త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Komatireddy Rajagopal Reddy | ఖ‌ర్చెక్కువ‌వుతుంది.. ఇందిరమ్మ ఇళ్ల‌కిచ్చే నిధులు పెంచాలి

Komatireddy Rajagopal Reddy | ఇందిర‌మ్మ ఇళ్ల‌కు నిర్మాణ వ్య‌యం దాదాపు రూ.10 లక్ష‌లు అవుతుంద‌ని.. అందుకే నిధులు పెంచాల‌ని మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి కోరారు. ఈ విష‌యంపై ప్ర‌భుత్వం, మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి ఆలోచించాల‌ని కోరారు.

S

Telangana | Published On Sep 10, 2026, 2.41 pm IST

Komatireddy Rajagopal Reddy | ఖ‌ర్చెక్కువ‌వుతుంది.. ఇందిరమ్మ ఇళ్ల‌కిచ్చే నిధులు పెంచాలి
Advertisement
  • ప్రభుత్వం, మంత్రి ఒకసారి ఆలోచించాలి
  • బ‌తుకుదెరువు వాహ‌నాలున్న వారిని ఎంపిక చేయ‌లేదు
  • వాళ్ల కోసం నిబంధ‌న‌లు స‌డ‌లించాలి
  • అసెంబ్లీలో కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి

Komatireddy Rajagopal Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: ఇందిర‌మ్మ ఇళ్ల‌కు నిర్మాణ వ్య‌యం దాదాపు రూ.10 లక్ష‌లు అవుతుంద‌ని.. అందుకే నిధులు పెంచాల‌ని మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి కోరారు. ఈ విష‌యంపై ప్ర‌భుత్వం, మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి ఆలోచించాల‌ని కోరారు. గ్రామాల్లో ఆటోలు, పాత ఇనుప సామాను అమ్ముకునేవారు చిన్న చిన్న కార‌ణాల వ‌ల్ల ఎంపిక కాలేద‌ని.. అటువంటి వారికోసం నిబంధ‌న‌లు స‌డ‌లించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఈమేర‌కు గురువారం అసెంబ్లీలో ఇందిర‌మ్మ ఇండ్ల స‌మ‌స్య‌ల‌పై ఆయ‌న మాట్లాడారు.

ఈ ప్రభుత్వం పేదవాళ్ల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం చేపట్టినందుకు ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, గృహ నిర్మాణ శాఖ‌ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని అభినందిస్తున్న. గ్రామాల్లో ఆటోలు నడుపుకునేవారు, పాత ఇనుప సామాను అమ్ముకునేవారు, ట్రాక్టర్ల ద్వారా వ్యవసాయ పనులు చేసుకునే వాళ్ళు అర్హులై ఉండి చిన్నచిన్న కారణాల వల్ల ఎంపిక కాలేకపోయారు. బ‌తుకుదెరువు కోసం తీసుకొచ్చుకున్న వాహనాలు ఉన్నాయని వారిని ఎంపిక చేయలేదు. అటువంటి నిరుపేదల విషయంలో ప్రభుత్వం అధికారులు ఆలోచించి నిబంధనలను సడలించాలని కోరుతున్న.

ఎంతమందికి ఇళ్లు కట్టిస్తున్నాం అనేది ప్రాధాన్యం కాదు. నిజమైన అర్హులకు ఎంతమందికి ఇచ్చామన్నది ముఖ్యం. ఇచ్చే ప్రతి ఇల్లు అర్హులైన పేద వారికే దక్కాలనేదే నా ఉద్దేశం. నిర్మాణ వ్యయం బాగా పెరిగింది. తక్కువలో తక్కువ మూడు లక్షలపైనే అవుతుంది. ఇందిరమ్మ ఇల్లు పూర్తి అవ్వడానికి మినిమం 10 లక్షలు అవుతుంది. ఇండ్లు మంజూరైన కొంతమంది మొదలుపెట్టుకోలేని స్థితిలో ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్ల‌ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం.

మొద‌టి విడ‌త బిల్లులు వ‌స్త‌లేవ్‌..

పేదలు తమ జీవితంలో ఇది ఒక గర్వంగా చెప్పుకునే కార్యక్రమం. క్షేత్రస్థాయిలో మేం తిరుగుతున్నప్పుడు మా దృష్టికి వచ్చిన పలు సమస్యలను మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్న. ఇందిరమ్మ ఇండ్లకు ఇచ్చే నిధుల పెంపు ప్రభుత్వం, మంత్రి ఒకసారి ఆలోచించాలని కోరుతున్నా. ఇంటి స్థలం కూడా లేని నిరుపేదలు చాలామంది ఉన్నారు. వాళ్లందర్నీ గుర్తించి వారికి ఇంటి స్థలాలు ఇచ్చి ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తే బాగుంటుంది. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఇటీవల తీసుకొచ్చిన జీవో నిబంధనల ప్రకారం మొదటి విడతలో ఇల్లు మంజూరైన వాళ్లకు బిల్లులు రావట్లేదు. మొదటి విడతలో ఇల్లు కట్టుకున్న వాళ్లకు ఈ జీవో నుంచి సడలింపు ఇవ్వాలని కోరుతున్నా అని రాజ‌గోపాల్‌రెడ్డి పేర్కొన్నారు.

Advertisement
Advertisement