Dasoju Sravan | భవిష్యత్ తరాలకు మంచి దేశాన్నివ్వాలి.. అందుకు రాజ్యాంగం చదవాలి
Dasoju Sravan | భవిష్యత్ తరాలకు ఒక మంచి దేశాన్నివ్వాలంటే రాజ్యాంగ అక్షరాస్యత (Constitutional Literacy) చాలా అవసరమని.. ప్రతి ఒక్కరు రాజ్యాంగాన్ని చదవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డా.దాసోజు శ్రవణ్ (Dasoju Sravan) పిలుపునిచ్చారు.
- ఓటుకు నోటు దొంగలు సీఎంలుగా చలామణి అవుతున్నరు
- సంవిధాన్ పేరిట రాజకీయ డ్రామాలు ఆడుతున్నరు
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఫైర్
Dasoju Sravan | త్రినేత్ర న్యూస్: భవిష్యత్ తరాలకు ఒక మంచి దేశాన్నివ్వాలంటే రాజ్యాంగ అక్షరాస్యత (Constitutional Literacy) చాలా అవసరమని.. ప్రతి ఒక్కరు రాజ్యాంగాన్ని చదవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డా.దాసోజు శ్రవణ్ (Dasoju Sravan) పిలుపునిచ్చారు. ఓటుకు నోటు దొంగలు నేడు సీఎంలుగా చలామణి అవుతున్నారని ఆరోపించారు. చేతిలో సంవిధాన్ పట్టుకొని రాజకీయ డ్రామాలు ఆడుతన్నారని మండిపడ్డారు. రాజ్యాంగ దినోత్సవాన్ని (Constitution Day) పురస్కరించుకొని గురువారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగ అక్షరాస్యత కోసం మన బాధ్యతగా పని చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.
భవిష్యత్ తరాలకు ఏమిచ్చినమంటే ఒక మంచి దేశం ఇచ్చినం అనాలే. ఆ మంచి దేశమివ్వాలంటే మనం భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. భారత రాజ్యాంగమిచ్చిన పవిత్రమైనది ఓటు హక్కు. ఆ ఓటు హక్కే ప్రజాస్వామ్యానికి పునాది. అటువంటి ఓటు హక్కును ఇవాళ ఓట్ల ద్వారా కొనుక్కొనే, అమ్ముకునే ఒక దుర్మార్గమైన వ్యవస్థను చూస్తున్నాం.
రాజ్యాంగం నిప్పు లాంటిది..
ఓటుకు నోటు దొంగలు ఇవాళ ముఖ్యమంత్రులుగా చలామణి అవుతున్నారు. వాళ్ల చేతుల్లోనే సంవిధాన్ అని చెప్పి రాజకీయ డ్రామాలు ఆడుతున్నారు. రాజ్యాంగం నిప్పులాంటిది. ఇలాంటి నిప్పుతో చెలగాటం ఆడుతున్న వారందరికీ తగిన గుణపాఠం చెప్పాలంటే రాజ్యాంగ స్ఫూర్తిని అన్వయించుకోవాలి. ఏబీసీడీలు రావొచ్చు.. ఏఐ టెక్నాలజీ రావొచ్చు.. కానీ రాజ్యాంగ అక్షరాస్యత కోసం మనం పని చేయాల్సిన అవసరం ఉంది.
ప్రశ్నించే హక్కునిస్తుంది
రాజ్యాంగాన్ని చదవండి. దాన్ని అన్వయించుకోండి. ఇది ప్రశ్నించే హక్కునిస్తుంది. దీంతో పాటు మనకున్న బాధ్యతలను గుర్తు చేస్తుంది. దేశాన్ని కాపాడుకొని మంచి సమాజాన్ని భవిష్యత్ తరాలకు మనం అందించాలంటే రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను స్మరిస్తూ, రాజ్యాంగ స్ఫూర్తి ప్రదాతలకు అందరికీ నివాళులర్పిస్తున్నాం అని దాసోజు పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

High Court | కోర్టు ధిక్కరణ కేసు.. సీపీ రమేశ్‌రెడ్డి, డీసీపీ కోటిరెడ్డికి జైలు శిక్ష
నవంబర్ 26, 2026

Drug-Free India Awareness March | డ్రగ్స్ బారిన పడ్డ విద్యార్థులు.. ప్రతి 15 రోజులకు 100 మంది వస్తున్నరు: గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డా.టి.ఉషరాణి
నవంబర్ 26, 2026

PM Modi | వికసిత్ భారత్ నిర్మాణానికి రాజ్యాంగ విలువలే మార్గదర్శకం : ప్రధాని మోదీ
నవంబర్ 26, 2026
తాజావార్తలు
- ●Sai Pallavi | రామాయణకు అమిత్‌షా అభినందనలు - కేంద్రమంత్రిని కలిసిన రణబీర్, సాయిపల్లవి
- ●Web Series | పాకిస్థాన్ కంటెంట్‌ను భారత్‌లో ప్రసారం చేయొద్దు.. నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం కీలక ఆదేశాలు
- ●FII Buying | నవంబర్‌లో ఎఫ్ఐఐల రికార్డు కొనుగోళ్లు.. రూ.1.22 లక్షల కోట్ల పెట్టుబడులు..
- ●High Court | కోర్టు ధిక్కరణ కేసు.. సీపీ రమేశ్‌రెడ్డి, డీసీపీ కోటిరెడ్డికి జైలు శిక్ష
- ●Indian Army microlight aircraft | రన్‌వేపై నాలుగు విమానాలు ల్యాండింగ్.. భారత సైన్యం అసాధారణ ఫీట్..!
- ●Drug-Free India Awareness March | డ్రగ్స్ బారిన పడ్డ విద్యార్థులు.. ప్రతి 15 రోజులకు 100 మంది వస్తున్నరు: గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డా.టి.ఉషరాణి

Sai Pallavi | రామాయణకు అమిత్‌షా అభినందనలు - కేంద్రమంత్రిని కలిసిన రణబీర్, సాయిపల్లవి

Web Series | పాకిస్థాన్ కంటెంట్‌ను భారత్‌లో ప్రసారం చేయొద్దు.. నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం కీలక ఆదేశాలు

FII Buying | నవంబర్‌లో ఎఫ్ఐఐల రికార్డు కొనుగోళ్లు.. రూ.1.22 లక్షల కోట్ల పెట్టుబడులు..

High Court | కోర్టు ధిక్కరణ కేసు.. సీపీ రమేశ్‌రెడ్డి, డీసీపీ కోటిరెడ్డికి జైలు శిక్ష




