MP Lakshman | రేవంత్‌ను ఒక్కటే అడుగుతున్నా.. రెండు లక్షల ఉద్యోగాలు ఏమైనయ్?
MP Lakshman | తెలంగాణ యువతకిచ్చిన రెండు లక్షల ఉద్యోగాల హామీ ఏమైందని.. దీనికి సీఎం రేవంత్ సమధానం చెప్పాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యపై కేంద్ర హోంమంత్రి క్షమాపణ చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆయన స్పందించారు.
- చెప్పు సమాధానం
- ముందు తెలంగాణ యువత సమస్యలు పరిష్కరించు.. ఆ తర్వాతే అన్ని విషయాలు మాట్లాడుదాం
- దేశం కోసమే ప్రధాన్ రాజీనామా చేశారు
- నందన్ నీలేకని నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్ తీసుకొస్తున్నరు
- మీరేమో గిరిజనులు భూములు గుంజుకుంటున్నరు
- సీఎం రేవంత్‌కు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ చురకలు
MP Lakshman | త్రినేత్ర.న్యూస్: తెలంగాణ యువతకిచ్చిన రెండు లక్షల ఉద్యోగాల హామీ ఏమైందని.. దీనికి సీఎం రేవంత్ సమధానం చెప్పాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యపై కేంద్ర హోంమంత్రి క్షమాపణ చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. సోమవారం ఢిల్లీలో ఓ న్యూస్ ఛానల్‌తో మాట్లాడుతూ రేవంత్ సర్కార్‌పై విమర్శలు చేశారు. ముందు తెలంగాణ యువత సమస్యలు పరిష్కరించిన తర్వాతే అన్ని విషయాలపై చర్చిద్దామని చెప్పారు. దేశం కోసమే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారన్నారు. మీరేమో గిరిజనుల భూములు గుంజుకుంటున్నారని ఆరోపించారు.
పేపర్ లీక్ అంశం పాతదే..
పేపర్ లీక్ అంశం పాతదే. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంస్కరణలు తెచ్చారు. పేపర్ లీక్ జరిగినప్పుడు సీబీఐ విచారణకు ఆదేశించాం., సిట్ (SIT) కూడా ఏర్పాటు చేశాం. 13 మందిని అరెస్టు చేశారు, ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ప్రకటించారు. ఇలాంటి ఘటనే ఇతర రాష్ట్రాల్లో జరిగినప్పుడు ఏ చర్యా తీసుకోలేదు. కానీ కాంగ్రెస్‌వాళ్లు మాత్రం చాలా రచ్చ చేస్తున్నారు. నందన్ నీలేకని ఆధ్వర్యంలో ఒక టాస్క్ ఫోర్స్ తీసుకువస్తున్నారు. కానీ కాంగ్రెస్‌కు ఎలాంటి చర్చ జరగడం ఇష్టం లేదు. కేవలం రాజకీయం చేయాలనే చూస్తున్నారు. మోదీ ప్రభుత్వం బాధ్యత వహించింది కాబట్టే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కాంగ్రెస్‌కుఉ కావాల్సింది కేవలం గందరగోళం సృష్టించడమే అని లక్ష్మణ్ ఆరోపించారు.
పార్లమెంటులో చర్చలకు ఎప్పుడైనా సిద్ధమే..
నేను కాంగ్రెస్ పార్టీకి ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. ప్రభుత్వం అన్ని సమస్యలపై చర్చించడానికి సిద్ధంగా ఉంది. ముందు తెలంగాణలోని యువత ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను కాంగ్రెస్ పార్టీ పరిష్కరించాలి. ఆ తర్వాతే మనం ఇక్కడ అన్ని విషయాలపై చర్చిద్దాం. కాంగ్రెస్ నాయకులు తెలంగాణలో గిరిజనుల భూములు లాక్కుంటున్నారు. చర్చలకు ప్రభుత్వం సిద్ధం. విద్యార్థుల సమస్యలతో పాటు అన్ని రకాల అంశాలపై పార్లమెంట్‌లో చర్చలు జరపడానికి కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధమే. రేవంత్ రెడ్డి రాష్ట్ర యువతను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఫస్ట్ రెండు లక్షల ఉద్యోగాల హామీపై సమాధానం చెప్పాలి. విద్యార్థుల సమస్యలపై కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు అని ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు.
#WATCH | Over the Opposition asking for an apology from the Union Home Minister on police action on protesting students at Jantar Mantar on July 20, BJP MP K Laxman says, "I want to say one thing to the Congress party that the government is ready to discuss all issues. I want to… pic.twitter.com/9Z5JIuDPz3
— ANI (@ANI) July 27, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Bhatti Vikramarka | ఉచిత పథకాలు కాదు.. ప్రజల భవిష్యత్‌పై పెట్టుబడులు అవి
జులై 27, 2026

MP Chamala Kirankumar Reddy | 21 ఏళ్లకే చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలి.. ఎంపీ చామల డిమాండ్
జులై 27, 2026

Srinivas Goud | జూరాలకు వరదొస్తోంది.. అయినా నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ మోటార్లు ఎందుకు ఆన్ చేస్తలేరు?
జులై 27, 2026
తాజావార్తలు
- ●Bhatti Vikramarka | ఉచిత పథకాలు కాదు.. ప్రజల భవిష్యత్‌పై పెట్టుబడులు అవి
- ●Kangana Ranaut | ఎగ్జామ్స్ బిల్లుపై రగడ: విపక్షాలపై కంగనా రనౌత్ ఫైర్.. రాహుల్ గాంధీకి స్ట్రాంగ్ కౌంటర్!
- ●Odesa Port Attack | ఉక్రెయిన్ రాయబారికి భారత్ సమన్లు
- ●MP Chamala Kirankumar Reddy | 21 ఏళ్లకే చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలి.. ఎంపీ చామల డిమాండ్
- ●Supreme Court | మతం మారితే ఎస్సీ హోదా వర్తించదు.. సుప్రీంకోర్టు స్పష్టీకరణ
- ●Sukanya Samriddhi Yojana | కేవలం వడ్డీ ద్వారానే రూ.50 లక్షలు పొందవచ్చు.. పోస్టాఫీస్‌లో అద్భుతమైన పథకం..

Bhatti Vikramarka | ఉచిత పథకాలు కాదు.. ప్రజల భవిష్యత్‌పై పెట్టుబడులు అవి

Kangana Ranaut | ఎగ్జామ్స్ బిల్లుపై రగడ: విపక్షాలపై కంగనా రనౌత్ ఫైర్.. రాహుల్ గాంధీకి స్ట్రాంగ్ కౌంటర్!

Odesa Port Attack | ఉక్రెయిన్ రాయబారికి భారత్ సమన్లు

MP Chamala Kirankumar Reddy | 21 ఏళ్లకే చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలి.. ఎంపీ చామల డిమాండ్



