Election Commission | యూపీ, ఉత్తరాఖండ్‌లో 11 రాజ్యసభ సీట్లకు ఎన్నికల షెడ్యూల్ విడుదల
Election Commission | దేశంలోని పలు రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని 10 స్థానాలకు, ఉత్తరాఖండ్ (Uttarakhand)లోని 1 స్థానానికి ఎన్నికల (Biennial Elections) షెడ్యూల్‌ను ప్రకటించింది.
Election Commission | త్రినేత్ర.న్యూస్ : దేశంలోని పలు రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని 10 స్థానాలకు, ఉత్తరాఖండ్ (Uttarakhand)లోని 1 స్థానానికి ఎన్నికల (Biennial Elections) షెడ్యూల్‌ను ప్రకటించింది. దీంతోపాటూ పశ్చిమ బెంగాల్‌లో రుక్మిణి నాయక్ రాజీనామాతో ఖాళీ అయిన ఒక రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు వెల్లడించింది. సెప్టెంబర్ 29న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. అక్టోబర్ 6 నామినేషన్ల సమర్పణకు చివరి తేదీ కాగా, అక్టోబర్ 9న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా తెలిపింది. అక్టోబర్ 16 పోలింగ్ నిర్వహించి అదే రోజు ఫలితాలను వెల్లడించనున్నారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి, అరుణ్ సింగ్, బ్రజ్ లాల్, నీరజ్ శేఖర్, రామ్ గోపాల్ యాదవ్ (SP), రామ్‌జీ (BSP) తదితర రాజ్యసభ సభ్యుల పదవీ కాలం నవంబర్ 25తో ముగియనుంది. ఇక ఉత్తరాఖండ్‌లో బీజేపీ ఎంపీ నరేష్ బన్సల్ పదవీ కాలం ముగియనుండటంతో ఆయా స్థానాల భర్తీకి ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.
Election Commission announces Biennial Elections in Uttar Pradesh (10 seats) and Uttarakhand (1 seat) and a by-election in West Bengal.
Date of poll: October 16, 2026
Date of counting of votes: October 16, 2026 pic.twitter.com/x4FLUlNPTr— ANI (@ANI) September 22, 2026
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు..
మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం (ECI) బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల శాసనమండలి (MLC) పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గాల్లోని మొత్తం 28 స్థానాలకు ఎన్నికల (Biennial Elections) షెడ్యూల్‌ను ప్రకటించింది. ఇందులో బీహార్‌లో 8 స్థానాలు, కర్ణాటకలో 4 స్థానాలు, మహారాష్ట్రలో 5 స్థానాలు, ఉత్తరప్రదేశ్‌లో 11 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్ 29న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అక్టోబర్ 23న పోలింగ్ ఉంటుంది. అక్టోబర్ 27న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను విడుదల చేయనున్నారు.
The Election Commission announces a biennial election in Bihar, Karnataka, Maharashtra, and Uttar Pradesh from Graduates' and Teachers' Constituencies.
Date of polling: October 23
Date of counting of votes: October 27 pic.twitter.com/mfTovPT0Ry— ANI (@ANI) September 22, 2026
Also Read..
పోలీసులమని బెదిరించి.. ఢిల్లీ పార్క్‌లో మైనర్‌పై గ్యాంగ్ రేప్.. 10 రోజుల్లో నాలుగో ఘటన
గులాబీ కోటలపై కాంగ్రెస్ గురి.. మూడు సభల వెనుక నాలుగు రాజకీయ లక్ష్యాలు!
తమిళనాడు సర్కార్ బంపర్ ఆఫర్.. ప్రతి ఇంటికీ రూ.22వేల వరకు సోలార్ పథకం సబ్సిడీ..
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Parenting | భయం లేని కోడి బజారులో గుడ్డు పెట్టిందట!.. పిల్లలు చెడిపోవడానికి కారణం తల్లి దండ్రులే..!
- ●మొదట కేటీఆర్.. తర్వాత హరీశ్.. చివరగా కేసీఆర్: రేవంత్ ‘త్రిముఖ’ వ్యూహం!
- ●Tamil Nadu | తమిళనాడు సర్కార్ బంపర్ ఆఫర్.. ప్రతి ఇంటికీ రూ.22వేల వరకు సోలార్ పథకం సబ్సిడీ..
- ●Delhi Park | పోలీసులమని బెదిరించి.. ఢిల్లీ పార్క్‌లో మైనర్‌పై గ్యాంగ్ రేప్.. 10 రోజుల్లో నాలుగో ఘటన
- ●Gold And Silver Prices Today | పెట్టుబడిదారులకు అలర్ట్.. స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. కొనేందుకు చాన్స్..?
- ●Bandlaguda RTO | బండ్లగూడ ఆర్టీవో ఆఫీసులో నగదు లెక్కింపు వ్యవహారం.. ముగ్గురు అధికారులపై వేటు

Parenting | భయం లేని కోడి బజారులో గుడ్డు పెట్టిందట!.. పిల్లలు చెడిపోవడానికి కారణం తల్లి దండ్రులే..!

మొదట కేటీఆర్.. తర్వాత హరీశ్.. చివరగా కేసీఆర్: రేవంత్ ‘త్రిముఖ’ వ్యూహం!

Tamil Nadu | తమిళనాడు సర్కార్ బంపర్ ఆఫర్.. ప్రతి ఇంటికీ రూ.22వేల వరకు సోలార్ పథకం సబ్సిడీ..

Delhi Park | పోలీసులమని బెదిరించి.. ఢిల్లీ పార్క్‌లో మైనర్‌పై గ్యాంగ్ రేప్.. 10 రోజుల్లో నాలుగో ఘటన






