త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jitendra Singh | ఎప్పుడైనా, ఎక్క‌డైనా.. చ‌ర్చ‌ల‌కు మేం సిద్ధం.. విద్యార్థుల‌కు ప్ర‌భుత్వం బ‌హిరంగ ఆహ్వానం

Jitendra Singh | నీట్ పేప‌ర్ లీక్ అంశంపై ఆందోళ‌న చేప‌డుతున్న నిర‌స‌న‌కారులు, విద్యార్థి సంఘాల‌తో చ‌ర్చ‌ల‌కు (CJP protesters) ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ (Jitendra Singh) తెలిపారు.

D

National | Published On Jul 23, 2026, 4.36 pm IST

Jitendra Singh | ఎప్పుడైనా, ఎక్క‌డైనా.. చ‌ర్చ‌ల‌కు మేం సిద్ధం.. విద్యార్థుల‌కు ప్ర‌భుత్వం బ‌హిరంగ ఆహ్వానం
Advertisement

Jitendra Singh | నీట్ పేప‌ర్ లీక్ అంశంపై ఆందోళ‌న చేప‌డుతున్న నిర‌స‌న‌కారులు, విద్యార్థి సంఘాల‌తో చ‌ర్చ‌ల‌కు (CJP protesters) ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ (Jitendra Singh) తెలిపారు. ఈ మేర‌కు చ‌ర్చ‌ల కోసం నిన్న‌టి నుంచి నాలుగు ప్ర‌తిపాద‌న‌లు పంపిన‌ట్లు చెప్పారు. నీట్‌తో పాటూ ఇతర అంశాలపై చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామంటూ మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. ఎప్పుడైనా, ఎక్కడైనా తాము చర్చలకు సిద్ధమేన‌ని ప్ర‌క‌టించారు. ఈ మేరకు స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం చ‌ర్చ‌ల్లో పాల్గొనాల‌ని మీడియా ద్వారా ఆయన విద్యార్థులను ఆహ్వానించారు.

"ఆందోళన చేస్తున్న విద్యార్థులకు ఇదే నా బ‌హిరంగ‌ విజ్ఞప్తి. చర్చలు జరపడానికి ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంది. ప్రభుత్వం తలుపులు తెరిచే ఉన్నాయి. నిన్న‌టి నుంచి మేము నాలుగు ప్ర‌తిపాద‌న‌లు పంపాం. యువతకు ఇదే నా బ‌హిరంగ‌ ఆహ్వానం. ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఎక్క‌డ కోరితే అక్క‌డ చ‌ర్చ‌లు జ‌రిపేందుకు రెడీగా ఉన్నాం. ఈ విష‌యంలో మాకు ఎలాంటి ప‌ట్టింపులూ లేవు. ఆందోళనకు సంబంధించిన విషయాలతో పాటు, ఇతర అంశాలపై కూడా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రండి కూర్చొని స‌మ‌స్య ప‌రిష్కారం కోసం చ‌ర్చిద్దాం" అని జితేంద్ర సింగ్ ఆందోళ‌న చేస్తున్న విద్యార్థుల‌కు పిలుపునిచ్చారు.

అదే స‌మ‌యంలో చ‌ర్చ‌ల‌కు ఎంత స‌మ‌యం అవ‌స‌ర‌మైతే అంత స‌మ‌యం కేటాయించేందుకు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని చెప్పారు. ఈ చ‌ర్చ‌ల్లో త‌న‌తోపాటూ ఆరోగ్య శాఖ మంత్రి జేపీ న‌డ్డా కూడా పాల్గొంటార‌ని తెలిపారు. యువ‌త ప్ర‌యోజ‌నాల కోసం ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ అధిక ప్రాధాన్య‌త ఇస్తార‌ని ఈ సంద‌ర్భంగా కేంద్ర మంత్రి తెలిపారు. పేప‌ర్ లీక్ ఘ‌ట‌న‌ల‌పై విచార‌ణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టుల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ నిర్ణ‌యాన్ని ఈ సంద‌ర్భంగా కేంద్ర మంత్రి ప్ర‌స్తావించారు. కాగా, జులై 20న సీజేపీ ప్ర‌తినిధులు జేపీ న‌డ్డాను క‌లిసి త‌మ డిమాండ్ల‌ను వివ‌రించిన విష‌యం తెలిసిందే.

Also Read..

రేవంత్ అక్ర‌మ సంపాద‌న‌ కాంగ్రెస్‌కు ఒక మూట‌.. బీజేపీకి రెండు మూటలు

సాయిప‌ల్ల‌వికి కండీష‌న్లు పెట్టిన మ‌ణిర‌త్నం - న‌ల‌భై రోజులే డెడ్‌లైన్‌

మధ్యప్రాచ్య ఉద్రిక్తతలతో స్టాక్ మార్కెట్లు కుదేలు.. నాలుగు రోజుల్లో రూ.4 లక్షల కోట్ల నష్టం..

Advertisement
Advertisement