త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Anti Paper Leak Bill | లోక్‌స‌భ ముందుకు యాంటీ పేప‌ర్ లీక్ బిల్లు.. విప‌క్ష ఎంపీల ఆందోళ‌న‌

Anti Paper Leak Bill | పేప‌ర్ లీకుల‌కు పాల్ప‌డే వారిని క‌ఠినంగా శిక్షించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు ముమ్మ‌రం చేసింది. ఇందులో భాగంగానే యాంటీ పేప‌ర్ లీక్ బిల్లును (Anti Paper Leak Bill) పార్ల‌మెంట్ ముందుకు తీసుకెళ్లింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ (Jitendra Singh) ఈ బిల్లును లోక్‌స‌భ‌లో (Lok Sabha) ప్ర‌వేశ‌పెట్టారు.

D

National | Published On Jul 27, 2026, 1.25 pm IST

Anti Paper Leak Bill | లోక్‌స‌భ ముందుకు యాంటీ పేప‌ర్ లీక్ బిల్లు.. విప‌క్ష ఎంపీల ఆందోళ‌న‌
Advertisement

Anti Paper Leak Bill | పేప‌ర్ లీకుల‌కు పాల్ప‌డే వారిని క‌ఠినంగా శిక్షించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు ముమ్మ‌రం చేసింది. ఇందులో భాగంగానే యాంటీ పేప‌ర్ లీక్ బిల్లును (Anti Paper Leak Bill) పార్ల‌మెంట్ ముందుకు తీసుకెళ్లింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ (Jitendra Singh) ఈ బిల్లును లోక్‌స‌భ‌లో (Lok Sabha) ప్ర‌వేశ‌పెట్టారు. పబ్లిక్ పరీక్షల్లో చోటుచేసుకునే అక్రమాలను నిరోధించేందుకు ఈ బిల్లును రూపొందించినట్లు మంత్రి స్పీకర్ కు వివరించారు. విప‌క్ష ఎంపీల ఆందోళ‌న‌ల మ‌ధ్యే ఈ బిల్లును లోక్‌స‌భ ముందుకు తీసుకెళ్లారు. అయితే, జులై 20న విద్యార్థులపై జరిగిన పోలీసుల బలప్రయోగాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో దిగువ స‌భ మ‌ధ్యాహ్నానికి వాయిదా ప‌డింది. అటు రాజ్య‌స‌భ‌లోనూ ఇదే ప‌రిస్థితి కొన‌సాగుతోంది.

ఈ సంద‌ర్భంగా ప్ర‌తిప‌క్షాల ఆందోళ‌న‌ల‌పై బీజేపీ ఎంపీ కంగ‌నా ర‌నౌత్ తీవ్రంగా స్పందించారు. "త‌మ‌కు అధికారం ద‌క్కే వ‌ర‌కూ.. స‌మ‌స్య‌లు ఎంత కీల‌క‌మైన‌వి అయిన‌ప్ప‌టికీ పార్ల‌మెంట్‌ను స‌జావుగా సాగ‌నివ్వ‌కూడ‌ద‌ని ప్ర‌తిప‌క్షాలు నిర్ణ‌యించుకున్న‌ట్లు అనిపిస్తోంది. విద్యా సంస్క‌ర‌ణ‌ల‌కు సంబంధించిన బిల్లును ప్ర‌వేశ‌పెట్టిన‌ప్పుడు ప్ర‌తిప‌క్ష ఎంపీలు నిర‌స‌న‌కు దిగారు. ఆ బిల్లు రాకూడ‌ద‌ని వారు అనుకుంటున్నారు. ఈ ప‌రిస్థితిని దేశం మొత్తం గ‌మ‌నించాలి. ప్ర‌జ‌లు త‌మ‌కు అధికారం ఇవ్వ‌లేదు కాబ‌ట్టే ప్ర‌తిప‌క్ష ఎంపీలు ఇలా చేస్తున్నారు" అని కంగ‌న ధ్వ‌జ‌మెత్తారు.

మోదీ ప్రభుత్వం జూన్ 2024లో తీసుకొచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అన్యాయమైన మార్గాల నిరోధక) చట్టం, 2024లో కీల‌క మార్పులు చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ చ‌ట్టం కింద క‌ఠిన ఆంక్ష‌లు అమ‌లు చేస్తున్నారు. నీట్‌, జేఈఈ వంటి పోటీ ప‌రీక్ష‌లు స‌హా ప్రభుత్వ పరీక్షల్లో పేప‌ర్ లీక్‌లు, అక్ర‌మాల‌కు పాల్ప‌డి దోషులుగా తేలిన వారికి క‌ఠిన శిక్ష‌లు అమ‌లు చేస్తున్నారు. 3 నుంచి 5 సంవత్సరాల పాటూ జైలు శిక్ష, రూ. 10 లక్షల వరకు జరిమానా విధిస్తున్నారు. అయితే, ఇప్పుడు ఈ శిక్ష‌ల‌ను మ‌రింత క‌ఠిన‌త‌రం చేయ‌నున్నారు. 5 నుంచి 10 ఏళ్ల‌పాటూ జైలు శిక్ష, కనిష్టంగా రూ. 1 కోటి జరిమానా విధించేలా చ‌ట్టాన్ని స‌వ‌రించిన‌ట్లు తెలిసింది. ఈ చ‌ట్ట స‌వ‌ర‌ణ‌కు గ‌త‌వారం ప్ర‌ధాని మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేబినెట్ మీటింగ్‌లో నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే.

Also Read..

ఇస్రోలో అసిస్టెంట్‌, యూడీసీ పోస్టులు.. హైద‌రాబాద్‌లో 15 ఉద్యోగాలు

ప్ర‌ధాన్ ఔట్‌.. గ‌డ్క‌రీ లోడింగ్‌.. సీజేపీ త‌ర‌హాలో మ‌రో ఉద్య‌మం త‌ప్ప‌దా..? SMలో E20 జనతా పార్టీ సంచ‌ల‌నం

ఆందోళన చేస్తున్నంత‌మాత్రాన లాఠీఛార్జ్ చేయకూడ‌దు : సుప్రీంకోర్టు

Advertisement
Advertisement