Punjab National Bank | పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ మోసం.. కరెన్సీ చెస్ట్‌లో రూ.7.40 కోట్ల నకిలీ నోట్లు
Punjab National Bank | ఉత్తరప్రదేశ్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (Punjab National Bank)లో భారీ మోసం వెలుగు చూసింది. కరెన్సీ చెస్ట్ నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India)కి పంపిన నగదును సాధారణ తనిఖీ చేయగా.. రూ. 4.36 లక్షలు తక్కువగా ఉన్నట్లు తేలింది. దీనిపై ఆడిట్ నిర్వహించగా కరెన్సీ చెస్ట్‌లో దాదాపు రూ. 7.40 కోట్ల విలువైన నకిలీ నోట్లు ఉన్నట్లు తేలింది.
Punjab National Bank | త్రినేత్ర.న్యూస్ : ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్ (Saharanpur)లో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ (Punjab National Bank)లో భారీ మోసం వెలుగు చూసింది. బ్యాంకులోని కరెన్సీ చెస్ట్‌లో సుమారు రూ. 7.40 కోట్ల విలువైన నకిలీ కరెన్సీ (fake currency) బయటపడింది. బ్యాంకు అంతర్గత ఆడిట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనల ప్రకారం జరిపిన తనిఖీల్లో ఈ భారీ మోసం వెలుగులోకి వచ్చింది.
పీఎన్‌బీ చీఫ్ మేనేజర్ నిషా సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 10-11 తేదీల మధ్య పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కరెన్సీ చెస్ట్ నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India)కి పంపిన నగదును సాధారణ తనిఖీ చేయగా.. రూ. 4.36 లక్షలు తక్కువగా ఉన్నట్లు తేలింది. దీనిపై బ్యాంకు అధికారులు ఆడిట్ నిర్వహించారు. ఈ విచారణలో షాకింగ్ విషయం బయటపడింది. కరెన్సీ చెస్ట్‌లో దాదాపు రూ. 7.40 కోట్ల విలువైన నకిలీ నోట్లు ఉన్నట్లు తేలింది. కరెన్సీ చెస్ట్ నుంచి రూ. 4.36 లక్షల నగదు కొరతపై అధికారులు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు.
బ్యాంకులో పార్ట్ టైమ్ హౌస్ కీపర్‌గా పనిచేస్తున్న విశాల్ కుమార్ కరెన్సీ నోట్ల కట్టల నుంచి డబ్బును తీస్తూ అడ్డంగా దొరికిపోయాడు. దీంతో బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు విశాల్ కుమార్‌పై పోలీసులు చోరీ కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోందని నిషా సింగ్ చెప్పారు. దర్యాప్తు నివేదిక సమర్పించిన తర్వాతే నకిలీ కరెన్సీ చెస్ట్‌లోకి ఎలా చేరిందనే పూర్తి వివరాలు స్పష్టమవుతాయని ఆమె పేర్కొన్నారు.
మరోవైపు నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గానూ సీనియర్ డివిజనల్ మేనేజర్ రవి కుమార్ కాసేతో పాటు కరెన్సీ చెస్ట్ మేనేజర్లు సుశీల్ శర్మ, అమిత్ కుమార్‌లను బ్యాంక్ యాజమాన్యం సస్పెండ్ చేసింది. బ్యాంక్ నోడల్ అధికారి అరుణ్ కుమార్ చౌబే ఇచ్చిన ఫిర్యాదు మేరకు సహారన్‌పూర్ సదర్ బజార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read..
ఢిల్లీలో సెప్టెంబర్ 5 నిరసన క్యాన్సిల్.. సుప్రీంకోర్టులో కేంద్రం కీలక ప్రకటనతో సీజేపీ వెనక్కి
ఉగ్రవాదం ఎవరికీ వ్యూహాత్మక సంపదగా మారకూడదు.. ప్రపంచానికి ప్రధాని మోదీ గట్టి సందేశం
సీఎం ₹11 వేల కోట్లు ఇచ్చామంటే.. ఆర్టీసీ ఎండీ ఏమో ₹2,607 కోట్లు రావాలంటున్నారు: తేలేదెప్పుడు?
తాజావార్తలు
- ●Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు
- ●Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..
- ●Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
- ●CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి
- ●KRMB | తాగు నీటి అవసరాలకే నీటిని వినియోగించాలి.. కేఆర్ఎంబీ ఆదేశాలు
- ●CM Revanth Reddy | హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు

Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..

Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి





