RBI | బలహీమైన రుతుపవనాలతో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం.. ఆర్‌బీఐ హెచ్చరికలు..
RBI | అమెరికా-ఇరాన్‌ల మధ్య జరిగిన యుద్ధం కారణంగా ఇప్పటికే ఇంధన ధరలు, తద్వారా రవాణా, ఆహార ధరలు భారీగా పెరిగి దేశ ప్రజలు అల్లాడిపోతున్న నేపథ్యంలో ఆర్‌బీఐ మరో పిడుగు లాంటి వార్త చెప్పింది. జూన్ బులెటిన్ స్టేట్ ఆఫ్ ది ఎకానమీ వ్యాసంలో ఆర్‌బీఐ పలు హెచ్చరికలు జారీ చేసింది.
RBI | అమెరికా-ఇరాన్‌ల మధ్య జరిగిన యుద్ధం కారణంగా ఇప్పటికే ఇంధన ధరలు, తద్వారా రవాణా, ఆహార ధరలు భారీగా పెరిగి దేశ ప్రజలు అల్లాడిపోతున్న నేపథ్యంలో ఆర్‌బీఐ మరో పిడుగు లాంటి వార్త చెప్పింది. జూన్ బులెటిన్ స్టేట్ ఆఫ్ ది ఎకానమీ వ్యాసంలో ఆర్‌బీఐ పలు హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం యుద్ధం ముగిసి ఆయా దేశాలు శాంతి చర్చల దిశగా కొనసాగుతున్నప్పటికీ దేశంలో బలహీనమైన రుతుపవనాల కారణంగా వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని, దీంతో రానున్న రోజుల్లో పలు ఉత్పత్తులు, నిత్యావసరాల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని తెలిపింది. దీని వల్ల దేశ ఆర్థిక వృద్ధికి కొత్త సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని, దేశ ప్రజల్లో ఆందోళనలు నెలకొనే అవకాశాలు ఉన్నాయని ఆర్బీఐ తెలియజేసింది. బలహీనమైన నైరుతి రుతుపవనాలు దేశ ఆర్థిక వ్యవస్థకు ఆందోళనకరంగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది.
అధికమవనున్న ద్రవ్యోల్బణం..
భారత్ వ్యవసాయ రంగంపై ఇప్పటికీ అధిక శాతం ఆధారపడి ఉంది. గ్రామీణ మార్కెట్ డిమాండ్ కూడా చాలా వరకు వర్షపాతంపైనే ఆధారపడి ఉంటుంది. అందువల్ల తక్కువ వర్షపాతం నమోదైతే అది నేరుగా ఆహార ఉత్పత్తిని దెబ్బ తీస్తుంది. దీంతో నిత్యావసరాల ధరలు భారీగా పెరుగుతాయి. ఇది అధిక ద్రవ్యోల్బణానికి దారి తీస్తుంది. దీని వల్ల సామాన్యుల కొనుగోలు శక్తి గణనీయంగా తగ్గుతుంది. అదే గనక జరిగితే తీవ్ర అస్థిర పరిస్థితులు ఏర్పడుతాయని ఆర్‌బీఐ హెచ్చరించింది. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, అంతర్జాతీయ ఆర్థిక వాతావరణం ఇంకా పూర్తిగా స్థిరపడలేదని, ప్రపంచవ్యాప్తంగా ఇంకా ఆయా విషయాల్లో ఆందోళనలు నెలకొన్నాయని స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్‌ల మధ్య కుదిరిన శాంతి ఒప్పందం అంతర్జాతీయ మార్కెట్లకు కాస్త ఊరటనిచ్చే విషయం అయినప్పటికీ, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ వాణిజ్య అనిశ్చితులు ఇంకా పూర్తిగా తొలగిపోలేదని తెలిపింది. ఒకవేళ ప్రస్తుత అంతర్జాతీయ ఒప్పందాలు బలహీనపడ్డా, ఉద్రిక్తతలు మళ్లీ పెరిగినా అది అంతర్జాతీయ మార్కెట్లు, వివిధ దేశాల పెట్టుబడులపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని పేర్కొంది.
సిద్ధంగా ఉండాలి..
ప్రనంచవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న ఉద్రిక్తతలు కాస్త తగ్గినట్లు కనిపిస్తున్నా, భవిష్యత్తులో మళ్లీ ఆ ఉద్రిక్తతలు పెరిగితే అవి సుదీర్ఘ ఆర్థిక పరిణామాలకు దారి తీస్తాయని ఆర్‌బీఐ బులెటిన్ స్పష్టం చేసింది. దీని వల్ల అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం వేగంగా పెరుగుతుందని, ఇంధన సరఫరా మౌలిక సదుపాయాలపై ఒత్తిడి పెరుగుతుందని తెలిపింది. కార్పొరేట్ పెట్టుబడి ప్రణాళికలు ఆలస్యం అవుతాయని, దీని వల్ల నేరుగా ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వం, దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధిపై ప్రభావం పడుతుందని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో పలు రంగాలు తీవ్రంగా ప్రభావితం అవుతాయని, ఈ పరిణామాలకు ప్రభుత్వాలు ముందస్తుగా సిద్ధంగా ఉండాలని ఆర్‌బీఐ సూచించింది. ప్రస్తుతం భారత తయారీ, సేవల రంగాల వృద్ధి గత 3 నెలలుగా తగ్గిన నేపథ్యంలో ఆర్‌బీఐ చేసిన హెచ్చరికలను విస్మరించలేమని నిపుణులు చెబుతున్నారు.
సంబంధిత వార్తలు

