vivo T5e | వివో నుంచి టి5ఇ స్మార్ట్ ఫోన్.. భారీ బ్యాటరీ, ధర తక్కువ..
T5e | మొబైల్స్ తయారీ సంస్థ వివో తన నూతన స్మార్ట్ ఫోన్ వివో టి5ఇ ని భారత మార్కెట్‌లో సోమవారం విడుదల చేసింది. విద్యార్థులు, యువ ఉద్యోగులను దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక బ్యాటరీ బ్యాకప్, రోజువారీ వినియోగానికి తగిన మన్నిక, స్థిరమైన పనితీరుతో ఈ ఫోన్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్ లభించింది.
Technology | Published On Jul 27, 2026, 3.47 pm IST
vivo T5e | మొబైల్స్ తయారీ సంస్థ వివో తన నూతన స్మార్ట్ ఫోన్ వివో టి5ఇ ని భారత మార్కెట్‌లో సోమవారం విడుదల చేసింది. విద్యార్థులు, యువ ఉద్యోగులను దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక బ్యాటరీ బ్యాకప్, రోజువారీ వినియోగానికి తగిన మన్నిక, స్థిరమైన పనితీరుతో ఈ ఫోన్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్ లభించింది. దీనివల్ల ఫోన్ నిర్మాణం చాలా దృఢంగా ఉంటుంది. అంత సులభంగా పగలదు. అలాగే ఐపీ64 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్‌ను కూడా ఇచ్చారు. ఇందులో 6.74 ఇంచుల ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉండగా, దీనికి హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్‌ను ఇచ్చారు. ఇది 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. అందువల్ల డిస్‌ప్లే క్వాలిటీగా కనిపిస్తుంది. ఇందులో ఆక్టాకోర్ యూనిసోక్ టి7225 ప్రాసెసర్‌ను ఇచ్చారు. 4జీబీ ర్యామ్ వస్తుంది. ర్యామ్‌ను అదనంగా మరో 4జీబీ వరకు వర్చువల్‌గా పెంచుకునే వీలు కల్పించారు. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ 16తో ఇది పనిచేస్తుంది.
ఆకట్టుకునే ఏఐ ఫీచర్లు..
ఈ ఫోన్‌లో టెక్స్ట్‌ను సారాంశం చేయడం, అనువదించడం, తిరిగి రాయడం వంటి పనులకు ఏఐ ఆధారిత టూల్స్‌ను అందించారు. అలాగే డాక్యుమెంట్లను క్రమబద్ధీకరించేందుకు వివో డాక్‌మాస్టర్ ఫీచర్ కూడా ఉంది. వెనుక భాగంలో 13 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను ఇవ్వగా, ముందు వైపు 5 మెగాపిక్సల్ కెమెరా ఉంది. 5500 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ కలిగిన బ్యాటరీని ఇందులో ఇచ్చారు. ఇది 15 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. దీని వల్ల ఫోన్‌ను వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు. ఇందులో 64జీబీ స్టోరేజ్‌ను ఇచ్చారు. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 2టీబీ వరకు స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ సైడ్ మౌంటెడ్‌గా ఇచ్చారు. డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ లభిస్తుంది. వైఫై, బ్లూటూత్ 5.2, యూఎస్‌బీ టైప్ సి ఫీచర్లు ఉన్నాయి.
వివో టి5ఇ స్మార్ట్ ఫోన్‌ను కేవలం సింగిల్ వేరియెంట్‌లోనే లాంచ్ చేశారు. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియెంట్‌లో లభిస్తున్న ఈ ఫోన్ ధర రూ.13,999గా ఉంది. వివో ఇండియా ఆన్‌లైన్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్, దేశవ్యాప్తంగా ఉన్న పార్ట్‌నర్ షిప్ రిటెయిల్ స్టోర్స్‌లో ఈ ఫోన్‌ను విక్రయిస్తున్నారు.
సంబంధిత వార్తలు

vivo Y31t 5G | 7200 ఎంఏహెచ్ బ్యాటరీతో వివో కొత్త ఫోన్.. మిడ్ రేంజ్ విభాగంలో బెస్ట్..
ఆగస్టు 31, 2026

Motorola | 10,200 ఎంఏహెచ్ బ్యాటరీ, 5జి ఫీచర్లతో లాంచ్ అయిన మోటోరోలా కొత్త ట్యాబ్.. ధర ఎంతంటే..
ఆగస్టు 8, 2026

HP OmniPad 12 | విద్యార్థులు, ఉద్యోగులకు హెచ్‌పీ ప్రత్యేక ట్యాబ్.. ఉచిత ఏఐ సబ్స్క్రిప్షన్..
ఆగస్టు 7, 2026
తాజావార్తలు
- ●Sanjay Kalvakuntla vs Kishan Reddy | కేంద్రం ఒక్క మెడికల్ సీటు ఇచ్చిందని నిరూపిస్తే రాజీనామా చేస్తా
- ●Lava Virat Curve | లావా విరాట్ కర్వ్ వచ్చేసింది.. వెనుక మరో డిస్‌ప్లే..
- ●V Hanumantha Rao | కాంగ్రెస్ ఇచ్చిన భూములను కాంగ్రెస్సే కాపాడాలి
- ●Sonia Gandhi | పౌరసత్వం అంశం.. సోనియా గాంధీకి చుక్కెదురు
- ●Indian Railways | యూపీఐ ద్వారా రైలు టిక్కెట్లను కొంటే ఛార్జీలు ఉంటాయా.. రైల్వే శాఖ స్పష్టత..
- ●Ponguleti Srinivas Reddy | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అలర్ట్.. మంత్రి పొంగులేటి కీలక నిర్ణయం

Sanjay Kalvakuntla vs Kishan Reddy | కేంద్రం ఒక్క మెడికల్ సీటు ఇచ్చిందని నిరూపిస్తే రాజీనామా చేస్తా

Lava Virat Curve | లావా విరాట్ కర్వ్ వచ్చేసింది.. వెనుక మరో డిస్‌ప్లే..

V Hanumantha Rao | కాంగ్రెస్ ఇచ్చిన భూములను కాంగ్రెస్సే కాపాడాలి

Sonia Gandhi | పౌరసత్వం అంశం.. సోనియా గాంధీకి చుక్కెదురు



