త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KCR Fake Tweet Controversy | రేవంత్ రెడ్డే సంధ్యారావు.. సంధ్యారావే రేవంత్ రెడ్డి

అసెంబ్లీలో కేసీఆర్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేలా ఫేక్ ట్వీట్ చదివారని, సీఎం రేవంత్‌పై కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ నేతలు సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశారు.

J

Hyderabad | Published On Sep 10, 2026, 2.53 pm IST

KCR Fake Tweet Controversy | రేవంత్ రెడ్డే సంధ్యారావు.. సంధ్యారావే రేవంత్ రెడ్డి
Advertisement
  • సీఎం రేవంత్ రెడ్డిపై ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేయాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు బీఆర్ఎస్ ఫిర్యాదు
  • కేసీఆర్ ఇంటిని దళితులు సందర్శించిన తర్వాత పసుపు నీళ్లతో శుద్ధి చేశారంటూ '@SandhyaRaoBRS' అనే ఫేక్ అకౌంట్ చేసిన పోస్ట్‌పై గులాబీ నేతల ఆగ్రహం
  • డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో బషీర్‌బాగ్ సీసీఎస్ పోలీసులను కలిసిన బీఆర్ఎస్ నేతల బృందం
  • ఆ ఫేక్ అకౌంట్ వెనుక ఉన్నది, దాని సృష్టికర్త సీఎం రేవంత్ రెడ్డే అని తీవ్రంగా ఆరోపించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

KCR Fake Tweet Controversy | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ అసెంబ్లీ వేదికగా చోటుచేసుకున్న ఫేక్ ట్వీట్ వివాదం ఇప్పుడు పోలీస్ స్టేషన్‌కు చేరింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిష్టకు భంగం కలిగించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో నకిలీ ఎక్స్ పోస్ట్‌ను ప్రదర్శించారని బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్‌పై తక్షణమే ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ వారు హైదరాబాద్‌లోని సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

BRS Files Cyber Crime Complaint Against CM Revanth Reddy Over Fake KCR Tweet

బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ నేతృత్వంలోని నాయకుల బృందం సెప్టెంబర్ 10న సైబర్ క్రైమ్ పోలీసులను కలిసి ఈ మేరకు ఒక లిఖితపూర్వక కంప్లైంట్ (Complaint) అందజేశారు. దళితులు కేసీఆర్ ఇంటికి వచ్చిన మరుసటి రోజు ఆయన తన నివాసాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేశారంటూ '@SandhyaRaoBRS' అనే అకౌంట్ ఫేక్ పోస్ట్ చేసిందని, ఇది కేవలం కేసీఆర్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేందుకు పన్నిన కుట్ర అని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఆ అకౌంట్ బయోలో బీఆర్ఎస్ 'ఇంటర్నేషనల్ సెక్రటరీ' అని ఉందని, అసలు తమ పార్టీలో గానీ, దేశంలోని ఏ రాజకీయ పార్టీలో గానీ అలాంటి పదవే లేదని ఆయన స్పష్టం చేశారు.

బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి.. కనీస వెరిఫికేషన్ లేకుండా ఈ ఫేక్ పోస్ట్‌ను అసెంబ్లీ సాక్షిగా చదివి, దానికి సిట్ (SIT) విచారణ కూడా ప్రకటించడం అనుమానాలకు తావిస్తోందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. లక్షల ట్విట్టర్ అకౌంట్లు, వేల పోస్టులు ఉండగా.. రేవంత్ రెడ్డికి కచ్చితంగా ఈ పోస్టే ఎలా దొరికిందని వారు ప్రశ్నించారు. ఆ ట్వీట్ గురించి సీఎం మాట్లాడిన వెంటనే, ఎక్స్ (X) ప్లాట్‌ఫామ్ నుంచి ఆ అకౌంట్ పూర్తిగా మాయం కావడం వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు.

సంధ్యారావు అనే మహిళ పేరుతో, మహిళ ఫోటోతో ఉన్న ఈ అకౌంట్‌ను వాస్తవానికి ఒక పురుషుడు ఆపరేట్ చేస్తున్నాడని బీఆర్ఎస్ ఆధారాలతో సహా ఆరోపిస్తోంది. ఒక ట్విట్టర్ స్పేస్ (Spaces) సెషన్‌లో ఆ అకౌంట్ నుంచి పురుషుడి గొంతు వినిపించిందని, ఆ గొంతు రేవంత్ రెడ్డిదా లేక ఆయన అనుచరులదా అనేది తేలాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. "సంధ్యారావు ఎవరో కాదు రేవంత్ రెడ్డే.. ఫేక్ అకౌంట్ల సృష్టికర్త ఆయనే" అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

దళితుల పట్ల కేసీఆర్‌కు ఉన్న చిత్తశుద్ధిని శంకించేలా, కులాల మధ్య చిచ్చుపెట్టేలా వ్యవహరించిన ఈ ఫేక్ అకౌంట్ ఆపరేటర్లతో పాటు, దానికి సహకరించిన వారిపై బీఎన్ఎస్ (BNS) సెక్షన్లు 356, 353, ఐటీ చట్టం 66C, 66D కింద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బీఆర్ఎస్ కోరింది. అకౌంట్ ఇప్పటికే డిలీట్ చేసినందున, ఐపీ లాగ్స్ (IP logs), మెటాడేటా కోల్పోకముందే ట్విట్టర్ (X Corp) నుంచి అర్జెంట్‌గా ఆధారాలు సేకరించాలని పోలీసులను డిమాండ్ చేశారు. అసెంబ్లీ వేదికగా ఫేక్ హామీలు ఇస్తూ అధికారంలోకి వచ్చిన సీఎం, ఇప్పుడు ఫేక్ మాటలు చెబుతూ పబ్బం గడుపుకుంటున్నారని గులాబీ నేతలు విమర్శించారు.

Advertisement
Advertisement