త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dhanush | పాలిటిక్స్‌లోకి త‌మిళ హీరో ధ‌నుష్? – సీఎం విజ‌య్‌కి పోటీగా ఎన్నిక‌ల బ‌రిలో…

ద‌ళ‌ప‌తి విజ‌య్ బాట‌లోనే కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్ రాజ‌కీయాల్లోకి అడుగుపెట్ట‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆదివారం చెన్నైలో ఫ్యాన్స్ అసోసియేష‌న్ మీటింగ్‌లో ధ‌నుష్ చేసిన కామెంట్లు వైర‌ల్ అవుతోన్నాయి. ద‌ళ‌ప‌తి విజ‌య్ రాజ‌కీయ ప్ర‌యాణానికి అడుగులు ప‌డిన రోజే ధ‌నుష్ ఈ మీటింగ్‌ను ఏర్పాటుచేయ‌డం త‌మిళ‌నాడ చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

N

Entertainment | Published On Jul 27, 2026, 3.42 pm IST

Dhanush | పాలిటిక్స్‌లోకి త‌మిళ హీరో ధ‌నుష్? – సీఎం విజ‌య్‌కి పోటీగా ఎన్నిక‌ల బ‌రిలో…
Advertisement

Dhanush |  త‌మిళ‌నాడు సీఎం ద‌ళ‌ప‌తి విజ‌య్ బాట‌లోనే మ‌రో కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్ అడుగులు వేయ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్లు చెబుతున్నారు. ద‌ళ‌ప‌తి విజ‌య్ రాజ‌కీయ అరంగేట్రానికి అడుగులు ప‌డిన రోజే ధ‌నుష్ మీటింగ్‌ను ఏర్పాటుచేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

మెడిక‌ల్ కాలేజీలో...

చెన్నై...మంజ‌క్క‌ర‌ణైలోని వెల్స్ మెడిక‌ల్ కాలేజీలో ధ‌నుష్ ఫ్యాన్స్ క్ల‌బ్ ర‌క్త‌దాన శిబిరాన్ని ఏర్పాటుచేసింది. ఈ కార్య‌క్ర‌మానికి ధ‌నుష్ హాజ‌ర‌య్యాడు. ఈ వేడుక‌లో ఇన్‌డైరెక్ట్‌గా తాను పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు ధ‌నుష్ హింట్ ఇచ్చారు. ఆడియో ఫంక్ష‌న్లు, ఫ్యాన్స్ మీట్‌ల‌కు ప‌రిమితం కాకుండా అభిమానులు ప్ర‌జా సంక్షేమ కార్య‌క్ర‌మాల‌పై దృష్టిసారించాల‌ని ధ‌నుష్ పిలుపునిచ్చారు. మీ చుట్టుప‌క్క‌ల ఉన్న ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌ను తెలుసుకుంటూ వారికి సాయం చేయండి. మీ స్ఫూర్తితో నేను కూడా సేవా కార్య‌క్ర‌మాల‌ను కొన‌సాగిస్తూనే ఉంటాను అని ఈ వేడుక‌లో ధ‌నుష్ అన్నారు. ఈ స‌మావేశంలో ఆల్ ఇండియ‌న్ ధ‌నుష్ ఫ్యాన్స్ అసోసియేష‌న్ జెండాను ధ‌నుష్ ఆవిష్క‌రించారు. ఈ ఈవెంట్‌లో ధ‌నుష్ చేసిన కామెంట్లు వైర‌ల్ అవుతోన్నాయి. ధ‌నుష్ రాజ‌కీయ అరంగేట్రానికి నాందిలా ఈ మీటింగ్ ఉంద‌ని అంటున్నారు.

సేమ్ డేట్‌...

ద‌ళ‌ప‌తి విజ‌య్ పొలిటిక‌ల్ జ‌ర్నీ ప్రారంభ‌మైన రోజే ధ‌నుష్ కూడా స‌మావేశాన్ని ఏర్పాటుచేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. 2009 జూలై 26న విజ‌య్ మ‌క్క‌ల్ ఇయ‌క్కం పేరుతో అభిమాన సంఘాన్ని ఏర్పాటుచేశారు ద‌ళ‌ప‌తి విజ‌య్‌. జెండాను ఆవిష్క‌రించారు. ద‌ళ‌ప‌తి విజ‌య్ రాజ‌కీయ ప్ర‌యాణానికి ఆ రోజే తొలి అడుగులు ప‌డ్డాయి. స‌రిగ్గా జూలై 26నే ధ‌నుష్ కూడా అభిమాన సంఘం జెండాను ఆవిష్క‌రించ‌డం కోలీవుడ్ నాట చ‌ర్చ‌నీయాంశంగా మారింది. విజ‌య్ బాట‌లోనే ధ‌నుష్ అడుగులు వేయ‌నున్న‌ట్లు చెబుతున్నారు.

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పోటీ....

విజ‌య్ టీవీకే పార్టీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో ప్ర‌స్తానాన్ని ప్రారంభిస్తే...ధ‌నుష్ మాత్రం స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌తో త‌న పొలిటిక‌ల్ జ‌ర్నీని మొద‌లుపెట్ట‌నున్న‌ట్లు త‌మిళ‌నాడు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. రానున్న త‌మిళ‌నాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ధనుశ్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు పోటీ చేసే అవ‌కాశం ఉంద‌ని పొలిటిక‌ల్ అన‌లిస్ట్ వీపీ అనంతన్ పేర్కొన్నారు. ధ‌నుష్ పొలిటిక‌ల్ ఎంట్రీ వెనుక డీఎంకే నాయ‌కుడు, త‌మిళ‌నాడు ప్ర‌తిప‌క్ష నేత ఉదయనిధి స్టాలిన్ ఉన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. తెరవెనుక నుంచి ధ‌నుష్‌కు అత‌డే పొలిటిక‌ల్ స‌పోర్ట్ ఇస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

రాధ‌న్ పండిట్‌ను క‌ల‌వ‌నున్న ధ‌నుష్‌....

ద‌ళ‌ప‌తి విజ‌య్ సీఎం అవుతాడ‌ని ప్ర‌ముఖ జోతిష్యుడు రాధ‌న్ పండిట్‌ అప్ప‌ట్లో జాత‌కం చెప్పారు. త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీవీకే విజ‌యం సాధిస్తుంద‌ని అన్నారు. ఆయ‌న చెప్పిన‌ట్లే జ‌రిగింది. ఇప్పుడు ఆ జ్యోతిష్యుడిని త్వ‌ర‌లోనే ధ‌నుష్ క‌లువ‌నున్న‌ట్లు కోలీవుడ్‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. త‌న రాజ‌కీయ ప్ర‌యాణం, అడ్డంకుల‌తో పాటు భ‌విష్య‌త్తు ఎలా ఉంటుందో ఆయ‌న్ని క‌లిసి తెలుసుకోబోతున్న‌ట్లు చెబుతున్నారు.

 

Advertisement
Advertisement