KTR | రేవంత్ అక్రమ సంపాదన కాంగ్రెస్‌కు ఒక మూట.. బీజేపీకి రెండు మూటలు
KTR | తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సంపాదిస్తున్న అక్రమ సంపాదనను కాంగ్రెస్‌కు ఒక మూట, బీజేపీకి రెండు మూటలు పంపిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రాజ్‌భవన్ ముందు ధర్నా చేయాల్సింది పోయి కొడంగల్‌లో ధర్నా చేయడం రాజకీయ నాటకం మాత్రమే అని నిప్పులు చెరిగారు.
KTR | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సంపాదిస్తున్న అక్రమ సంపాదనను కాంగ్రెస్‌కు ఒక మూట, బీజేపీకి రెండు మూటలు పంపిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రాజ్‌భవన్ ముందు ధర్నా చేయాల్సింది పోయి కొడంగల్‌లో ధర్నా చేయడం రాజకీయ నాటకం మాత్రమే అని నిప్పులు చెరిగారు. వరంగల్‌లో మీడియాతో కేటీఆర్ చిట్‌చాట్ నిర్వహించారు.
గ్లోబరీనా సంస్థ అంశంలో ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలపై ఇప్పటికే పరువు నష్టం (డిఫమేషన్) లీగల్ నోటీసు పంపాను. గ్లోబరీనా నిజంగానే నా బినామీ సంస్థ అయితే, అదే సంస్థతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఒప్పందాలు చేసుకుంది? కాంగ్రెస్ ప్రభుత్వమే ఆ సంస్థతో ఒప్పందాలు చేసుకుని, ఇప్పుడు అది నా బినామీ సంస్థ అని చెప్పడం ఎంతవరకు సమంజసం? గ్లోబరీనా సంస్థపై రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. రుజువు చేయాలి.. లేదంటే క్షమాపణ చెప్పాలి.. ఇప్పటికే పరువు నష్టం నోటీసు పంపించాం. విచారణకు, లై డిటెక్టర్ పరీక్షకు కూడా సిద్ధం.. సీఎం కూడా రావాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
పగలు కాంగ్రెస్‌తో.. రాత్రి బీజేపీతో
రేవంత్ రెడ్డి పగలు కాంగ్రెస్‌తో ఉంటాడు, రాత్రి బీజేపీతో ఉంటాడు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌కు ఒక మూట ఇస్తే, బీజేపీకి రెండు మూటలు పంపుతున్నాడు. కాంగ్రెస్‌కు ఒక మూట, బీజేపీ రెండు మూటలు ఇదే రేవంత్ రెడ్డి పాలన. నేను సీఐడీ విచారణకు సిద్ధం.. రేవంత్ రెడ్డి కుటుంబ అవినీతి అంశంలో సిట్, సీఐడీ విచారణకు సిద్ధమా? అని సవాల్ విసిరారు.
మోదీ పేరును ప్రస్తావించడానికి కూడా భయపడుతున్నారు..
కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా ప్రధాని నరేంద్ర మోదీ పేరును ప్రస్తావించరు. ముఖ్యమంత్రి మోదీ పేరును ప్రస్తావించడానికి కూడా భయపడుతున్నారు. ఒకవైపు పాత కేసుల భయం, మరోవైపు అమృత్ పథకం, ఇతర కాంట్రాక్టుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంతో రాజీ రాజకీయాలు చేస్తున్నారు అని కేటీఆర్ మండిపడ్డారు.
తాజావార్తలు
- ●Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల
- ●Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన
- ●Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!
- ●Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!

Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల

Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు

Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!

Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన





