MLA Prashanth Reddy | కాంగ్రెస్‌తో మంతనాలు చేయలేదని లక్ష్మీనరసింహస్వామి గుడిలో ఉండి చెబుతున్నా.. కవిత చెప్పగలరా?
MLA Prashanth Reddy | కాంగ్రెస్‌తోనే తాను మంతనాలు చేయలేదని లక్ష్మీనరసింహస్వామి గుడిలో ఉండి చెబుతున్నానని.. ఇదే విషయాన్ని టీఆర్ఎస్ పార్టీ చీఫ్ కవిత చెప్పగలరా అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ అంటేనే ప్రశాంత్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి అంటేనే బీఆర్ఎస్ పార్టీ అని స్పష్టం చేశారు.
- మొన్నటి వరకు కేసీఆర్ బిడ్డ అనే గౌరవం ఉండే
- నిన్నటి మాటలతో ఆ గౌరవం పోయింది
- ఇప్పుడు కేసీఆర్ వెంట ఉన్నది నేనా.. కవితనా?
- కేసీఆర్‌కు దగ్గర ఉన్నోళ్లనే ఆమె టార్గెట్ చేస్తుంది
- బీఆర్ఎస్ అంటేనే ప్రశాంత్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి అంటేనే బీఆర్ఎస్ పార్టీ
- కవిత కామెంట్స్‌పై తీవ్రంగా రియాక్ట్ అయిన మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి
MLA Prashanth Reddy | త్రినేత్ర.న్యూస్: కాంగ్రెస్‌తోనే తాను మంతనాలు చేయలేదని లక్ష్మీనరసింహస్వామి గుడిలో ఉండి చెబుతున్నానని.. ఇదే విషయాన్ని టీఆర్ఎస్ పార్టీ చీఫ్ కవిత చెప్పగలరా అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ అంటేనే ప్రశాంత్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి అంటేనే బీఆర్ఎస్ పార్టీ అని స్పష్టం చేశారు. కవిత మధ్యలో వచ్చి మధ్యలో పోయారని విమర్శించారు. ఇప్పుడు కష్టకాలంలో కేసీఆర్ వెంట ఉన్నది నేనా.. కవితనా అని సూటి ప్రశ్నలు సంధించారు. కవితపై మొన్నటి వరకు కేసీఆర్ బిడ్డగా గౌరవం ఉండేదని.. నిన్నటి మాటలతో ఆ గౌరవాన్ని ఆమె పోగొట్టుకుందన్నారు. ఈమేరకు నిజామాబాద్‌లో నిన్న కవిత చేసిన వ్యాఖ్యలపై మంగళవారం ఆయన రియాక్ట్ అయ్యారు. కవితకు గట్టి కౌంటరిచ్చారు.
కేసీఆర్‌తో కలపడానికే ప్రయత్నించినా..
కవితను కేసీఆర్‌ను నేను కలపడానికి ప్రయత్నం చేసిన్నా విడగొట్టడానికి ప్రయత్నం చేసిన్నా అనే విషయం కేసీఆర్‌కు బాగా తెలుసు. పార్టీ లైను దాటిన తర్వాతనే కేసీఆర్ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. నేను మా తండ్రి వేముల సురేందర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీకి వ్యవస్థాపక సభ్యులం. 2001 తెలంగాణ ఆవిర్భావానికన్న ముందే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీతో నేను మంతనాలు చేశానని అంటున్న కవిత.. ఇప్పుడు కష్ట కాలంలో కేసీఆర్ వెంట ఉన్నది నేనా కవితనా? అసెంబ్లీలో, అసెంబ్లీ బయట, జిల్లాలో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నది ప్రశాంత్ రెడ్డినా.. కవితనా?
నిరాధారణమైన ఆరోపణలు ఎవరి లాభం కోసం చేస్తున్నారు. స్వలాభం కోసం వ్యక్తిగత ప్రతిష్టలు దెబ్బ తీసే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. నాపై నిరాధారమైన ఆరోపణలు చేసే హక్కు కవితకు లేదు. మొదటి నుంచి టీఆర్ఎస్ పార్టీకి వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నా జగదీశ్వర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, హరీష్ రావు, మాలాంటి వాళ్లను కవిత టార్గెట్ చేస్తున్నారు. కేసీఆర్‌కు దగ్గరగా ఉన్న వారిని కవిత టార్గెట్ చేస్తుంది.
సింపతి కోసమే కన్నీళ్లు..
ప్రత్యక్షంగా మా నాయకత్వాన్ని బలహీనపరిచి పరోక్షంగా అధికార పార్టీకి కవిత న్యాయం చేస్తుంది. కవిత సభలో కన్నీళ్లు పెట్టుకోవడం రాజకీయంగా సింపతిని గెయిన్ చేయడానికి అని అర్థం అవుతుంది. అది ఆమె విజ్ఞతకు వదిలేస్తున్నాం. కవిత చేసే ఈ పనుల వల్ల కేసీఆర్ ఎంత మనోవేదనకు, మానసిక క్షోభకు గురవుతున్నారో బిడ్డగా ఆమె ఆలోచించడం లేదు.
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్. ఆయనపైన, కేటీఆర్, హరీష్ రావుల పైన విమర్శలు చేయగా లేనిది మాపై చేయడం పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించలేదు. కానీ బాధగా అనిపించింది. సొంత లాభం కోసం కవిత మాట్లాడటం పెద్ద బాధగా అనిపించలేదు. కవితను రెండుసార్లు ఎమ్మెల్సీగా చేయడంలో నా పాత్ర ఏందో కేసీఆర్ బాగా తెలుసు అని ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు
- ●Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..
- ●Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
- ●CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి
- ●KRMB | తాగు నీటి అవసరాలకే నీటిని వినియోగించాలి.. కేఆర్ఎంబీ ఆదేశాలు
- ●CM Revanth Reddy | హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు

Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..

Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి




