Rashmika Mandanna | మైసా ఆగమనం అప్పుడే – నెల రోజుల గ్యాప్‌లో రెండు సినిమాలతో రష్మిక డబుల్ ట్రీట్
రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న లేడీ ఓరియెంటెడ్ మూవీ మైసా రిలీజ్ డేట్ ఖరారైంది. నవంబర్ 27న ఈ మూవీ థియేటర్లలోకి రాబోతుంది. రిలీజ్ డేట్‌ను రివీల్ చేస్తూ మేకర్స్ ఓ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో పోరాట యోధురాలిగా నేషనల్ క్రష్ కనిపిస్తోంది.
Rashmika Mandanna | రష్మిక మందన్న పేరు చెప్పగానే అల్లరి అమ్మాయి తరహా పాత్రలే ఎక్కువగా గుర్తొస్తాయి. తొలి సినిమా ఛలో నుంచి ఇటీవల రిలీజైన బాలీవుడ్ మూవీ కాక్ టెయిల్ 2 వరకు కెరీర్‌లో ఎక్కువగా సాఫ్ట్, మోడ్రన్ తరహా క్యారెక్టర్స్‌లోనే కనిపించింది నేషనల్ క్రష్. ఫస్ట్ టైమ్ యాక్షన్ రోల్ చేస్తోంది. ఓ పోరాట యోధురాలిగా విశ్వరూపాన్ని చూపించేందుకు సిద్ధమైంది. రష్మిక మందన్న హీరోయిన్‌గా తెలుగులో మైసా పేరుతో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ తెరకెక్కుతోంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్నారు.
నవంబర్‌లో రిలీజ్...
మైసా మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ మంగళవారం ఖరారు చేశారు. నవంబర్ 27న థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. రష్మిక మందన్న కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో చేతిలో ఈటె పట్టుకొని యోధురాలిగా రష్మిక కనిపిస్తోంది. ఓ చేతికి కడియాలు, మరో చేతికి బేడీలు ఉండటం ఆసక్తిని పంచుతోంది. చీర ధరించి ఒంటినిండా గాయాలతో పవర్‌ఫుల్ లుక్‌లో ఈ పోస్టర్‌ను డిజైన్ చేశారు. రష్మిక వెనుక కొడవళ్లు పట్టుకొని చాలా మంది మహిళలు ఉన్నారు. భయం లేని మర్గాన్ని ఆమె ఎంచుకుంది. చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం మైసా సొంతం అంటూ రిలీజ్ డేట్‌కు ఓ క్యాప్షన్‌ను మేకర్స్ జోడించారు.
గిరిజన యువతిగా...
ఔట్ అండ్ ఔట్ యాక్షన్ రోల్‌లో రష్మిక మందన్న నటిస్తున్న తొలి సినిమా ఇది. ఇందులో గిరిజన యువతిగా నేషనల్ క్రష్ కనిపించబోతుంది. ఈ సినిమా కోసం ఫారిన్ మార్షల్ ఆర్ట్స్‌లో స్పెషల్‌గా ట్రైనింగ్ తీసుకుంది. రష్మికపై వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని మేకర్స్ చెబుతోన్నారు. మైసా మూవీకి జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందిస్తున్నారు.
నెల రోజుల గ్యాప్‌లో...
మైసాలో ఈశ్వరీరావు, గురు సోమసుందరం, రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే మైసా షూటింగ్‌లో రష్మిక గాయపడింది. ఈ ప్రమాదం కారణంగా సర్జరీ జరగడంతో నెల రోజులు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. సోమవారం రణబాలి షూటింగ్‌తో తిరిగి షూటింగ్‌లను మొదలుపెట్టింది. కాగా రెండు నెలల్లో రష్మిక మందన్న నటించిన రెండు సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. భర్త విజయ్ దేవరకొండతో కలిసి నటించిన రణబాలి అక్టోబర్ 16న రిలీజ్ అవుతోంది. ఆ తర్వాత నెల గ్యాప్‌లోనే మైసా థియేటర్లలోకి రాబోతుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Sreeleela | బాలకృష్ణ తనయుడితో రొమాన్స్ – తెలుగులో శ్రీలీలకు క్రేజీ ఛాన్స్
సెప్టెంబర్ 13, 2026

Rashmika Mandanna | ఆనంద్ దేవరకొండ ఎపిక్‌కు రష్మిక మందన్న రివ్యూ – కన్నీళ్లు పెట్టుకున్నా విజయ్ దేవరకొండ
సెప్టెంబర్ 13, 2026

Kajal Aggarwal | డబ్బు, స్టేటస్ కాదు .. అదే ముఖ్యం – వైవాహిక జీవితంపై కాజల్ పోస్ట్
సెప్టెంబర్ 13, 2026
తాజావార్తలు
- ●KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
- ●Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్
- ●KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు
- ●Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్
- ●Mega Job Mela | సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్ మేళా.. 4 వేల మంది ఉద్యోగవకాశాలు
- ●Vinayaka Chavithi | వినాయకుడి పంచరత్నాలు.. పఠిస్తే ప్రశాంతత.. స్మరిస్తే విఘ్నవినాశనం

KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్

KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు

Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్



