Davos | దావోస్ తరహాలో హైదరాబాద్.. ప్రపంచ విధాన చర్చలకు వేదికగా నగరం
Davos | ప్రపంచ ఆర్థిక, పెట్టుబడుల విధానాలపై చర్చలకు దావోస్ అంతర్జాతీయ వేదికగా గుర్తింపు పొందినట్లే, రాజకీయ, సామాజిక, ఆర్థిక విధానాలపై ప్రపంచానికి దిశానిర్దేశం చేసే వేదికగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంగా భారత్ సమ్మిట్–2
70కిపైగా దేశాల నుంచి 1,000 మందికి పైగా ప్రతినిధుల హాజరు
అహింస, అలీన విధానం, మిశ్రమ ఆర్థిక విధానాలే ప్రపంచానికి మార్గదర్శకాలు
సమ్మిట్ నిర్వహణపై నిర్వహించిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Davos | త్రినేత్ర న్యూస్: ప్రపంచ ఆర్థిక, పెట్టుబడుల విధానాలపై చర్చలకు దావోస్ అంతర్జాతీయ వేదికగా గుర్తింపు పొందినట్లే, రాజకీయ, సామాజిక, ఆర్థిక విధానాలపై ప్రపంచానికి దిశానిర్దేశం చేసే వేదికగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న హింస, విద్వేష రాజకీయాలు, విభజన ధోరణుల నేపథ్యంలో ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం నవంబర్ 13, 14 తేదీల్లో హైదరాబాద్‌లో భారత్ సమ్మిట్–2 నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. హైటెక్స్‌లోని నోవాటెల్ హోటల్‌లో సమ్మిట్ నిర్వహణపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్యవాదులు, ఉదారవాదులు, ప్రగతిశీల భావాలు కలిగినవారిని ఒకే వేదికపైకి తీసుకువచ్చి అంతర్జాతీయ అంశాలపై చర్చించేందుకు ఈ సదస్సును నిర్వహిస్తోందన్నారు. 70కిపైగా దేశాల నుంచి 1,000 మందికి పైగా ప్రజాప్రతినిధులు, విధాన నిర్ణేతలు, మేధావులు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొననున్నట్లు తెలిపారు.

ప్రపంచానికి గాంధీ, నెహ్రూ విధానాలు అవసరం
మహాత్మా గాంధీ బోధించిన అహింసా సిద్ధాంతం, తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అనుసరించిన అలీన విదేశాంగ విధానం, మిశ్రమ ఆర్థిక విధానాలు నేటి ప్రపంచ పరిస్థితుల్లో ఎంతో అవసరమని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అగ్రరాజ్యాలకు అనుగుణంగా వ్యవహరించే క్రమంలో అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ స్వతంత్ర గుర్తింపును, అస్తిత్వాన్ని కోల్పోకూడదన్నదే నెహ్రూ విధానమని వివరించారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అధికార పక్షంతో పాటు ప్రతిపక్షానికీ సమాన ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. ఈ రెండూ ప్రజాస్వామ్య వ్యవస్థకు కీలక స్తంభాలని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలను, నాయకులను అధికార పక్షాలు శత్రువులుగా చూడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. రాజకీయ ప్రత్యర్థుల విధానాలను వ్యతిరేకించవచ్చని, అంతమాత్రాన వారిని శత్రువులుగా పరిగణించకూడదని సూచించారు. ప్రపంచంలోని పలు దేశాల్లో ప్రతిపక్ష పార్టీలను రాజకీయంగా అంతం చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశాలపై చర్చించేందుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులను భారత్ సమ్మిట్‌కు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడాలి
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని, ప్రతి పౌరుడికి ఆ హక్కును పరిరక్షించాల్సిన బాధ్యత ఎన్నికల వ్యవస్థపై ఉందని భట్టి విక్రమార్క అన్నారు. ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియ పేరుతో అర్హులైన పౌరుల ఓటు హక్కును తొలగించే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోందని తెలిపారు. రాహుల్ గాంధీ నుంచి క్షేత్రస్థాయి నాయకులు, కార్యకర్తల వరకు ఈ అంశంపై పోరాడుతున్నారని పేర్కొన్నారు. ఎక్కువ మంది ఓటర్లను తొలగించడం కాకుండా, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే ఎన్నికల సంఘం, ప్రభుత్వాల బాధ్యత కావాలని అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, అహింస, అలీన విధానం, ప్రపంచ ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిణామాలు ఈ సదస్సులో ప్రధాన చర్చనీయాంశాలుగా ఉండనున్నాయి.
భారత్ సమ్మిట్ రాజకీయ వేదిక కాదు: మంత్రి శ్రీధర్ బాబు

