త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Corpus | రూ.1 కోటి సంపాదించాలా.. అయితే ముందు రూ.10 ల‌క్ష‌లు దాటండి.. ఎందుకంటే..?

Corpus | చాలా మంది ఎప్ప‌టికైనా స‌రే కోట్ల రూపాయ‌లు సంపాదించి కోటీశ్వ‌రులుగా మారాల‌ని క‌ల‌లు కంటుంటారు. క‌నీసం రూ.1 కోటి విలువ క‌లిగిన పోర్ట్‌ఫోలియో అయినా ఉండాల‌ని ఆశిస్తుంటారు. అయితే వాస్త‌వానికి రూ.1 కోటి సంపాదించ‌డం చాలా క‌ష్ట‌మైన ప‌ని. అంత భారీ మొత్తంలో సంప‌ద‌ను కూడ‌బెట్టాలంటే సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు అయ్యే ప‌నికాదు.

S

Business | Published On Sep 10, 2026, 2.41 pm IST

Corpus | రూ.1 కోటి సంపాదించాలా.. అయితే ముందు రూ.10 ల‌క్ష‌లు దాటండి.. ఎందుకంటే..?
Advertisement

Corpus | చాలా మంది ఎప్ప‌టికైనా స‌రే కోట్ల రూపాయ‌లు సంపాదించి కోటీశ్వ‌రులుగా మారాల‌ని క‌ల‌లు కంటుంటారు. క‌నీసం రూ.1 కోటి విలువ క‌లిగిన పోర్ట్‌ఫోలియో అయినా ఉండాల‌ని ఆశిస్తుంటారు. అయితే వాస్త‌వానికి రూ.1 కోటి సంపాదించ‌డం చాలా క‌ష్ట‌మైన ప‌ని. అంత భారీ మొత్తంలో సంప‌ద‌ను కూడ‌బెట్టాలంటే సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు అయ్యే ప‌నికాదు. అయితే ముందుగా రూ.10 ల‌క్ష‌ల నిధికి చేరుకుంటే ఆ త‌రువాత రూ.1 కోటి దానంత‌ట అదే వ‌స్తుంద‌ని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. రూ.1 కోటి సంపాదించాల‌నే ల‌క్ష్యం సాధించాలంటే ముందుగా రూ.10 ల‌క్ష‌ల ల‌క్ష్యానికి చేరుకోవాల‌ని, దీంతో ప్ర‌ధాన ల‌క్ష్యానికి మార్గం సుగ‌మం అవుతుంద‌ని అంటున్నారు.

క్ర‌మ‌శిక్ష‌ణ ముఖ్యం..

పెట్టుబ‌డుల‌ను ప్రారంభించేవారు క‌చ్చితంగా క్ర‌మ‌శిక్ష‌ణ‌తో పొదుపు చేయాలి. ముఖ్యంగా ప్ర‌తి నెల పొదుపు చేయ‌డం ముఖ్యం. అలాగైతేనే రూ.1 కోటి నిధిని కూడ‌బెట్టే అవ‌కాశం ఉంటుంది. ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ లేక‌పోతే రూ.1 కోటి ల‌క్ష్యాన్ని సాధించ‌లేరు. నెల నెలా ఇన్వెస్ట్ చేయ‌డం వ‌ల్ల మాత్ర‌మే భారీ మొత్తంలో కార్ప‌స్ జ‌మ అవుతుంది. అయితే ప్రారంభంలో పెట్టుబ‌డి మొత్తం త‌క్కువ‌గా ఉంద‌ని చింతించాల్సిన ప‌నిలేదు. దీర్ఘ‌కాలంలో అదే భారీ మొత్తాన్ని సృష్టిస్తుంది. ప్రారంభంలో పెట్టుబ‌డి త‌క్కువ క‌నుక రాబ‌డి కూడా త‌క్కువ‌గానే ఉంటుంది. కానీ కాంపౌండింగ్ ప్ర‌భావంతో వ‌డ్డీపై వ‌డ్డీ వ‌స్తూనే ఉంటుంది. దీంతో భారీ మొత్తంలో సంప‌ద జ‌మ అవుతుంది. అందువల్ల పెట్టుబ‌డి విలువ రూ.10 ల‌క్ష‌ల‌కు చేరుకునే వ‌ర‌కు ఆ మొత్తాన్నే మొద‌టి ల‌క్ష్యంగా నిర్ణ‌యించుకోవాలి. అది చేర‌గానే త‌రువాత రూ.1 కోటి చాలా సుల‌భంగా జ‌మ అవుతుంది.

రూ.10 ల‌క్ష‌లు ఉంటే..

