BRS | మే 6న వరంగల్‌లో బీఆర్ఎస్ భారీ బహిరంగసభ
BRS | బీఆర్ఎస్ (BRS) పార్టీ మరో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నది. మే 6న వరంగల్‌లో (Warangal) పెద్దఎత్తున సభను నిర్వహించనున్నది.
BRS | త్రినేత్ర.న్యూస్: బీఆర్ఎస్ (BRS) పార్టీ మరో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నది. మే 6న వరంగల్‌లో (Warangal) పెద్దఎత్తున సభను నిర్వహించనున్నది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ ప్రకటించిన చోట సభ నిర్వహణకు సన్నాహాలు ప్రారంభించింది. దీనికోసం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించినట్లు తెలుస్తున్నది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి.. కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లక్ష మందితో జగిత్యాలలో భారీ బహిరంగ సభను పార్టీ నిర్వహిస్తున్నది. దీనికోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేసింది. ఇప్పటికే జగిత్యాల మొత్తం గులాబీ మయమైంది.
చాలా రోజుల తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభలో ప్రసంగించ నుండటంతో పార్టీ కార్యకర్తలు, అభిమానుల్లో ఫుల్ జోష్ నెలకొన్నది. దీనిని ఇలాగే కొనసాగించాలని పార్టీ అధినాయకత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వచ్చే నెల 6న వరంగల్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించింది. దీనికి పెద్ద సంఖ్యలో జన సమీకరణ చేసి రాష్ట్రంలో తమకు తిరుగులేదని నిరూపించనుంది.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



