త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

P Chidambaram | బ్రిక్స్‌తో భారత్‌కు ఒరిగిందేంటి..? : చిదంబరం

P Chidambaram | BRICS శిఖరాగ్ర సదస్సు వ‌ల్ల భార‌త్‌కు ఒరిగిందేంట‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత పి. చిదంబ‌రం (P Chidambaram) ప్ర‌శ్నించారు. ఇటీవలే జరిగిన సమావేశాల వల్ల ఎలాంటి ప్రయోజనాలు కనిపించలేదని అభిప్రాయ‌ప‌డ్డారు.

D

National | Published On Sep 10, 2026, 2.22 pm IST

P Chidambaram | బ్రిక్స్‌తో భారత్‌కు ఒరిగిందేంటి..? : చిదంబరం
Advertisement

P Chidambaram | త్రినేత్ర‌.న్యూస్ : ప్రతిష్టాత్మకమైన BRICS శిఖరాగ్ర సదస్సుకు న్యూఢిల్లీ ముస్తాబ‌వుతోంది. 12-13 తేదీల్లో న్యూఢిల్లీలోని భారత్‌ మండపంలో ఈ సదస్సును నిర్వహించనున్నారు. అయితే, ఈ స‌ద‌స్సు వ‌ల్ల భార‌త్‌కు ఒరిగిందేంట‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత చిదంబ‌రం (P Chidambaram) ప్ర‌శ్నించారు. అంతేకాదు, గ‌త మూడు స‌మావేశాల వ‌ల్ల చెప్పుకోద‌గ్గ ఫ‌లితాలు ఏమీ రాలేద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. భార‌త్ ప్ర‌స్తుతం బ్రిక్స్‌తో పాటు సాంఘై స‌హ‌కార సంస్థ‌, జీ20, క్వాడ్‌లో స‌భ్య దేశంగా ఉంద‌ని గుర్తు చేశారు. వీటి వ‌ల్ల దేశానికి క‌లుగుతున్న ప్ర‌యోజ‌నాలేంట‌ని నిల‌దీశారు. అయితే, గతంలో BRICS సదస్సుల వల్ల కొన్ని స్పష్టమైన ప్రయోజనాలు చేకూరాయని చెప్పారు.

చిదంబ‌రం ప్ర‌శ్న‌కు అధికార బీజేపీ తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్‌కు విదేశాంగ విధానం, దౌత్యంపై అవగాహన ఉందా..? అంటూ బీజేపీ నేత నళిన్‌ కోహ్లీ ప్రశ్నించారు. కాంగ్రెస్ దౌత్యం అంటే కేవలం లాభనష్టాల (give and take) కోణంలోనే చూస్తోందా..? అని ప్ర‌శ్నించారు. కీలకమైన అంతర్జాతీయ కార్యక్రమంపై కాంగ్రెస్‌ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ తన హయాంలో పాకిస్థాన్‌ను ఉగ్రవాద బాధితురాలిగా అభివర్ణించిన విష‌యాన్ని గుర్తు చేశారు. కానీ అది నిజానికి ఉగ్రవాదానికి పాల్పడే దేశం అని కోహ్లీ వ్యాఖ్యానించారు.

Also Read..

టార్గెట్ రెడ్‌ ఫోర్ట్ కాదు.. లాల్ మందిర్‌.. ఢిల్లీ పేలుడుపై సంచ‌ల‌న విష‌యాలు

క‌స్ట‌మ‌ర్ల‌కు ఎస్‌బీఐ అల‌ర్ట్‌.. వ‌రుస‌ సెలవులు, ఏటీఎంలు ప‌నిచేస్తాయా..?

త‌మ్ముడు విజ‌య్‌.. మీరు చెప్పింది నిజ‌మే.. పోలీసుల దాష్టీకానికి నా ద‌వ‌డ ప‌గిలింది : ఎంకే స్టాలిన్‌

Advertisement
Advertisement