Uttam Kumar Reddy | డిసెంబర్ నాటికి రెడ్లకుంట ఎత్తిపోతల పూర్తి చేయాలి : మంత్రి ఉత్తమ్
Uttam Kumar Reddy | ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి రెడ్లకుంట ఎత్తిపోతల పనులు పూర్తి చేయాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కోదాడ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఈ పథకం పనులను మంత్రి ఉత్తమ్ పరిశీలించారు.
Uttam Kumar Reddy | త్రినేత్ర న్యూస్ : ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి రెడ్లకుంట ఎత్తిపోతల పనులు పూర్తి చేయాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కోదాడ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఈ పథకం పనులను మంత్రి ఉత్తమ్ పరిశీలించారు. కాలువ, భూగర్భ మోటార్లు, సబ్‌స్టేషన్ పనులను పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ మిగిలిన పనులను వేగవంతం చేయాలని గుత్తేదారులను మంత్రి ఆదేశించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పాలేరు వాగుపై రూ.47.64 కోట్లతో చేపట్టిన పథకం పనులు 70 శాతం పూర్తి అయ్యాయి. వానాకాలం, యాసంగి సీజన్లలో ఆరు గ్రామాల పరిధిలో 4,460 ఎకరాలకు సాగునీరు అందిస్తాం. ఒక్కోటి 430 కిలోవాట్ల సామర్థ్యం గల నాలుగు వీటీ మోటార్లతో నీటి ఎత్తిపోత జరుగుతుంది. కాపుగల్లులో 1,608 ఎకరాలకు, నల్లబండగూడెంలో 1,400 ఎకరాలకు సాగునీరు ఇస్తాం. రెడ్లకుంటలో 576 ఎకరాలకు, చిమిరాలలో 410 ఎకరాలకు, కూచిపూడిలో 400 ఎకరాలకు, ద్వారకుంటలో 66 ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. రెడ్లకుంట ఎత్తిపోతల పథకంతో మొత్తం 1,486 కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. లబ్ధిదారుల్లో బీసీ 720, ఎస్సీ 446, ఓసీ 290, ఎస్టీ 30 కుటుంబాలు ఉన్నాయన్నారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంట నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డి, కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్, ఎస్పీ నరసింహ, గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, నీటిపారుదల శాఖ సీఈ నాగభూషణం, మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నారు. కార్యక్రమంలో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ●Thammidikunta Lake | హైదరాబాద్‌కు మరో మణిహారం.. నేడు తమ్మిడికుంట చెరువు ప్రారంభం!
- ●Ponnam Prabhakar | విజన్ 2047 లక్ష్యాల సాధనలో ఆటోమొబైల్, ఈవీ రంగాలు కీలకం
- ●Nifty IT | ఐటీ షేర్లలో భారీ ర్యాలీ.. కొనాలా.. అమ్మాలా..?
- ●Hijack Alert | టేకాఫ్‌కు ముందు.. ఎయిర్ ఇండియా విమానానికి హైజాక్ అలర్ట్
- ●CM Revanth Reddy | బీజేపీతో పోరాడే శక్తి కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది..
- ●Nifty 50 | నిఫ్టీ 28,000కు చేరుతుందా? మూడు అంతర్జాతీయ బ్రోకరేజీల అంచనాలివే!

Thammidikunta Lake | హైదరాబాద్‌కు మరో మణిహారం.. నేడు తమ్మిడికుంట చెరువు ప్రారంభం!

Ponnam Prabhakar | విజన్ 2047 లక్ష్యాల సాధనలో ఆటోమొబైల్, ఈవీ రంగాలు కీలకం

Nifty IT | ఐటీ షేర్లలో భారీ ర్యాలీ.. కొనాలా.. అమ్మాలా..?

Hijack Alert | టేకాఫ్‌కు ముందు.. ఎయిర్ ఇండియా విమానానికి హైజాక్ అలర్ట్




