్తున్నాయి. బులియన్ మార్కెట్లు సైతం అదే ధోరణిని కొనసాగిస్తున్నాయి.
Gold And Silver Prices Today | అమెరికా-ఇరాన్‌ల మధ్య రెండో దఫా చర్చలపై కొనసాగుతున్న అనిశ్చితి కారణంగా అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు మిశ్రమ స్పందన కనబరుస్తున్నాయి. బులియన్ మార్కెట్లు సైతం అదే ధోరణిని కొనసాగిస్తున్నాయి. సోమవారం అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 43 డాలర్ల మేర తగ్గి 4,787 వద్ద ఉండగా, వెండి ధర 1.25 డాలర్ల మేర తగ్గి 79 వద్ద నిలిచింది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 1,509 పాయింట్లు (0.98 శాతం) నష్టపోయి 1,53,090 వద్ద ఉండగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 5,047 పాయింట్లు (1.96 శాతం) పతనమై 2,52,113 వద్ద ఉంది. ఇక దేశీయ స్పాట్ మార్కెట్ లో బంగారం ధర స్వల్పంగా తగ్గగా, వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు.
స్పాట్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,529 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,24,232 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,55,290 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.15,52,900 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.4,900 తగ్గింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,235 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,13,880గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,42,350 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.14,23,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.4,500 తగ్గింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,647 ఉండగా, 8 గ్రాముల ధర రూ.93,176గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,16,470 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,64,700గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.3,700 తగ్గింది.
దేశీయ మార్కెట్లో 1 కిలో వెండి ధర రూ.2,75,000 ఉండగా, తులం ధర రూ.2,750గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. అలాగే హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,80,000 ఉండగా, తులం ధర రూ.2,800 గా ఉంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. సేఫ్ హావెన్ ఆస్తులపై తగ్గుతున్న ఆసక్తి..
మే 21, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



