Hyderabad | అప్పు తీర్చలేదని.. 21 రోజుల చిన్నారిని ఎత్తుకెళ్లారు
Hyderabad | డబ్బు కోసం మనుషులు ఎంతకైనా తెగిస్తున్నారు. తీసుకున్న అప్పు (Debt) తీర్చలేదని అభంశుభం తెలియని 21 రోజుల పసికందును (Infant) నలుగురు వ్యక్తులు తల్లిఒడి నుంచి ఎత్తుకెళ్లారు.
Hyderabad | త్రినేత్ర.న్యూస్: డబ్బు కోసం మనుషులు ఎంతకైనా తెగిస్తున్నారు. తీసుకున్న అప్పు (Debt) తీర్చలేదని అభంశుభం తెలియని 21 రోజుల పసికందును (Infant) నలుగురు వ్యక్తులు తల్లిఒడి నుంచి ఎత్తుకెళ్లారు. చిన్నారిని తీసుకెళ్లొద్దని ఆ తల్లి కాళ్లపై పడినా వారు కనికరించలేదు. ఈ అమానుష ఘటన హైదరాబాద్ (Hyderabad) శివార్లలోని రాజేంద్రనగర్ పరిధిలో ఉన్న హనుమాన్ నగర్‌లో జరిగింది.
హనుమాన్ నగర్‌కు చెందిన అనిత, రాఘవేందర్ దంపతులు. రాఘవేందర్ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నారు. కుటుంబ అవసరాల కోసం హఫీజ్‌పేటలో ఉన్న సమయంలో ఇంటి పక్కన నివసించే మంజుల అనే మహిళ వద్ద రూ.30 వేలు అప్పుగా తీసుకున్నారు. అప్పు తిరిగి చెల్లించే విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు అనిత ఇంటికి వచ్చి ఆమెతో వాగ్వాదానికి దిగారు. అనంతరం ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు కలిసి తల్లి ఒడిలో ఉన్న 21 రోజుల పసిబాబును బలవంతంగా తీసుకుని ఆటోలో వెళ్లిపోయారు.
బిడ్డను తీసుకెళ్లొద్దంటూ వారి కాళ్లపై పడి వేడుకున్నప్పటికీ.. ఆమెను పక్కకు నెట్టివేసి బాబును తీసుకుని పోయారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలాన్ని పరిశీలించిన రాజేంద్రనగర్ పోలీసులు.. సీసీ కెమెరాలు, స్థానికుల నుంచి సేకరించిన సమాచారంతో రెండు గంటల్లోనే బాబును గుర్తించారు. అతడిని తిరిగి తల్లికి అప్పగించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదుచేసి, నిందుతులను అరెస్టు చేశారు.
సంబంధిత వార్తలు

Revanth Reddy | మిల్లర్ల బకాయిలు వసూలు చేయండి.. చెల్లించకపోతే మిల్లుల బాధ్యతలు మహిళా సంఘాలకు అప్పగిద్దాం
ఆగస్టు 12, 2026

Sridhar Babu | 5 ఎకరాల భూమిని 7.5 కోట్లకు ఇచ్చాం.. 200 కోట్లు ఎక్కడివో కేటీఆరే చెప్పాలి
ఆగస్టు 12, 2026

Ponnam Prabhakar | 14న మహాత్మా జ్యోతిబాపూలే దంపతుల విగ్రహావిష్కరణ
ఆగస్టు 12, 2026
తాజావార్తలు
- ●Red Fort Attack | ఢిల్లీ పేలుడు వెనుక ఆల్‌ఖైదా హస్తం.. UNSC సంచలన నివేదిక
- ●Meta Platforms | మెటాకు భారీ నష్టం.. 1.4 ట్రిలియన్ డాలర్ల మేర ఎఫెక్ట్..?
- ●Kangana Ranaut | బొద్దింకలు మురికి కాలువల నుంచేగా వస్తాయి.. నేనన్నదాంట్లో తప్పేముంది..? : కంగన
- ●Indian Bank | ఇండియన్ బ్యాంకులో 700 గ్రాముల బంగారం చోరీ.. సొంతానికి వాడుకున్న అసిస్టెంట్ మేనేజర్
- ●Shakeela | నటి షకీలాకు సర్జరీ - స్మార్ట్‌ఫోన్‌కు బానిసగా మారి.... మెడ నరాలు దెబ్బతిని..
- ●Annavaram | సత్యమే దైవం.. అన్నవరంలో సత్యనారాయణుడి వైభవం

Red Fort Attack | ఢిల్లీ పేలుడు వెనుక ఆల్‌ఖైదా హస్తం.. UNSC సంచలన నివేదిక

Meta Platforms | మెటాకు భారీ నష్టం.. 1.4 ట్రిలియన్ డాలర్ల మేర ఎఫెక్ట్..?

Kangana Ranaut | బొద్దింకలు మురికి కాలువల నుంచేగా వస్తాయి.. నేనన్నదాంట్లో తప్పేముంది..? : కంగన

Indian Bank | ఇండియన్ బ్యాంకులో 700 గ్రాముల బంగారం చోరీ.. సొంతానికి వాడుకున్న అసిస్టెంట్ మేనేజర్



