త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sumithra Anand | క‌విత‌! వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నలకు సమాధానం చెప్పు

Sumithra Anand | మాజీ మంత్రి వేముల ప్ర‌శాంత్‌రెడ్డి ప్ర‌శ్న‌ల‌కు క‌ల్వ‌కుంట్ల క‌విత స‌మాధానం చెప్పాలని టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్ డిమాండ్ చేశారు. ఆమె కాంగ్రెస్ నేత‌ల్లా, రేవంత్‌రెడ్డిలా మాట్లాడుతున్నార‌ని ఆరోపించారు.

S

Telangana | Published On Sep 1, 2026, 3.29 pm IST

Sumithra Anand | క‌విత‌! వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నలకు సమాధానం చెప్పు
Advertisement
  • వేముల ఉద్య‌మ‌కారుడు.. మొద‌టి నుంచి పార్టీలోనే ఉన్నారు
  • బీఆర్ఎస్ నాయ‌కులను తిట్ట‌డానికే పార్టీ పెట్టారా?
  • ఆమె కాంగ్రెస్ నేతల్లా, రేవంత్ రెడ్డిలా మాట్లాడుతున్నారు
  • తెలంగాణ ప్రయోజనాల కోసం పార్టీ పెడితే ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి
  • పునాదుల‌ను విస్మ‌రిస్తూ మాట్లాడ‌డం క‌రెక్టు కాదు
  • క‌విత‌పై టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్ ఫైర్‌

Sumithra Anand త్రినేత్ర‌.న్యూస్: మాజీ మంత్రి వేముల ప్ర‌శాంత్‌రెడ్డి ప్ర‌శ్న‌ల‌కు క‌ల్వ‌కుంట్ల క‌విత స‌మాధానం చెప్పాలని టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్ డిమాండ్ చేశారు. ఆమె కాంగ్రెస్ నేత‌ల్లా, రేవంత్‌రెడ్డిలా మాట్లాడుతున్నార‌ని ఆరోపించారు. క‌విత‌కు కేసీఆర్ జ‌న్మ‌నిస్తే బీఆర్ఎస్ రాజ‌కీయ జ‌న్మ‌నిచ్చింద‌న్నారు. పునాదుల‌ను మ‌రిచి మాట్లాడ‌డం మంచిది కాద‌న్నారు. ఒక‌వేళ తెలంగాణ ప్ర‌యోజ‌నాల కోసమే ఆమె పార్టీ పెడితే ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించాల‌ని హిత‌వు ప‌లికారు. క‌విత ఎవ‌రు వ‌దిలిన బాణ‌మో బ‌య‌ట చ‌ర్చ జ‌రుగుతోంద‌న్నారు. నిన్న నిజామాబాద్‌లో క‌విత‌ మాట్లాడిన తీరుపై మంగ‌ళ‌వారం ఆమె మండిప‌డ్డారు.

కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీపైన, నాయకులపైన విమర్శలు చేశారు. కవితకు కేసీఆర్ జన్మనిస్తే బీఆర్ఎస్ రాజకీయ జన్మను ఇచ్చింది. పునాదులను విస్మరిస్తూ కవిత మాట్లాడటం మంచిది కాదు. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాత ఉద్యమ సమయం నుంచి కేసీఆర్‌తో ఉన్న నాయకులను కవిత టార్గెట్ చేశారు. కవిత కావాలని పార్టీ లైన్ అతిక్రమించి మాట్లాడారు. తన తండ్రి నుంచి దూరం జరిగారు. కేసీఆర్‌ను తక్కువ చేసి మాట్లాడుతున్నారు. కేసీఆర్‌కు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు.

వేముల ప్రశాంత్ రెడ్డి ఉద్యమకారుడు, తొలి నుంచి బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. కవిత అధికార కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించాలి. రాజకీయ పార్టీని ఏ ఉద్దేశంతో పెట్టారు, ఏ లక్ష్యంతో పెట్టారో ప్రజలకు చెప్పాలి. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేని పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి పాలన ఉంది. బీఆర్ఎస్ పార్టీని, నాయకులను తిట్టడానికి కవిత పార్టీ పెట్టారా? కవిత ఇప్పటికైనా ఆత్మ విమర్శ చేసుకోవాలి.

కేసీఆర్‌ను తిడుతున్న రేవంత్‌ను ప్ర‌శ్నించ‌వా?

కాళేశ్వరం జలాలు నిజామాబాద్ జిల్లాలో ఒక్క ఎకరం అయినా పారలేదని కవిత కాంగ్రెస్ నేతల్లా, రేవంత్ రెడ్డిలా మాట్లాడుతున్నారు. కవిత వ్యక్తిత్వ హననానికి పాల్పడటం మంచిది కాదు. తెలంగాణ ప్రజలకు కవిత సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. కవిత మాటలను ప్రజలు నమ్మరు. ప్రజల నమ్మకం కోల్పోయే విధంగా మాట్లాడవద్దు. బీఆర్ఎస్ కంటే రెట్టింపు పోరాటం కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసి చూపెట్టాలి. సీఎం రేవంత్ రెడ్డి విచక్షణ మరిచిపోయి కేసీఆర్‌ను వ్యక్తిగతంగా మాటలు అంటున్నారు. దీనిపై రేవంత్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించడం లేదు?

ఎవ‌రి కోసం మాట్లాడుతున్న‌వో అర్థ‌మ‌వుతోంది..

కేసీఆర్‌పై ప్రజల్లో ఉన్న అభిమానాన్ని తుడిచివేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి పాలన వదిలి కబ్జాలు,సెటిల్‌మెంట్లు చేకుంటున్నారు. ఎవరు నంది ఎవరు పంది అనేది తెలంగాణ ప్రజలకు తెలుసు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పాల్సిన అవసరం లేదు. భూముల మీద నుంచి తన దృష్టిని రేవంత్ రెడ్డి మరల్చుకోవాలి. కవిత తన పార్టీ మనుగడ ఉండాలంటే రేవంత్ రెడ్డిని ప్రశ్నించాలి. కవిత ఎవరి కోసం మాట్లాడుతున్నారో అర్థం చేసుకోవాలి. కేసీఆర్ కన్న కూతురిని ఎందుకు దూరం చేసుకున్నారో.. దాని వెనుక ఉన్న కారణాలు అర్థం చేసుకోవాలి. కేసీఆర్‌కు, బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడాలి అని కవితకు ప్రశాంత్ రెడ్డి చెప్పారా? కవిత అబద్దాలు చెప్తున్నారు అని సుమిత్రానంద్ మండిప‌డ్డారు.

ఈ మీడియా స‌మావేశంలో మహిళా నేతలు చారులత రాథోడ్, రజిత రావు పాల్గొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement