త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OTT Release This Week | ఈ వారం ఓటీటీలో సినిమాల జాతర.. ఆరు కొత్త చిత్రాలు స్ట్రీమింగ్‌కు రెడీ..!

OTT Release This Week | వీకెండ్‌ వినోదం కోసం ఎదురుచూస్తున్న ఓటీటీ ప్రేక్షకులకు ఈ వారం మంచి విందు సిద్ధమైంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలకు చెందిన పలు కొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఓటీటీల్లో సంద‌డి చేయ‌నున్నాయి. నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, జీ5, మనోరమ మ్యాక్స్‌ వేదికగా ఆసక్తికరమైన కంటెంట్‌ అందుబాటులోకి రానుంది.

P

Entertainment | Published On Nov 25, 2026, 9.15 pm IST

OTT Release This Week | ఈ వారం ఓటీటీలో సినిమాల జాతర.. ఆరు కొత్త చిత్రాలు స్ట్రీమింగ్‌కు రెడీ..!
Advertisement

OTT Release This Week | వీకెండ్‌ వినోదం కోసం ఎదురుచూస్తున్న ఓటీటీ ప్రేక్షకులకు ఈ వారం మంచి విందు సిద్ధమైంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలకు చెందిన పలు కొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఓటీటీల్లో సంద‌డి చేయ‌నున్నాయి. నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, జీ5, మనోరమ మ్యాక్స్‌ వేదికగా ఆసక్తికరమైన కంటెంట్‌ అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా వెంకటేశ్‌ ‘ఆదర్శ కుటుంబం’, ఆనంది ‘గరివిడి లక్ష్మి’ సినిమాలతో పాటు మిస్టరీ థ్రిల్లర్లు, రొమాంటిక్‌ డ్రామాలు ప్రేక్షకులను అలరించనున్నాయి. మరి ఈ వారం ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్‌ కానుందో తెలుసుకుందాం.

ఆదర్శ కుటుంబం

విక్టరీ వెంకటేశ్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘ఆదర్శ కుటుంబం’ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. అక్టోబర్‌ 30న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా నవంబర్‌ 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించగా.. నివేదా పేతురాజ్‌, నారా రోహిత్‌, సత్య, రావు రమేశ్‌, వెన్నెల కిశోర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రూ.100 కోట్ల లాటరీ గెలుచుకున్న ఓ మధ్యతరగతి కుటుంబ పెద్ద జీవితం అనూహ్య మలుపులు తిరగడం ఈ సినిమా ప్రధాన కథాంశం. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌పై ఎస్ రాధాకృష్ణ నిర్మించగా.. తమన్‌ సంగీతం అందించాడు.

గరివిడి లక్ష్మి

ఉత్తరాంధ్ర ప్రముఖ జానపద కళాకారిణి గరివిడి లక్ష్మి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన తెలుగు బయోపిక్‌ ‘గరివిడి లక్ష్మి’ రేపటి నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ కానుంది. ఆనంది టైటిల్‌ రోల్‌లో నటించిన ఈ చిత్రానికి గౌరి నాయుడు జమ్ము దర్శకత్వం వహించారు. ఓ యువ దర్శకుడు గరివిడి గ్రామానికి వెళ్లి బుర్రకథ కళాకారిణి రెడ్డి విజయలక్ష్మి జీవితాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయడం కథలో ప్రధానాంశం. ఆమె గతం గురించి మాట్లాడేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటాయి. నరేశ్‌, రాశి, రాగ్‌ మయూర్‌, శ్రీనివాస్‌ అవసరాల, అంకిత్‌ కొయ్య, ఎల్బీ శ్రీరామ్‌ కీలక పాత్రల్లో నటించారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్‌, కృతి ప్రసాద్‌ నిర్మించగా.. చరణ్‌ అర్జున్‌ సంగీతం అందించాడు. ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్‌ కానుంది.

ఆక్టోపస్‌

తమిళంలో తెరకెక్కిన మిస్టరీ థ్రిల్లర్‌ ‘ఆక్టోపస్‌’ నవంబర్‌ 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్‌ కానుంది. అశ్విన్‌ కుమార్‌, అర్చన రవిచంద్రన్‌, వినోత్‌ కిషన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. జయచంద్ర హష్మి దర్శకత్వం వహించారు. ఒకరికొకరు బాగా పరిచయమున్న ఓ కాలనీలో మహిళ అదృశ్యం కావడంతో కథలో ఉత్కంఠ మొదలవుతుంది. ఆమె కోసం వెతుకుతున్న క్రమంలో చుట్టుపక్కల నివసించే వారి జీవితాల్లోని రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. మిస్టరీ, థ్రిల్లర్‌ అంశాలతో సాగే ఈ కథ ప్రేక్షకులను ఆసక్తికి గురిచేయనుంది.

