త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Terror Attack | సీఆర్‌పీఎఫ్ క్యాంప్‌పై ఉగ్ర‌దాడి

Terror Attack | జమ్ము క‌శ్మీర్ (Jammu and Kashmir) కుల్గామ్ (Kulgam) జిల్లాలోని సీఆర్‌పీఎఫ్ చెక్‌పోస్టుపై ఉగ్ర‌వాదులు కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు సీఆర్‌పీఎఫ్ సిబ్బంది గాయ‌ప‌డ్డారు.

D

National | Published On Nov 11, 2026, 3.21 pm IST

Terror Attack | సీఆర్‌పీఎఫ్ క్యాంప్‌పై ఉగ్ర‌దాడి
Advertisement

Terror Attack | త్రినేత్ర న్యూస్ : జమ్ము క‌శ్మీర్ (Jammu and Kashmir)లో ఉగ్ర‌వాదులు రెచ్చిపోయారు. కుల్గామ్ (Kulgam) జిల్లాలోని సీఆర్‌పీఎఫ్ చెక్‌పోస్టుపై కాల్పుల‌కు తెగ‌బడ్డారు. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (Central Reserve Police Force post) సిబ్బంది గాయపడ్డారు. జిల్లాలోని మీర్ బజార్ సమీపంలో ఉన్న అఖ్రాన్ (Akhran)లో మధ్యాహ్నం 2.15 గంటల సమయంలో ఈ దాడి జ‌రిగిన‌ట్లు అధికారులు తెలిపారు.

మోటార్ సైకిల్‌పై వ‌చ్చిన ఉగ్ర‌వాదులు భ‌ద్ర‌తా సిబ్బందిపై కాల్పులు జ‌రిపిన‌ట్లు సీఆర్‌పీఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. దాడి త‌ర్వాత సీఆర్‌పీఎఫ్ సిబ్బంది ఎదురు కాల్పులు జ‌రిపిన‌ట్లు పేర్కొంది. గాయపడిన సిబ్బందిని చికిత్స కోసం అనంతనాగ్ జిల్లాలోని ఆసుపత్రికి తరలించిన‌ట్లు వెల్ల‌డించింది. క్విక్ రెస్పాన్స్ టీమ్‌లు, భ‌ద్ర‌తా బ‌ల‌గాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి దాడి చేసిన వారి కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టాయి. ప్ర‌స్తుతం అక్క‌డ‌ సెర్చ్ ఆప‌రేష‌న్ కొన‌సాగుతోంది. దీంతో ఆ ప్రాంతంలో భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు.

Also Read..

టేకాఫ్‌కు ముందు.. ఎయిర్ ఇండియా విమానానికి హైజాక్ అల‌ర్ట్‌

ఎన్విడియా షేర్లకు భారీ షాక్.. రెండు రోజుల్లో 470 బిలియన్ డాలర్ల నష్టం..

హైదరాబాద్‌కు మరో మణిహారం.. నేడు తమ్మిడికుంట చెరువు ప్రారంభం!

Advertisement
Advertisement