త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Black Magic | మ‌హాదేవ్‌పూర్‌లో క్షుద్ర‌పూజ‌ల క‌ల‌క‌లం.. భ‌యాందోళ‌న‌లో ప్ర‌జ‌లు

Black Magic | జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి (Jayashankar Bhupalpally) జిల్లాలోని మహాదేవపూర్ మండలం కుదురుపల్లిలో క్షుద్రపూజలు (Black Magic) కలకలం సృష్టించాయి. అమావాస్య (Amavasya) కావ‌డంతో బుధవారం (ఆగ‌స్టు 12న‌) రాత్రి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్ర‌పూజ‌లు చేశారు.

G

Telangana | Published On Aug 13, 2026, 12.02 pm IST

Black Magic | మ‌హాదేవ్‌పూర్‌లో క్షుద్ర‌పూజ‌ల క‌ల‌క‌లం.. భ‌యాందోళ‌న‌లో ప్ర‌జ‌లు
Advertisement

Black Magic | త్రినేత్ర‌.న్యూస్‌: జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి (Jayashankar Bhupalpally) జిల్లాలోని మహాదేవపూర్ మండలం కుదురుపల్లిలో క్షుద్రపూజలు (Black Magic) కలకలం సృష్టించాయి. అమావాస్య (Amavasya) కావ‌డంతో బుధవారం (ఆగ‌స్టు 12న‌) రాత్రి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్ర‌పూజ‌లు చేశారు. గ్రామంలోని వాగులో నల్లకోడి, నిమ్మకాయలు, కోడి గుడ్డు, పసుపు, కుంకుమతో పూజ‌లు నిర్వ‌హించారు. గురువారం ఉదయం వాగు వద్దకు వెళ్లిన స్థానికులు వాటిని గుర్తించారు. దీంతో గ్రామంలోని ప్రజలు భ‌యాందోళ‌న‌ల‌కు గురవుతున్నారు. ఎప్పుడు ఎవ‌రికి ఏమ‌వుతుందోన‌ని భిక్కుభిక్కుమంటున్నారు. అస‌లు క్షుద్ర‌పూజ‌లు ఎవ‌రు చేసి ఉంటార‌ని చ‌ర్చించుకుంటున్నారు.

మ‌రోవైపు జిల్లాలోని కాటారం మండలం మద్దులపల్లి గ్రామంలోనూ ఇలింటి ఘ‌ట‌నే చోటుచేసుకుంది. మ‌ద్దుల‌ప‌ల్లి రోడ్డుపై ముగ్గు, నిమ్మకాయలు, కోడిగుడ్లతో గుర్తుతెలియ‌ని వ్యక్తులు పూజలు చేశారు. ఈ పూజల వల్ల ఎవరికి ఎలాంటి హానీ జరుగనుందో, ఎవరు అనారోగ్యం బారిన పడతారో అని ఆందోళన చెందుతున్నారు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, హిందూ సంప్రదాయాల్లో అమావాస్యలకు చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజు ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది అంటారు. అంతే కాకుండా అమావాస్య పౌర్ణమిలలో గ్రహాలలో మార్పులు చోటు చేసుకుంటాయి. బుధ‌వారం వ‌చ్చిన అమావాస్య‌ను శ్రావణ మాస కృష్ణ అమావాస్య అని పిలుస్తారు.

Advertisement
Advertisement