MLC Venkatrami Reddy | వీర్లపల్లి శంకర్ మీద ఏం చర్యలు తీసుకున్నరో చెప్పాలి
MLC Venkatrami Reddy | ప్రాణాలు ఫణంగా పెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ చావు కోరిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ ఇంటికి చావు డప్పులు పంపే సంస్కృతి ఏంటన్నారు.
- చావు కోరిన వ్యక్తిని ఇంకా రోడ్డు మీద తిరగనిస్తున్నరు
- ఏ ఒక్క ఎకరం పీవోబీ నుంచి తీయాలన్నా ఐఏఎస్‌లకు అవకాశం లేకుండా చేశారు
- శాసనమండలిలో ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి
MLC Venkatrami Reddy | త్రినేత్ర.న్యూస్: ప్రాణాలు ఫణంగా పెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ చావు కోరిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ ఇంటికి చావు డప్పులు పంపే సంస్కృతి ఏంటన్నారు. ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో ఇలాంటి ఘటన చూడలేదని చెప్పారు. ఎమ్మెల్యే శంకర్‌ను ఇంకా రోడ్ల మీద తిరగనిస్తున్నారని వ్యాఖ్యానించారు. మరోవైపు ఏ ఒక్క ఎకరం పీవోబీ నుంచి తీసేయాలన్నా ఐఏఎస్‌లకు అవకాశం లేకుండా చేశారని పేర్కొన్నారు. ఈమేరకు గురువారం ఆయన శాసన మండలిలో ప్రసంగించి పలు ప్రశ్నలను లేవనెత్తారు.
తెలంగాణ కోసం తన ప్రాణాలు ఫణంగా పెట్టిన వ్యక్తి, తెలంగాణ జాతిపిత వారు ఇంట్లో ఉంటే చావు డప్పులు పంపడం మీ సంస్కృతి ఏంటి.. తెలంగాణను దేశంలో నంబర్ వన్‌గా నిలిపిన వ్యక్తి కేసీఆర్. కేసీఆర్ చనిపోవాలని చట్ట సభల్లో, బయట మాట్లాడుతున్నారు. ఒక వ్యక్తి చావు కోరుకోవడం దుర్మార్గం. కేసీఆర్ తెలంగాణ తెచ్చినందుకు తెలంగాణకు గట్టి పునాది వేసినందుకు చావు డప్పులు కొడతారా? సంక్షేమ పథకాలు ఇచ్చినందుకు చావు డప్పులు కొడతారా?
ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం. వ్యవస్థలు అస్తవ్యస్తం అయ్యాయి ప్రజా జీవితం దుర్భరంగా మారింది. ఈరోజు ఉన్న ఐఏఎస్ అధికారులు మీ గుండె మీద చేయి వేసుకొని చెప్పండి. ఏ ఒక్క ఎకరం POB (Prohibitory Order Book) నుంచి తీయాలన్నా ఐఏఎస్‌లకు అవకాశం లేకుండా చేశారు. మన ఆత్మ గౌరవం ఎటుపోతుంది. చావు డప్పుపై తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు ప్రశ్నించాలి. ఇలాంటి చర్యలు మంచివి కావు. ప్రజలు దీనిపై నిర్ణయం తీసుకోవాలి.
కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి కుంటుపడింది. కాళేశ్వరంను మూడేళ్లుగా పట్టించుకోవడం లేదు. కేసీఆర్ మళ్ళీ రావాలి అని ప్రజలు కోరుకుంటున్నాను అని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●Dasoju Sravan | రేవంత్ రెడ్డిని అసెంబ్లీ నుంచి డిబార్ చేయాలి..
- ●Indias nuclear arsenal | భారత్ వద్ద 190 అణు వార్‌హెడ్స్
- ●Sunil Kanugolu | కాంగ్రెస్ వ్యూహకర్తగా సునీల్ కనుగోలు కంటిన్యూ.. దళపతి విజయ్ స్ట్రాటజిస్ట్ ఎంట్రీపై క్లారిటీ
- ●Apple | వినియోగదారులకు షాకిచ్చిన యాపిల్.. పాత ఐఫోన్ మోడల్స్ ధరలు భారీగా పెంపు..
- ●Realtor Ram Reddy | ఫామ్ హౌజ్‌లో ఉరేసుకున్న ప్రముఖ రియల్టర్ రామ్ రెడ్డి
- ●Anaswara Rajan | టాలీవుడ్లో అనస్వర రాజన్ జోరు.. మూడు సినిమాలను లైన్లో పెట్టిన మలయాళ బ్యూటీ

Dasoju Sravan | రేవంత్ రెడ్డిని అసెంబ్లీ నుంచి డిబార్ చేయాలి..

Indias nuclear arsenal | భారత్ వద్ద 190 అణు వార్‌హెడ్స్

Sunil Kanugolu | కాంగ్రెస్ వ్యూహకర్తగా సునీల్ కనుగోలు కంటిన్యూ.. దళపతి విజయ్ స్ట్రాటజిస్ట్ ఎంట్రీపై క్లారిటీ

Apple | వినియోగదారులకు షాకిచ్చిన యాపిల్.. పాత ఐఫోన్ మోడల్స్ ధరలు భారీగా పెంపు..





