త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | కావేరి జలాల వివాదం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

Supreme Court | త్రినేత్ర‌.న్యూస్ : కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ జలాల వివాదంలో (Cauvery Water Dispute) సుప్రీంకోర్టు (Supreme Court) కీల‌క తీర్పు వెలువ‌రించింది.

D

National | Published On Sep 22, 2026, 12.49 pm IST

Supreme Court | కావేరి జలాల వివాదం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
Advertisement

Supreme Court | త్రినేత్ర‌.న్యూస్ : కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ జలాల వివాదంలో (Cauvery Water Dispute) సుప్రీంకోర్టు (Supreme Court) కీల‌క తీర్పు వెలువ‌రించింది. కర్ణాటకకు అద‌నంగా 70 టీఎంసీల కావేరీ నీటిని కేటాయించాలని కోరుతూ దాఖలైన రిట్ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. ఈ అంశంలో ప్రైవేటు సొసైటీల పిటిషన్లు చెల్లవని తేల్చి చెప్పింది. అంతర్రాష్ట్ర నీటి వివాదాల్లో థర్డ్‌ పార్టీలు, సొసైటీలు జోక్యం చేసుకోలేవని తెలిపింది.

ఇప్పటికే ఈ అంశంపై ఆ రెండు రాష్ట్రాలు న్యాయపోరాటం చేస్తున్నాయని గుర్తు చేసింది. ఇలాంటి స‌మ‌యంలో సొసైటీల పిటిష‌న్ల‌ను విచారిస్తూ పోతే వివాదాలు ఎప్ప‌టికీ ముగియ‌వ‌ని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ద్విస‌భ్య‌ ధర్మాసనం వ్యాఖ్యానించింది. కావేరి జలాలపై తమిళనాడు, కర్ణాటక చట్టపరంగా పోరాడుతున్నందున ఈ విషయంలో ఆ రెండు రాష్ట్రాలకే తమ వాదనలు వినిపించే హక్కు ఉంటుందని సుప్రీం ధ‌ర్మాస‌నం స్పష్టం చేసింది.

Also Read..

యూపీ, ఉత్తరాఖండ్‌లో 11 రాజ్యసభ సీట్లకు ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌

పోలీసుల‌మ‌ని బెదిరించి.. ఢిల్లీ పార్క్‌లో మైన‌ర్‌పై గ్యాంగ్ రేప్‌.. 10 రోజుల్లో నాలుగో ఘ‌ట‌న‌

గులాబీ కోటలపై కాంగ్రెస్‌ గురి.. మూడు సభల వెనుక నాలుగు రాజకీయ లక్ష్యాలు!

Advertisement
Advertisement