Jayam Ravi | వెంకటేశ్వరస్వామిగా జయం రవి – మంచు మనోజ్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ
కోలీవుడ్ హీరో జయం రవి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. మంచు మనోజ్ హీరోగా వడ్డీకాసుల వాడ పేరుతో సోషియా ఫాంటసీ కామెడీ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్రలో జయం రవి కనిపించబోతున్నాడు.
Entertainment | Published On Sep 10, 2026, 2.52 pm IST
Jayam Ravi | కోలీవుడ్ అగ్ర నటుడు జయం రవి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. వెంకటేశ్వర స్వామి పాత్రలో కనిపించబోతున్నారు. ఈ విషయాన్ని జయం రవి ట్విట్టర్ ద్వారా గురువారం అఫీషియల్‌గా ప్రకటించారు. మంచు మనోజ్ హీరోగా వడ్డీకాసుల వాడ పేరుతో సోషియో ఫాంటసీ కామెడీ మూవీ తెరకెక్కుతోంది. తేజ్ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ప్రస్తుతం వడ్డీకాసుల వాడ షూటింగ్ జరుగుతోంది.
స్టార్ హీరోలను అనుకొని...
అప్పులు, ఈఎంఐల బాధ నుంచి బయటపడేందుకు ఓ మిడిల్ క్లాస్ యువకుడు చేసే ప్రయత్నాలను వినోదాత్మకంగా దర్శకుడు తేజ్ ఉప్పలపాటి ఈ సినిమాలో చూపించబోతున్నారు. కథానుగుణంగా ఈ సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్ర కీలకంగా ఉంటుందని మేకర్స్ వెల్లడించారు. ఈ పాత్ర కోసం పలువురు స్టార్ హీరోలను అనుకున్న దర్శకనిర్మాతలు చివరకు జయం రవిని ఫైనల్ చేశారు.
అదృష్టంగా భావిస్తున్నా...
ఈ విషయాన్ని జయం రవి కూడా అఫీషియల్‌గా ప్రకటించాడు. వెంకటేశ్వర స్వామిగా నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. పుట్టినరోజు సందర్భంగా దేవుడు ఇచ్చిన గిఫ్ట్ ఇది అంటూ ఓ పోస్ట్ పెట్టాడు. ఓ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. ఇందులో ఓ భక్తుడి చేయిని దేవుడు పట్టుకున్నట్లుగా కనిపిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో తిరుపతి గుడి కనిపిస్తోంది. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మంచు మనోజ్‌తో సమానంగా ఈ సినిమాలో జయం రవి పాత్ర కనిపిస్తుందని అంటున్నారు. వడ్డీకాసులవాడ మూవీతోనే జయం రవి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు టాక్ వినిపిస్తుంది.
డైరెక్టర్‌గా...
ప్రస్తుతం తమిళంలో కరాటే బాబుతో పాటు మరో రెండు సినిమాలు చేస్తున్నాడు జయం రవి. డైరెక్టర్‌గా కూడా మారబోతున్నాడు. ఎన్ ఆర్డనరీ మ్యాన్ పేరుతో కామెడీ డ్రామా మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో యోగిబాబు ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●MLC Venkatrami Reddy | వీర్లపల్లి శంకర్ మీద ఏం చర్యలు తీసుకున్నరో చెప్పాలి
- ●Supreme Court | ఆన్లైన్లో అనుచిత కంటెంట్ నుంచి పిల్లల్ని రక్షించండి.. కేంద్రానికి సుప్రీం నోటీసులు
- ●KCR Fake Tweet Controversy | రేవంత్ రెడ్డే సంధ్యారావు.. సంధ్యారావే రేవంత్ రెడ్డి
- ●Corpus | రూ.1 కోటి సంపాదించాలా.. అయితే ముందు రూ.10 లక్షలు దాటండి.. ఎందుకంటే..?
- ●Komatireddy Rajagopal Reddy | ఖర్చెక్కువవుతుంది.. ఇందిరమ్మ ఇళ్లకిచ్చే నిధులు పెంచాలి
- ●P Chidambaram | బ్రిక్స్‌తో భారత్‌కు ఒరిగిందేంటి..? : చిదంబరం

MLC Venkatrami Reddy | వీర్లపల్లి శంకర్ మీద ఏం చర్యలు తీసుకున్నరో చెప్పాలి

Supreme Court | ఆన్లైన్లో అనుచిత కంటెంట్ నుంచి పిల్లల్ని రక్షించండి.. కేంద్రానికి సుప్రీం నోటీసులు

KCR Fake Tweet Controversy | రేవంత్ రెడ్డే సంధ్యారావు.. సంధ్యారావే రేవంత్ రెడ్డి

Corpus | రూ.1 కోటి సంపాదించాలా.. అయితే ముందు రూ.10 లక్షలు దాటండి.. ఎందుకంటే..?






