Bigg Boss Kalyan | హీరోగా మారిన బిగ్‌బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల – రియల్ లైఫ్ బ్రేకప్ లవ్‌స్టోరీతో డెబ్యూ మూవీ
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాల హీరోగా మారాడు. నిజమే రుజువైనది పేరుతో రొమాంటిక్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన కళ్యాణ్ పడాల డెబ్యూ మూవీ నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. ఆగస్ట్ 14 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
Entertainment | Published On Aug 13, 2026, 11.48 am IST
Bigg Boss Kalyan | బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాల హీరోగా మారాడు. నిజమే రుజువైనది పేరుతో ఓ సినిమా చేశాడు. ఇందులో తమిళ నటి, బిగ్‌బాస్ ఫేమ్ వియానా హీరోయిన్‌గా నటించింది. కేవలం 30 నిమిషాల నిడివితో మినీ ఇండిపెండెంట్ మూవీగా నిజమే రుజువైనది రూపొందింది. ఈ సినిమాకు ప్రకాష్ రెడ్డి దర్శకత్వం వహించారు.
నేరుగా ఓటీటీలో....
కళ్యాణ్ పడాల డెబ్యూ మూవీ నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. ఆగస్ట్ 14 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో నిజమే రుజువైనది స్ట్రీమింగ్ కాబోతుంది. కళ్యాణ్ పడాల రియల్ లైఫ్ లవ్‌స్టోరీ ఆధారంగా ఈ సినిమా రూపొందినట్లు ప్రచారం జరుగుతోంది. ఓ అమ్మాయి ప్రాణంగా ప్రేమించిన కళ్యాణ్ ఆమెకు ఎలా దూరమయ్యాడన్నది ఇందులో ఎమోషనల్‌గా చూపించబోతున్నట్లు సమాచారం.
ప్రీమియర్...
ఇటీవల నిజమే రుజువైనది ప్రీమియర్‌ను హైదరాబాద్‌లో టెలికాస్ట్ చేశారు. ఈ ప్రీమియర్‌కు కళ్యాణ్ పడాల, వియానాతో పాటు బిగ్‌బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్ తనూజ, రీతూ చౌదరి, గౌతమ్ కృష్ణతో పాటు మరికొందరు అటెండ్ అయ్యారు.
సామాన్యుడి నుంచి విన్నర్‌గా...
ఆర్మీలో జాబ్ చేసిన కళ్యాణ్ పడాల సెలవుల్లో బిగ్‌బాస్ అగ్ని పరీక్షకు అప్లయ్ చేశాడు. అనూహ్యంగా ఈ షోకు ఎంపికయ్యాడు. అగ్నిపరీక్షలో అదరగొట్టి కామన్ మ్యాన్‌గా బిగ్‌బాస్ సీజన్ 9లోకి అడుగుపెట్టాడు. నిజాయితీతో కూడిన ఆటతీరుతో బిగ్‌బాస్ 9 విన్నర్‌గా నిలిచాడు. బిగ్‌బాస్ కోసం చివరకు తన ఆర్మీ జాబ్‌ను వదిలేశాడు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Bigg Boss Agnipariksha | బిగ్‌బాస్ అగ్నిపరీక్ష లాంఛింగ్ డేట్ చెప్పేసిన కళ్యాణ్ పడాల – వీడియోతో సర్ప్రైజ్
ఆగస్టు 3, 2026

Bigg Boss 9 Telugu | బిగ్‌బాస్ 9 తెలుగు – రెమ్యూనరేషన్లో విన్నర్ కళ్యాణ్‌ను దాటేసిన కంటెస్టెంట్ వీళ్లే!
డిసెంబర్ 22, 2025

Bigg Boss 9 Telugu Winner | బిగ్‌బాస్ 9 తెలుగు విన్నర్‌గా కళ్యాణ్ పడాల – విజేతకు దక్కిన ప్రైజ్‌మనీ ఎంతంటే?
డిసెంబర్ 21, 2025
తాజావార్తలు
- ●MLC Venkatrami Reddy | వీర్లపల్లి శంకర్ మీద ఏం చర్యలు తీసుకున్నరో చెప్పాలి
- ●Supreme Court | ఆన్లైన్లో అనుచిత కంటెంట్ నుంచి పిల్లల్ని రక్షించండి.. కేంద్రానికి సుప్రీం నోటీసులు
- ●KCR Fake Tweet Controversy | రేవంత్ రెడ్డే సంధ్యారావు.. సంధ్యారావే రేవంత్ రెడ్డి
- ●Jayam Ravi | వెంకటేశ్వరస్వామిగా జయం రవి - మంచు మనోజ్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ
- ●Corpus | రూ.1 కోటి సంపాదించాలా.. అయితే ముందు రూ.10 లక్షలు దాటండి.. ఎందుకంటే..?
- ●Komatireddy Rajagopal Reddy | ఖర్చెక్కువవుతుంది.. ఇందిరమ్మ ఇళ్లకిచ్చే నిధులు పెంచాలి

MLC Venkatrami Reddy | వీర్లపల్లి శంకర్ మీద ఏం చర్యలు తీసుకున్నరో చెప్పాలి

Supreme Court | ఆన్లైన్లో అనుచిత కంటెంట్ నుంచి పిల్లల్ని రక్షించండి.. కేంద్రానికి సుప్రీం నోటీసులు

KCR Fake Tweet Controversy | రేవంత్ రెడ్డే సంధ్యారావు.. సంధ్యారావే రేవంత్ రెడ్డి

Jayam Ravi | వెంకటేశ్వరస్వామిగా జయం రవి - మంచు మనోజ్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ



