Web Series | పాకిస్థాన్ వెబ్‌సిరీస్‌ను బ్యాన్ చేయాలి – మోదీకి లేఖ రాసిన సినీ వర్కర్స్ అసోసియేషన్
పాకిస్థాన్ ఫస్ట్ నెట్‌ఫ్లిక్స్ వెబ్‌సిరీస్‌గా రిలీజ్ అవుతోన్న జో బచే హై సంగ్ సమైత్‌లోను ఇండియాలో స్ట్రీమింగ్ కాకుండా నిషేధం విధించాలని ప్రధాని మోదీని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ (AICWA) కోరింది. ఈ మేరకు అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేష్ శ్యామ్‌లాగ్ గుప్తా మోదీకి ఓ లేఖ రాశారు.
Entertainment | Published On Nov 24, 2026, 5.34 pm IST
Web Series | పాకిస్థాన్ వెబ్‌సిరీస్‌ను ఇండియాలో రిలీజ్ కాకుండా నిషేధం విధించాలని ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ (AICWA) ప్రధాని మోదీని కోరింది. పాకిస్థాన్ ఫస్ట్ నెట్‌ఫ్లిక్స్ వెబ్‌సిరీస్‌గా జో బచే హై సంగ్ సమైత్ లో డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్, హానియా అమీర్, సనమ్ సయీద్ తో పాటు పలువురు పాకిస్థాన్ స్టార్స్ ఈ సిరీస్‌లో నటించబోతున్నారు. ఇటీవలే ఈ వెబ్‌సిరీస్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్‌చేసిన నెట్‌ఫ్లిక్స్ ఓ పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది.
బ్యాన్ చేయాలి...
ఈ పాకిస్థాన్ వెబ్‌సిరీస్‌ను ఇండియాలో స్ట్రీమింగ్ కాకుండా బ్యాన్ చేయాలంటూ ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ ప్రధాని మోదీకి ఓ లేఖను రాసింది. అమరవీరుల కుటుంబాల మనోభావాలతో పాటు జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ సిరీస్‌ను ఇండియాలో రిలీజ్ చేయద్దని కోరుతున్నామని ఈ లేఖలో పేర్కొన్నారు. పాకిస్థాన్ దర్శకులు, నటీనటులు రూపొందించిన సినిమాలు, వెబ్‌సిరీస్‌లలు టీవీల్లో ఓటీటీలలో టెలికాస్ట్ కాకుండా కఠినమైన చట్టాలను తీసుకురావాలని సినీ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ శ్యామ్‌లాగ్ గుప్తా డిమాండ్ చేశారు.
ఆదేశాల ఉల్లంఘనే...
పహాల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ కంటెంట్‌ను స్ట్రీమింగ్ చేయద్దని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు కేంద్ర ప్రసార సమాచార శాఖ స్పష్టమైన ఆదేశాలను జారీ చేసిందని సురేష్ శ్యామ్‌లాగ్ గుప్తా గుర్తుచేశారు. కానీ నెట్‌ఫ్లిక్స్ మాత్రం ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తూ సిరీస్‌ను ఇండియాలో స్ట్రీమింగ్ చేయాలని ప్రయత్నాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెట్‌ఫ్లిక్స్ మాత్రం ఇండియాలో ఈ సిరీస్ స్క్రీనింగ్‌పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Chiranjeevi | బాస్ రఫ్ఫాడించడం ఖాయం – ఓటీటీ కోసం చిరంజీవి టాక్ షో – మెగా వెర్స్ ప్రోమో రిలీజ్
నవంబర్ 24, 2026

Thriller OTT | థియేటర్లలో ఆడుతుండగానే ఓటీటీలోకి సూర్య బ్లాక్‌బస్టర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ
నవంబర్ 24, 2026

Raashi Khanna | ఓ వైపు సినిమా – మరోవైపు వెబ్‌సిరీస్ – బ్రేక్ లేకుండా కష్టపడుతోన్న రాశీఖన్నా
నవంబర్ 23, 2026
తాజావార్తలు
- ●BRTU Felicitation Telangana Bhavan | కొత్త లేబర్ కోడ్ల తర్వాత తొలి ఎన్నిక.. 51% ఓట్లతో చరిత్ర
- ●Death of KCR's Attendant | రోడ్డు ప్రమాదంలో కేసీఆర్ అటెండర్ మృతి.. బీఆర్ఎస్ అధినేత సంతాపం
- ●Inherited Property | వారసత్వ ఆస్తి విక్రయంపై ఎల్టీసీజీ పన్ను.. ఉమ్మడి యజమానులకు ఎలా వర్తిస్తుంది?
- ●Priyanka Gandhi | వేధింపులు.. అందుకే ఆ పిల్లాడి చెంప చెళ్లుమనిపించా : ప్రియాంక గాంధీ
- ●RS Praveen Kumar | బాంబు మెయిల్ ఎలా లీకైంది? అంతర్గతంగా వెరిఫై చేయకుండా బయటకెలా వచ్చింది?
- ●Seethakka Clarification on Kavitha | కవితను ఉద్దేశించి ఆ మాట అనలేదు.. పొరపాటున దొర్లింది

BRTU Felicitation Telangana Bhavan | కొత్త లేబర్ కోడ్ల తర్వాత తొలి ఎన్నిక.. 51% ఓట్లతో చరిత్ర

Death of KCR's Attendant | రోడ్డు ప్రమాదంలో కేసీఆర్ అటెండర్ మృతి.. బీఆర్ఎస్ అధినేత సంతాపం

Inherited Property | వారసత్వ ఆస్తి విక్రయంపై ఎల్టీసీజీ పన్ను.. ఉమ్మడి యజమానులకు ఎలా వర్తిస్తుంది?

Priyanka Gandhi | వేధింపులు.. అందుకే ఆ పిల్లాడి చెంప చెళ్లుమనిపించా : ప్రియాంక గాంధీ