ప్ర‌తి నెలా పెట్టుబ‌డి పెట్టే మొత్తంతోపాటు రూ.10 ల‌క్ష‌ల నిధిపై కూడా లాభం వ‌స్తుంది. క‌నుక రూ.10 ల‌క్ష‌ల‌కు పోర్ట్‌ఫోలియో చేర‌గానే దాన్ని విత్‌డ్రా చేయ‌కూడ‌దు. ఇంకా పెట్టుబ‌డి పెడుతూనే ఉండాలి. దీంతో వ‌డ్డీపై వ‌డ్డీ వ‌స్తూ కాంపౌండింగ్ ప్ర‌యోజ‌నం ల‌భిస్తుంది. ఇది భారీ మొత్తంలో నిధి జ‌మ అయ్యేలా చేస్తుంది. ఉదాహ‌ర‌ణ‌కు ఒక పెట్టుబ‌డిదారు వ‌ద్ద రూ.10 ల‌క్ష‌లు ఉన్నాయ‌ని అనుకుంటే ఆ మొత్తానికి ఏడాదికి స‌గ‌టున 12 శాతం రాబ‌డి వ‌స్తుంద‌ని భావిస్తే, ఆ పెట్టుబ‌డిదారు అద‌నంగా ఎలాంటి పెట్టుబ‌డి పెట్ట‌కపోయినా సుమారు 6 ఏళ్ల‌లో ఆ మొత్తం రూ.19.73 ల‌క్ష‌ల‌కు చేరే అవ‌కాశం ఉంటుంది. అయితే 12 శాతం రాబ‌డి అంటే సాధార‌ణంగా మ్యుచువ‌ల్ ఫండ్స్‌లో పెట్టుబ‌డి పెట్టేవారు స‌గ‌టున ఆశించే వార్షిక రాబ‌డి. అందువ‌ల్ల పెట్టుబ‌డి, మార్కెట్ హెచ్చుత‌గ్గులు, ఫండ్ ప‌నితీరు అనుగుణంగా వ‌చ్చే రాబ‌డి మొత్తం మారుతుంది. ఇది 12 శాతం క‌న్నా ఎక్కువ‌గా లేదా త‌క్కువ‌గా కూడా ఉండే అవ‌కాశాలు ఉంటాయి.

ప్ర‌ణాళిక ఉండాలి..

అయితే రూ.10 ల‌క్ష‌ల నిధి అలా ఉండ‌గానే నెల నెలా పెట్టుబ‌డి ఇంకా పెడుతూ వెళ్తే ఇంకా భారీ మొత్తంలో నిధి జ‌మ అవుతుంది. ఉదాహ‌ర‌ణ‌కు రూ.20 ల‌క్ష‌ల‌పై రాబ‌డి 12 శాతం అంటే ఏడాదికి 2.40 ల‌క్ష‌లు, రూ.50 ల‌క్ష‌ల‌పై అయితే రూ.6 ల‌క్ష‌లు, రూ.1 కోటి పెట్టుబ‌డిపై 12 శాతం రాబ‌డి అయితే రూ.12 ల‌క్ష‌లు వ‌స్తాయి. అంటే పెట్టుబ‌డి మొత్తం ఎంత ఎక్కువ‌గా ఉంటే ఆ త‌రువాత వ‌చ్చే రాబ‌డి కూడా అంతే ఎక్కువ‌గా ఉంటుంద‌ని అర్థం. అయితే రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కు నిధిని జ‌మ చేసేందుకు ముందుగా ప్ర‌ణాళిక ఉండాలి. ఏ ఫండ్‌లో నెల‌కు ఎంత పెడితే ఎన్ని సంవ‌త్స‌రాల్లో ఆ మొత్తం జ‌మ అవుతుందో ముందే ఉజ్జాయింపుగా తెలుసుకోవాలి. దాని ప్ర‌కారం ఆల‌స్యం చేయ‌కుండా పెట్టుబ‌డులు ప్రారంభించాలి. త‌రువాత క్ర‌మ‌శిక్ష‌ణ‌తో క్ర‌మం త‌ప్ప‌కుండా పెట్టుబ‌డుల‌ను పెట్టాలి. దీంతో దీర్ఘ‌కాలంలో భారీ మొత్తంలో సంప‌ద నిర్మాణ‌మ‌వుతుంది. అయితే స్టాక్ మార్కెట్లు లేదా మ్యుచువ‌ల్ ఫండ్స్‌లో పెట్టుబ‌డులు పెట్టేముందు నిపుణుల స‌ల‌హా తీసుకోవ‌డం మంచిది.

Advertisement
Advertisement