త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KCR | బసవేశ్వరుని జయంతి సందర్భంగా కేసీఆర్ ఘన నివాళి

KCR | భారత సామాజిక న్యాయ దార్శనికుడు, మానవతావాది శ్రీ బసవేశ్వరుని జయంతి (Basaveswaras birth anniversary) సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) నివాళుల‌ర్పించారు.

D

Telangana | Published On Apr 20, 2026, 11.15 am IST

KCR | బసవేశ్వరుని జయంతి సందర్భంగా కేసీఆర్ ఘన నివాళి
Advertisement

KCR | భారత సామాజిక న్యాయ దార్శనికుడు, మానవతావాది శ్రీ బసవేశ్వరుని జయంతి (Basaveswaras birth anniversary) సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) నివాళుల‌ర్పించారు. బ‌స‌వేశ్వ‌రుడు దేశానికి అందించిన మార్గ‌ద‌ర్శ‌క‌త్వం, సామాజిక కృషిని స్మ‌రించుకున్నారు. కులం, వర్ణం, లింగం రూపంలో దేశంలో కొనసాగుతున్న వివక్షాపూరిత, అమానవీయ మానవ సంబంధాలు రద్దుకావాలని, సమానత్వ భావన ఫరిడవిల్లాలని, పోరాడిన మానవతా వాది, సంఘ సంస్కర్త బసవేశ్వరుడు అని కేసీఆర్ కొనియాడారు.

తన సాహిత్యం ద్వారా, సమాజంలో అవగాహన, సంస్కరణలకు బాటలు వేసి.. సామాజిక న్యాయం, సమానత్వం, శ్రమకు గౌరవం అనే మహత్తర సూత్రాలను ప్రతిపాదించి, ఎనిమిది దశాబ్దాల క్రితమే అమలు చేసిన వారి దార్శనిక కార్యాచరణ, నేటి సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నదని కేసీఆర్ తెలిపారు. త్యాగాలతో సాధించుకున్న నూతన తెలంగాణ రాష్ట్రంలో తొలి పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో, బసవేశ్వరుని స్ఫూర్తితో అమలుచేసిన ప్రగతి కార్యాచరణ దళిత బహుజన సమాజాల జీవితాల్లో గుణాత్మక మార్పుకు దోహదం చేసిందన్నారు. తద్వారా సబ్బండ కులాల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచి, వారి ఆత్మ గౌరవాన్ని ద్విగుణీకృతం చేసిందని తెలిపారు.

ప్రతి ఒక్కరూ బసవేశ్వరుడి బోధనలను అనుసరించి సమానత్వం, మానవతా విలువలను కాపాడే దిశగా కృషి చేయాలని కేసీఆర్ కోరుకున్నారు. బలహీన వర్గాల అభ్యున్నతి, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించడం అనే ప్రాధాన్యతలతో పాలన కొనసాగించడం ద్వారానే బసవేశ్వరునికి మనం అందించే ఘన నివాళి అని కేసీఆర్ స్పష్టం చేశారు.

Also Read..

బులియ‌న్ మార్కెట్ల‌లో అనిశ్చిత ధోర‌ణి.. స్వ‌ల్పంగా తగ్గిన బంగారం ధ‌ర‌లు..

ఆర్టీసీ స‌మ్మెకు కౌంట్‌డౌన్‌.. మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి నుంచే బ‌స్సులు బంద్‌!

అమెరికా నౌక‌ల‌పై ఇరాన్ డ్రోన్ దాడులు

Advertisement
Advertisement