కార్పొరేట్‌ లవ్‌ స్టోరీ

ఆఫీస్ నేపథ్యంలో సాగే కన్నడ రొమాంటిక్‌ డ్రామా ‘కార్పొరేట్‌ లవ్‌ స్టోరీ’ కూడా ఈ వారం ఓటీటీలోకి రానుంది. పన్నగ భరణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియాంక ఉపేంద్ర, సంజన దాస్‌, ప్రణవ్‌ శ్రీధర్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. బెంగళూరులోని ఓ డేటింగ్‌ యాప్‌ స్టార్టప్‌లో పనిచేసే నిత్య, అర్జున్‌ చుట్టూ కథ తిరుగుతుంది. ఆశయాలు, ఆలోచనలు వేర్వేరుగా ఉండే వీరిద్దరూ మొదట్లో కలిసి పనిచేయడానికి ఇబ్బందిపడతారు. పని ఒత్తిడి, రాత్రివేళల వరకు సాగే ఆఫీస్‌ పనుల మధ్య ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. ఈ వెబ్‌ సిరీస్‌ నవంబర్‌ 27 నుంచి జీ5లో అందుబాటులోకి రానుంది.

లా అండ్‌ ఆర్డర్‌

మలయాళంలో తెరకెక్కిన యాక్షన్‌ డ్రామా ‘లా అండ్‌ ఆర్డర్‌’ కూడా ఈ వారం ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది. రంజిత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రకాశ్‌ వర్మ, లిమ్సన్ కే సన్నీ, జాయ్‌ మాథ్యూ, సురేశ్‌ కృష్ణ, అభిరామి, శంకర్‌ రామకృష్ణన్‌, వీకే ప్రకాశ్ కీల‌క‌పాత్ర‌లో నటించారు. మమ్ముట్టి ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. నిజాయితీగల పోలీసు అధికారి బాలగోపాల్‌ ఐదుగురు యువ పోలీసు శిక్షణార్థులతో కలిసి శక్తిమంతమైన నేర ముఠాను ఎదుర్కోవడమే ఈ మూవీ స్టోరీ. ఇందులో మమ్ముట్టి 2004లో వచ్చిన ‘బ్లాక్‌’ సినిమాలోని కరిక్కమూరి షణ్ముఘన్‌ పాత్రలో మరోసారి కనిపించనున్నారు. ఈ చిత్రం మనోరమ మ్యాక్స్‌లో నవంబర్‌ 27న స్ట్రీమింగ్‌ కావచ్చని తెలుస్తుండ‌గా.. రిలీజ్‌పై స్పష్టత రావాల్సి ఉంది.

సత్యమేవ

మలయాళ క్రైమ్‌ డ్రామా ‘సత్యమేవ’ నవంబర్‌ 27 నుంచి జీ5లో ప్రీమియర్‌ కానుంది. రోనీ డేవిడ్‌ రాజ్‌, మీనాక్షి ఉన్నికృష్ణన్‌, జయరాజన్‌ కోజికోడ్‌, దీపు కరుణాకరన్‌, అజిత్‌ ధన్వంతరి తదితరులు నటించారు. దీపు కరుణాకరన్‌ దర్శకత్వం వహించారు. గతంలో ఎదురైన ఓ వైఫల్యంతో ఆత్మవిశ్వాసం కోల్పోయిన రాజారామ్‌ అనే వ్యక్తికి.. 20 ఏళ్ల క్రితం అదృశ్యమైన ఓ మహిళ ఆచూకీ తెలుసుకునే బాధ్యత తీసుకోవాల్సి వ‌స్తుంది. ఈ అన్వేషణలో అతడికి ఎన్నో రహస్యాలు, ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. క్రైమ్‌, మిస్టరీ అంశాలతో సాగే ఈ వెబ్‌ సిరీస్‌ జీ5లో మలయాళంలో అందుబాటులోకి రానుంది. ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు తెలుగు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌, బయోపిక్‌తో పాటు తమిళ మిస్టరీ థ్రిల్లర్‌, కన్నడ ప్రేమకథ, మలయాళ క్రైమ్‌, యాక్షన్‌ డ్రామాలు వినోదాన్ని అందించనున్నాయి.

Advertisement
Advertisement