PNB Recruitment | పీఎన్‌బీలో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు.. తెలంగాణలో 41 ఖాళీలు
PNB Recruitment | దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (Punjab National Bank) హెచ్ఆర్ విభాగంలో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. 17 రాష్ట్రాల్లోని వివిధ శాఖల్లో 554 పోస్టులు ఖాళీగా (PNB Recruitment) ఉన్నాయి.
PNB Recruitment | త్రినేత్ర.న్యూస్: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (Punjab National Bank) హెచ్ఆర్ విభాగంలో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. 17 రాష్ట్రాల్లోని వివిధ శాఖల్లో 554 పోస్టులు ఖాళీగా (PNB Recruitment) ఉన్నాయి. అర్హత కలిగినవారు https://pnb.bank.in/ దరఖాస్తు చేసుకోచ్చు. స్థానిక భాష తప్పనిసరిగా తెలిసి ఉండాలి. రాతపరీక్ష ద్వారా అభ్‌యర్థులను ఎంపిక చేస్తారు. ఉద్యోగంలో చేరిన తర్వాత నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు జీతం వస్తుంది. తెలంగాణలో (Telangana) 41, ఆంధ్రప్రదేశ్‌లో 4 ఖాళీలు ఉన్నాయి. ఒక అభ్యర్థి ఒక రాష్ట్రానికి మాత్రం దరఖాస్తు చేసుకోవాలి.
మొత్తం ఖాళీలు: 545 పోస్టులు
తెలంగాణలో 41 పోస్టులు, అస్సాం 85, పశ్చిమ బెంగాల్ 80, గుజరాత్ 77, కర్ణాటక 78, మహారాష్ట్ర 67, తమిళనాడు 51, త్రిపుర 18, జమ్ముకశ్మీర్ 9, మేఘాలయ 8, మణిపుర్ 6, మిజోరం 5, నాగాలాండ్ 5, సిక్కిం 5, ఆంధ్రప్రదేశ్ 4, అరుణాచల్ ప్రదేశ్ 4, లడఖ్‌లో 2 చొప్పున పోస్టులు ఉన్నాయి.
అర్హతలు: 2026, ఆగస్టు 9 నాటికి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేయాలి. ఆర్బీఐ గుర్తింపు పొందిన కమర్షియల్ లేదా రీజనల్ రూరల్ బ్యాంక్‌లో కనీసం ఏడాది పని చేసిన అనుభవం తప్పనిసరి. అభ్యర్థులు సంబంధిత రాష్ట్ర స్థానిక భాష చదవడం, రాయడం, మాట్లాడడంలో ప్రావీణ్యం ఉండాలి. 2026, జూలై 1 నాటికి 20 నుంచి 30 ఏండ్ల మధ్య వయస్కులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, స్థానిక భాషా పరీక్ష
రాత పరీక్షను మొత్తం 150 మార్కులకు నిర్వహిస్తారు. అందులో రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ (25 ప్రశ్నలు 25 మార్కులు), డేటా అనాలసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్ నుంచి 25 ప్రశ్నలు, 25 మార్కులు), ఇంగ్లిష్ నుంచి 25 ప్రశ్నలు, 25 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 25 ప్రశ్నలు, 25 మార్కులు, జనరల్, ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్‌నెస్ నుంచి 50 ప్రశ్నలు 50 మార్కులు ఉంటాయి. 180 నిమిషాల్లో పరీక్ష రాయాలి. ప్రతీ తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత విధిస్తారు.
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్, కరీంనగర్, ఖమ్మం.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో. ఒక అభ్యర్థి ఒక రాష్ట్రానికి సంబంధించిన పోస్టులకు మాత్రమే అప్లయ్ చేసుకోవాలి. రెండు మూడు స్టేట్స్ కలిపి దరఖాస్తు చేయకూడదు.
అప్లికేషన్ ఫీజు: రూ.1180, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.59
దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 9
ఆన్‌లైన్ పరీక్ష: ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో
వెబ్‌సైట్: https://pnb.bank.in/
సంబంధిత వార్తలు

YTPS | యాదాద్రి థర్మల్ ప్లాంట్‌కు నైని బొగ్గు.. తొలిసారిగా తీసుకువచ్చిన రైలు..!
సెప్టెంబర్ 1, 2026

Minister Ponnam | వెయ్యి రోజుల్లో ఆర్టీసీలో విప్లవాత్మక మార్పులు
సెప్టెంబర్ 1, 2026

Minister Ponnam | కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై స్టే ఎత్తివేత హర్షణీయం : మంత్రి పొన్నం ప్రభాకర్
సెప్టెంబర్ 1, 2026
తాజావార్తలు
- ●Aarogyasri DEOs Termination | 22 ఏళ్ల సేవలకు ఇదేనా బహుమతి
- ●YTPS | యాదాద్రి థర్మల్ ప్లాంట్‌కు నైని బొగ్గు.. తొలిసారిగా తీసుకువచ్చిన రైలు..!
- ●Devarakonda Family | మూడు నెలల ...మూడు సినిమాలు - దేవరకొండ ఫ్యామిలీ నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్!
- ●Chanakya Strategies Report Telangana | కాంగ్రెస్‌పై తీవ్ర అసంతృప్తి.. వచ్చేది బీఆర్ఎస్సే
- ●Minister Ponnam | వెయ్యి రోజుల్లో ఆర్టీసీలో విప్లవాత్మక మార్పులు
- ●Team India | అఫ్గాన్‌తో టీ20 సిరీస్‌కు భారత్ జట్టు ప్రకటన.. మళ్లీ జట్టులోకి వచ్చిన సంజూ శాంసన్

Aarogyasri DEOs Termination | 22 ఏళ్ల సేవలకు ఇదేనా బహుమతి

YTPS | యాదాద్రి థర్మల్ ప్లాంట్‌కు నైని బొగ్గు.. తొలిసారిగా తీసుకువచ్చిన రైలు..!

Devarakonda Family | మూడు నెలల ...మూడు సినిమాలు - దేవరకొండ ఫ్యామిలీ నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్!

Chanakya Strategies Report Telangana | కాంగ్రెస్‌పై తీవ్ర అసంతృప్తి.. వచ్చేది బీఆర్ఎస్సే



