త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nitin Gadkari | ప‌నిచేయ‌లేక‌పోతున్నా.. ఇక కొత్త‌త‌రానికి బాధ్య‌త‌లు అప్ప‌గించాలి : నితిన్ గ‌డ్క‌రీ

Nitin Gadkari | తాను మునుప‌టిలా ఎక్కువ స‌మ‌యం ప‌నిచేయ‌లేక‌పోతున్నాన‌ని కేంద్ర రోడ్డు ర‌హ‌దారుల శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ (Nitin Gadkari) అన్నారు. కొత్త త‌రానికి (new generation) బాధ్య‌త‌లు అప్ప‌గించాల్సిన స‌మ‌యం వ‌చ్చిందని వ్యాఖ్యానించారు. కేంద్ర కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ జరుగుతుందంటూ జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న వేళ గడ్కరీ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

D

National | Published On Aug 25, 2026, 1.54 pm IST

Nitin Gadkari | ప‌నిచేయ‌లేక‌పోతున్నా.. ఇక కొత్త‌త‌రానికి బాధ్య‌త‌లు అప్ప‌గించాలి : నితిన్ గ‌డ్క‌రీ
Advertisement

Nitin Gadkari | త్రినేత్ర‌.న్యూస్ : త్వరలోనే కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చంటూ జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ ప్ర‌చారం వేళ కొత్త త‌రానికి (new generation) బాధ్య‌త‌లు అప్ప‌గించాల్సిన స‌మ‌యం వ‌చ్చిందంటూ కేంద్ర రోడ్డు ర‌హ‌దారుల శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ (Nitin Gadkari) చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌కు దారి తీస్తున్నాయి.

నాగ్‌పూర్ (Nagpur)లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో గ‌డ్క‌రీ మాట్లాడుతూ.. తాను గ‌తంలోలాగా ఎక్కువ స‌మ‌యం ప‌ని చేయ‌లేక‌పోతున్న‌ట్లు చెప్పారు. కొత్త తరానికి అవకాశం ఇవ్వాల్సిన సమయం ఆస‌న్న‌మైంది అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. "గత 30 ఏళ్లుగా నేను ప్రజా జీవితంలో ఉన్నా. నిరంతరం పని చేస్తూనే ఉన్నా. గతంలో పార్టీ, ప్రభుత్వం కోసం విస్తృతంగా పని చేశా. ఈ ప్ర‌యాణంలో అనేక ఒడిదుడుకుల‌ను చూశాను. ప్రస్తుతం ప్రజా కార్యక్రమాల్లో నా ప్రమేయం తగ్గింది. గ‌తంలో మాదిరిగా ఇప్పుడు నేను ఎక్కువ ప‌ని చేయ‌లేక‌పోతున్నాను. ఇప్పుడు కొత్త త‌రానికి బాధ్య‌త‌లు అప్ప‌గించాల్సిన స‌మ‌యం వ‌చ్చింది" అని గ‌డ్క‌రీ తెలిపారు.

అదే స‌మ‌యంలో రాబోయే రోజుల్లో అభివృద్ధి ప‌నుల ప‌రిధి మ‌రింత పెరుగుతుంద‌ని గ‌డ్క‌రీ తెలిపారు. మహారాష్ట్రలో విద్యుత్ సౌకర్యం లేని గిరిజన గ్రామం ఒక్కటి కూడా ఉండకూడదని, రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి స్పష్టంగా కనిపించేలా చూడటమే తమ లక్ష్యమని స్ప‌ష్టం చేశారు. కేంద్ర కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ జరుగుతుందంటూ జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న వేళ గడ్కరీ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

Also Read..

కన్నీళ్లు పెట్టిస్తున్న 'షేరూ' కథ: లోయలో పడి కుటుంబం చనిపోయినా.. 3 రోజులుగా వారి కోసమే ఎదురుచూపులు

ఫ్యూచర్ సిటీ ప్రమోషన్ కోసమే రేవంత్ విదేశీ పర్యటన పెట్టుకుండు

న‌య‌న‌తార భ‌ర్త సినిమాను రిజెక్ట్ చేసిన కియారా అద్వానీ - కోలీవుడ్ డెబ్యూ ఛాన్స్ మిస్‌

Advertisement
Advertisement