Punjab National Bank | పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ మోసం.. కరెన్సీ చెస్ట్‌లో రూ.7.40 కోట్ల నకిలీ నోట్లు
సెప్టెంబర్ 1, 2026

Kharge | లైట్స్.. కెమెరా.. ఇన్‌యాక్షన్‌లా ఆర్థిక వ్యవస్థపై ప్రచారం.. ప్రధాని మోదీపై ఖర్గే సెటైర్లు..!
సెప్టెంబర్ 1, 2026

RBI | ఎన్ఆర్ఐల నుంచి భారీగా విదేశీ నిధులు.. ఆర్బీఐ స్వాప్‌తో 73 బిలియన్ డాలర్లు..
ఆగస్టు 26, 2026
తాజావార్తలు
- ●Aarogyasri DEOs Termination | 22 ఏళ్ల సేవలకు ఇదేనా బహుమతి
- ●YTPS | యాదాద్రి థర్మల్ ప్లాంట్‌కు నైని బొగ్గు.. తొలిసారిగా తీసుకువచ్చిన రైలు..!
- ●Devarakonda Family | మూడు నెలల ...మూడు సినిమాలు - దేవరకొండ ఫ్యామిలీ నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్!
- ●Chanakya Strategies Report Telangana | కాంగ్రెస్‌పై తీవ్ర అసంతృప్తి.. వచ్చేది బీఆర్ఎస్సే
- ●Minister Ponnam | వెయ్యి రోజుల్లో ఆర్టీసీలో విప్లవాత్మక మార్పులు
- ●Team India | అఫ్గాన్‌తో టీ20 సిరీస్‌కు భారత్ జట్టు ప్రకటన.. మళ్లీ జట్టులోకి వచ్చిన సంజూ శాంసన్

Aarogyasri DEOs Termination | 22 ఏళ్ల సేవలకు ఇదేనా బహుమతి

YTPS | యాదాద్రి థర్మల్ ప్లాంట్‌కు నైని బొగ్గు.. తొలిసారిగా తీసుకువచ్చిన రైలు..!

Devarakonda Family | మూడు నెలల ...మూడు సినిమాలు - దేవరకొండ ఫ్యామిలీ నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్!

Chanakya Strategies Report Telangana | కాంగ్రెస్‌పై తీవ్ర అసంతృప్తి.. వచ్చేది బీఆర్ఎస్సే



