త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kangana Ranaut | ఎగ్జామ్స్ బిల్లుపై రగడ: విపక్షాలపై కంగనా రనౌత్ ఫైర్.. రాహుల్ గాంధీకి స్ట్రాంగ్ కౌంటర్!

పార్లమెంట్‌లో విద్యా సంస్కరణల బిల్లును అడ్డుకుంటున్న విపక్షాలపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాహుల్‌కు ఆమె ఇచ్చిన కౌంటర్ ఏంటంటే?

J

National | Published On Jul 27, 2026, 3.32 pm IST

Kangana Ranaut | ఎగ్జామ్స్ బిల్లుపై రగడ: విపక్షాలపై కంగనా రనౌత్ ఫైర్.. రాహుల్ గాంధీకి స్ట్రాంగ్ కౌంటర్!
Advertisement
  • విద్యా సంస్కరణల బిల్లును అడ్డుకోవడమే ప్రతిపక్షాల ప్రధాన లక్ష్యమని కంగనా విమర్శ
  • అధికారం దక్కలేదన్న ఫ్రస్ట్రేషన్‌లోనే సభను సాగనివ్వడం లేదు
  • ప్రధాని మోదీ ఎగ్జామినేషన్ సిస్టమ్‌ను పారదర్శకంగా, కరప్షన్-ప్రూఫ్‌గా మారుస్తున్నారని ప్రశంస
  • యూపీఏ హయాంలో ఎడ్యుకేషన్ బడ్జెట్ నామమాత్రమేనని రాహుల్ గాంధీకి కౌంటర్

Kangana Ranaut | త్రినేత్ర.న్యూస్ : పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అక్రమాల నివారణ) సవరణ బిల్లు, 2026 పై పార్లమెంట్‌లో తీవ్ర దుమారం రేగుతోంది. ఈ బిల్లును వ్యతిరేకిస్తున్న విపక్షాలపై బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో ఎలాంటి మంచి పని జరగకూడదన్నదే కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాల ఉద్దేశమని ఆమె ఆరోపించారు.

అధికారం దక్కలేదనే చీప్ పాలిటిక్స్

"వారికి కుర్చీ దక్కేంత వరకు పార్లమెంట్‌ను సజావుగా సాగనివ్వకూడదని ప్రతిపక్షాలు ఫిక్స్ అయ్యాయి. ఎంత ముఖ్యమైన ఇష్యూ అయినా సరే వారు అడ్డుకోవాలనే చూస్తున్నారు. ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ (విద్యా సంస్కరణలు) కోసం తెచ్చిన ఈ బిల్లును అడ్డుకోవడానికి విపక్ష ఎంపీలు చేతులెత్తి మరీ వ్యతిరేకించారు. ఈ విషయాన్ని దేశ ప్రజలందరూ గమనించాలి" అని కంగనా అన్నారు. ప్రజలు వారికి మాండేట్ ఇవ్వలేదనే అక్కసుతోనే.. ఈ తరహా 'చీప్ పాలిటిక్స్' చేస్తున్నారని ఆమె విమర్శించారు. దేశ అభివృద్ధి ఆగిపోవాలన్నదే వారి కుట్ర అని ఆరోపించారు.

ప్రధాని మోదీ నిబద్ధత అది..

ఆందోళనకారులపై ఏకే-47, పెల్లెట్ గన్స్ వాడటంపై రాహుల్ గాంధీ క్షమాపణలు డిమాండ్ చేయడంపై రిపోర్టర్లు ప్రశ్నించగా కంగనా దీటుగా బదులిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ నిబద్ధతను ఆమె కొనియాడారు. "చిన్న సమస్యల నుంచి పెద్ద ఇష్యూస్ వరకు ప్రతి దాన్ని పరిష్కరించడంలో ప్రధాని దేశ ప్రజలకు ఎంతగానో అంకితమయ్యారు. ఆయన ప్రపంచానికే ఆదర్శం. పరీక్షల నిర్వహణ కోసం ప్రధాని ఇప్పటికే ఒక హై-పవర్డ్ కమిటీని వేశారు. ఎగ్జామినేషన్ సిస్టమ్‌ను కరప్షన్-ప్రూఫ్‌గా మార్చడమే ఆ స్క్వాడ్ లక్ష్యం. ఈ సవరణ బిల్లు వెంటనే రావడం వెనుక ప్రధాని కమిట్‌మెంట్ దాగి ఉంది" అని కంగనా స్పష్టం చేశారు.

యూపీఏ బడ్జెట్ ఎంత రాహుల్ జీ?

విద్యా వ్యవస్థపై మాట్లాడుతున్న రాహుల్ గాంధీకి కంగనా గట్టి కౌంటర్ ఇచ్చారు. "యూపీఏ ప్రభుత్వ హయాంలో ఎడ్యుకేషన్ బడ్జెట్ ఏమాత్రం ఉండేదో రాహుల్ గాంధీకి గుర్తులేదా? అప్పట్లో అది కేవలం పేరుకే బడ్జెట్ అన్నట్లు ఉండేది. ఇప్పుడు పరిస్థితులు మారాయి. అధికారం లేకపోయేసరికి ఫ్రస్ట్రేషన్‌లో ఏవేవో విమర్శలు చేస్తున్నారు" అంటూ ఆమె ఎద్దేవా చేశారు.

Advertisement
Advertisement