భారత్ సమ్మిట్ నిర్వహణపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఖండించారు. రాహుల్ గాంధీని రీలాంచ్ చేయడానికే సమ్మిట్ నిర్వహిస్తున్నారంటూ కొందరు బీజేపీ నాయకులు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న నాయకుడని, ఆయనను ప్రత్యేకంగా మరోసారి లాంచ్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ప్రగతిశీల ఆలోచనలు కలిగిన పార్టీ కాంగ్రెస్ అని, ఆ భావజాలంతోనే తమ పార్టీ ముందుకు సాగుతోందని తెలిపారు. బీజేపీ ఆలోచనా విధానం భిన్నంగా ఉంటుందని, ఆ పార్టీ భావజాలం ఏమిటో ప్రజలందరికీ తెలుసన్నారు. మోదీ తర్వాత ఎవరిని లాంచ్ చేయాలని బీజేపీ ఆలోచిస్తోందంటూ మండిపడ్డారు. రాహుల్ గాంధీ ఆలోచనా విధానం బీజేపీకి ఎప్పటికీ అర్థం కాదని వ్యాఖ్యానించారు.
భారత్ సమ్మిట్‌ను రాజకీయ కోణంలో చూడకూడదని, ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషించడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశమని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. యువత, సాంకేతికత సహా అనేక కీలక అంశాలపై సదస్సులో చర్చలు జరుగుతాయని తెలిపారు. ముఖ్యంగా జెన్‌జీ యువత లేవనెత్తుతున్న పలు అంశాలపై మేధోపరమైన చర్చలు నిర్వహిస్తామని చెప్పారు. అలాగే ఎస్‌ఐఆర్ పేరుతో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల ప్రజాస్వామిక ప్రభావాలపైనా చర్చిస్తామని మంత్రి వెల్లడించారు.
ఈ మీడియా సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ అడ్మినిస్ట్రేషన్ ఇన్‌ఛార్జి గురుదీప్ సింగ్ సప్పల్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, సమృద్ధ భారత్ ఫౌండేషన్ డైరెక్టర్ పుష్పరాజ్ దేశ్‌పాండే తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ●Uttam Kumar Reddy | డిసెంబర్ నాటికి రెడ్లకుంట ఎత్తిపోతల పూర్తి చేయాలి : మంత్రి ఉత్తమ్
- ●Terror Attack | సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై ఉగ్రదాడి
- ●Thammidikunta Lake | హైదరాబాద్‌కు మరో మణిహారం.. నేడు తమ్మిడికుంట చెరువు ప్రారంభం!
- ●Ponnam Prabhakar | విజన్ 2047 లక్ష్యాల సాధనలో ఆటోమొబైల్, ఈవీ రంగాలు కీలకం
- ●Nifty IT | ఐటీ షేర్లలో భారీ ర్యాలీ.. కొనాలా.. అమ్మాలా..?
- ●Hijack Alert | టేకాఫ్‌కు ముందు.. ఎయిర్ ఇండియా విమానానికి హైజాక్ అలర్ట్

Uttam Kumar Reddy | డిసెంబర్ నాటికి రెడ్లకుంట ఎత్తిపోతల పూర్తి చేయాలి : మంత్రి ఉత్తమ్

Terror Attack | సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై ఉగ్రదాడి

Thammidikunta Lake | హైదరాబాద్‌కు మరో మణిహారం.. నేడు తమ్మిడికుంట చెరువు ప్రారంభం!

Ponnam Prabhakar | విజన్ 2047 లక్ష్యాల సాధనలో ఆటోమొబైల్, ఈవీ రంగాలు కీలకం




