Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. పెట్టుబడులకు సమయమిదే..?
Gold And Silver Prices Today | పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు పెరుగుతుండడంతో ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. గత నాలుగైదు సెషన్ల నుంచి సూచీలు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అయితే బంగారం, వెండి వంటి సేఫ్ హావెన్ ఆస్తులకు మాత్రం డిమాండ్ పెరిగింది.
Gold And Silver Prices Today | పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు పెరుగుతుండడంతో ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. గత నాలుగైదు సెషన్ల నుంచి సూచీలు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అయితే బంగారం, వెండి వంటి సేఫ్ హావెన్ ఆస్తులకు మాత్రం డిమాండ్ పెరిగింది. దీంతో గత వారం పది రోజుల నుంచి వీటి ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. అయితే గురువారం నాటి సెషన్‌లో మాత్రం ఈ లోహాల ధరలు స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 0.74 శాతం మేర తగ్గి 4,375 డాలర్లకు చేరగా, వెండి ధర 0.59 శాతం మేర తగ్గి 64 డాలర్లకు వచ్చింది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 1047 పాయింట్లు తగ్గి 1,53,835కు చేరగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 2,135 పాయింట్లు తగ్గి 2,35,700కు వచ్చింది. దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా పెరగ్గా, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,513 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,24,104 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,55,130 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.15,51,300 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.2,700 పెరిగింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,220 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,13,760గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,42,200 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.14,22,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.2,500 పెరిగింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,635 ఉండగా, 8 గ్రాముల ధర రూ.93,080గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,16,350 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,63,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.2,100 పెరిగింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,55,000 ఉండగా, తులం ధర రూ.2,550గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,60,000 ఉండగా, తులం ధర రూ.2,600 గా ఉంది.
సంబంధిత వార్తలు

Corpus | రూ.1 కోటి సంపాదించాలా.. అయితే ముందు రూ.10 లక్షలు దాటండి.. ఎందుకంటే..?
సెప్టెంబర్ 10, 2026

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.12వేలు పెరిగిన బంగారం ధర.. మార్కెట్లలో తీవ్ర అనిశ్చితి..
సెప్టెంబర్ 10, 2026

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.10వేలు తగ్గిన బంగారం ధర.. బులియన్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
సెప్టెంబర్ 9, 2026
తాజావార్తలు
- ●Nitin Gadkari | సిగ్గుగా ఉంది.. ప్రారంభోత్సవానికి నేను రాను : రహదారి నిర్మాణం ఆలస్యంపై గడ్కరీ అసహనం
- ●S.Madhusudhana Chary | పింక్ కలర్ చొక్కా వేసుకున్నా సభలో అడ్డుకున్నరు
- ●MLC Venkatrami Reddy | వీర్లపల్లి శంకర్ మీద ఏం చర్యలు తీసుకున్నరో చెప్పాలి
- ●Supreme Court | ఆన్లైన్లో అనుచిత కంటెంట్ నుంచి పిల్లల్ని రక్షించండి.. కేంద్రానికి సుప్రీం నోటీసులు
- ●KCR Fake Tweet Controversy | రేవంత్ రెడ్డే సంధ్యారావు.. సంధ్యారావే రేవంత్ రెడ్డి
- ●Jayam Ravi | వెంకటేశ్వరస్వామిగా జయం రవి - మంచు మనోజ్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ

Nitin Gadkari | సిగ్గుగా ఉంది.. ప్రారంభోత్సవానికి నేను రాను : రహదారి నిర్మాణం ఆలస్యంపై గడ్కరీ అసహనం

S.Madhusudhana Chary | పింక్ కలర్ చొక్కా వేసుకున్నా సభలో అడ్డుకున్నరు

MLC Venkatrami Reddy | వీర్లపల్లి శంకర్ మీద ఏం చర్యలు తీసుకున్నరో చెప్పాలి

Supreme Court | ఆన్లైన్లో అనుచిత కంటెంట్ నుంచి పిల్లల్ని రక్షించండి.. కేంద్రానికి సుప్రీం నోటీసులు



