Sugar Storage | చక్కెర నిల్వలపై కేంద్రం కీలక నిర్ణయం.. డీలర్లకు కొత్త పరిమితి
Sugar Storage | చక్కెర డీలర్లు నిల్వ చేసుకునే చక్కెర పరిమితిని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ప్రస్తుతం ఉన్న 4వేల క్వింటాళ్ల పరిమితిని 2వేల క్వింటాళ్లకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త నిబంధన సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి రానుంది.
Sugar Storage | చక్కెర డీలర్లు నిల్వ చేసుకునే చక్కెర పరిమితిని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ప్రస్తుతం ఉన్న 4వేల క్వింటాళ్ల పరిమితిని 2వేల క్వింటాళ్లకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త నిబంధన సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి రానుంది. దేశీయ మార్కెట్‌లలో చక్కెర తగినంతగా అందుబాటులో ఉండేలా చూడడం, నిల్వదారులు చక్కెరను కృత్రిమంగా నిల్వ చేయడం, ఊహాజనిత వ్యాపారానికి పాల్పడటాన్ని అడ్డుకోవడం, వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటం, ధరలను స్థిరంగా ఉంచడం ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశంగా కేంద్రం తెలిపింది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలిపిన ప్రకారం.. ఆగస్టు 1 నుంచి దేశవ్యాప్తంగా చక్కెర డీలర్లకు 4వేల క్వింటాళ్ల నిల్వ పరిమితి అమల్లో ఉంది. తాజాగా ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలు చేపట్టి ఈ పరిమితిని 2వేల క్వింటాళ్లకు తగ్గించింది. కొత్త నిబంధనల ప్రకారం సెప్టెంబర్ 15 నుంచి చక్కెర డీలర్లు అందుకున్న నిల్వను 30 రోజులకు మించి తమ వద్ద ఉంచుకోరాదు.
2వేల క్వింటాళ్లకే పరిమితి..
అదేవిధంగా దేశంలోని ఏ ప్రాంతంలోనైనా, ఏ సమయంలోనైనా డీలర్లు 2వేల క్వింటాళ్లకు మించి చక్కెర నిల్వ చేసుకోకూడదు. అయితే ప్రాంతీయ మార్కెట్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కోల్‌కతా, దాని విస్తరించిన మహానగర ప్రాంతాలకు మాత్రం 4వేల క్వింటాళ్ల నిల్వ పరిమితి కొనసాగుతుంది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర నుంచి చక్కెరను సేకరించి తూర్పు ప్రాంతాలతో పాటు ఈశాన్య రాష్ట్రాలకు సరఫరా చేసే ప్రధాన కేంద్రంగా కోల్‌కతా వ్యవహరిస్తోంది. ఈ కారణంగా కోల్‌కతా, దాని విస్తరించిన మహానగర ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న 4వేల క్వింటాళ్ల పరిమితినే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కఠిన పర్యవేక్షణ వ్యవస్థ అమలు..
చక్కెరను పెద్ద మొత్తంలో నిల్వ చేసి మార్కెట్‌లో కొరత సృష్టించడం, ఊహాజనిత వ్యాపారాన్ని ప్రోత్సహించడం, అధికంగా నిల్వలు పేరుకుపోవడాన్ని నిరోధించడమే ఈ చర్య లక్ష్యమని కేంద్రం పేర్కొంది. దీని ద్వారా సరఫరా వ్యవస్థలో చక్కెర క్రమబద్ధంగా రవాణా అవుతూ, వినియోగదారులకు సరసమైన ధరలకు నిరంతరంగా అందుబాటులో ఉండే అవకాశం ఉంటుందని తెలిపింది. కొత్త నిల్వ పరిమితుల అమలుపై ప్రభుత్వం తీవ్ర పర్యవేక్షణ చేపట్టనుంది. చక్కెర డీలర్ల వద్ద ఉన్న నిల్వలను భౌతికంగా తనిఖీ చేయడంతో పాటు, నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకునేలా పర్యవేక్షణ వ్యవస్థను మరింత పటిష్ఠం చేయనుంది.
తాజావార్తలు
- ●Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు
- ●Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..
- ●Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
- ●CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి
- ●KRMB | తాగు నీటి అవసరాలకే నీటిని వినియోగించాలి.. కేఆర్ఎంబీ ఆదేశాలు
- ●CM Revanth Reddy | హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు

Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..

Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి






