Ponnam Prabhakar | విజన్ 2047 లక్ష్యాల సాధనలో ఆటోమొబైల్, ఈవీ రంగాలు కీలకం
Ponnam Prabhakar | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దడంతో పాటు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్లకు, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్లకు చేర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
తెలంగాణలో భారీ పెట్టుబడులకు ముందుకు రావాలి
ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ - 2026లో భాగస్వాములు కావాలి
ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగాల్లో పెట్టుబడులకు అపార అవకాశాలు
కాలుష్య రహిత తెలంగాణ లక్ష్యంతో
దేశంలోనే ప్రత్యేకంగా ఈవీ పాలసీ అమలు చేస్తున్నాం
పెట్టుబడులు, పరిశ్రమల విస్తరణకు
ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది
మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి
Ponnam Prabhakar | త్రినేత్ర న్యూస్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దడంతో పాటు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్లకు, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్లకు చేర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ - 2026లో భాగంగా ఆటోమొబైల్, ఆటో కాంపోనెంట్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ (EV) రంగాలకు సంబంధించి సచివాలయంలో నిర్వహించిన తొలి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశానికి మంత్రి అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డిసెంబర్ 7 నుంచి 9 వరకు హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ - 2026లో ఆటోమొబైల్, ఈవీ రంగాలకు చెందిన ప్రముఖ కంపెనీలు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో ఆటోమొబైల్ తయారీ, ఆటో కాంపోనెంట్స్, ఎలక్ట్రిక్ మొబిలిటీ, బ్యాటరీ టెక్నాలజీ, ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాల రంగాల్లో భారీ పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన సంస్థలు తమ పరిశ్రమలను మరింత విస్తరించడంతో పాటు, కొత్త పెట్టుబడులకు ముందుకు రావాలని కోరారు.

ఈవీ పాలసీతో కాలుష్య రహిత తెలంగాణకు అడుగులు
తెలంగాణను కాలుష్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రెండేళ్ల క్రితమే దేశంలో ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ వాహనాల పాలసీని తీసుకొచ్చామని మంత్రి తెలిపారు. ఈవీ వాహనాల కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు 100 శాతం రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపులు కల్పించామని పేర్కొన్నారు. ఈ ప్రోత్సాహకాల ఫలితంగా గత రెండేళ్ల కాలంలో రాష్ట్రంలో 2,17,690 ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయని, తద్వారా సుమారు రూ.2,343 కోట్ల మేర పన్ను మినహాయింపులు కల్పించామని వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడం ద్వారా కాలుష్య నియంత్రణతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని తెలిపారు.
పరిశ్రమలకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు
తెలంగాణలో ఆటోమొబైల్, మొబిలిటీ రంగాల అభివృద్ధికి మూడు పారిశ్రామిక పార్కులు, మొబిలిటీ క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. జహీరాబాద్‌లోని నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫాక్చరింగ్ జోన్‌తో పాటు ఎంకతల, కొడంగల్ ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని వివరించారు. ఈ పార్కుల్లో పరిశ్రమలకు అవసరమైన భూమి, ల్యాబ్ సదుపాయాలు, మౌలిక వసతులు, రవాణా కనెక్టివిటీ, ఇతర పారిశ్రామిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. పెట్టుబడిదారులకు అవసరమైన అనుమతులు, విధానపరమైన సహకారం, మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
మరిన్ని పెట్టుబడుటు పెట్టాలి
తెలంగాణలో ఇప్పటికే హ్యుందాయ్, మహీంద్రా, అమర రాజా, ఒలెక్ట్రా, బిలిటి ఎలక్ట్రిక్, ప్యూర్ ఈవీ, బాష్, జెడ్ఎఫ్, ఎంఆర్ఎఫ్ వంటి ప్రముఖ సంస్థలు పారిశ్రామిక అభివృద్ధిలో భాగస్వాములుగా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న పెట్టుబడి అవకాశాలను వినియోగించుకొని ఆటోమొబైల్ తయారీ, ఆటో కాంపోనెంట్స్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, బ్యాటరీ స్టోరేజ్, ఛార్జింగ్ మౌలిక సదుపాయాల రంగాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను కోరారు. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ – 2026ను విజయవంతం చేయడంలో పరిశ్రమల ప్రముఖులు, పెట్టుబడిదారులు భాగస్వాములు కావాలని, ఈ సదస్సు ద్వారా తెలంగాణకు భారీ పెట్టుబడులు, కొత్త పరిశ్రమలు, యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
ఈ సమావేశంలో పాల్గొన్న పారిశ్రామికవేత్తలు, ప్రముఖ కంపెనీల ప్రతినిధులు తెలంగాణలో పెట్టుబడులకు అనుకూలమైన అవకాశాలు ఉన్నాయని, ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 విజయవంతానికి తమ వంతు కృషి చేస్తామని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
ఈ సమావేశంలో రవాణా శాఖ కార్యదర్శి ఇలంబర్తి, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య, పరిశ్రమల శాఖ కార్యదర్శి నిఖిల్ చక్రవర్తి, జేటీసీ వెంకట రమణ, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కన్వీనర్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ ఔజాద్ షేక్ తదితర అధికారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ●Thammidikunta Lake | హైదరాబాద్‌కు మరో మణిహారం.. నేడు తమ్మిడికుంట చెరువు ప్రారంభం!
- ●Nifty IT | ఐటీ షేర్లలో భారీ ర్యాలీ.. కొనాలా.. అమ్మాలా..?
- ●Hijack Alert | టేకాఫ్‌కు ముందు.. ఎయిర్ ఇండియా విమానానికి హైజాక్ అలర్ట్
- ●CM Revanth Reddy | బీజేపీతో పోరాడే శక్తి కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది..
- ●Nifty 50 | నిఫ్టీ 28,000కు చేరుతుందా? మూడు అంతర్జాతీయ బ్రోకరేజీల అంచనాలివే!
- ●Vijayasai Reddy | విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ‘పరివర్తన రాజనీతి పార్టీ’.. 2029 ఎన్నికల్లో పోటీకి సై

Thammidikunta Lake | హైదరాబాద్‌కు మరో మణిహారం.. నేడు తమ్మిడికుంట చెరువు ప్రారంభం!

Nifty IT | ఐటీ షేర్లలో భారీ ర్యాలీ.. కొనాలా.. అమ్మాలా..?

Hijack Alert | టేకాఫ్‌కు ముందు.. ఎయిర్ ఇండియా విమానానికి హైజాక్ అలర్ట్

CM Revanth Reddy | బీజేపీతో పోరాడే శక్తి కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది..





