త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sai Pallavi | సాయిప‌ల్ల‌వికి కండీష‌న్లు పెట్టిన మ‌ణిర‌త్నం – న‌ల‌భై రోజులే డెడ్‌లైన్‌

ఫ్లాపుల్లో ఉన్న విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నంతో ఓ సినిమా చేసేందుకు సాయిప‌ల్ల‌వి అంగీక‌రించ‌డం త‌మిళ‌నాట ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ సినిమా షూటింగ్ మొద‌లుకావ‌డానికి ముందే సాయిప‌ల్ల‌వికి మ‌ణిర‌త్నం కొన్ని కండీష‌న్లు పెట్టాడ‌ట‌. అవేమిటంటే?

N

Entertainment | Published On Jul 23, 2026, 4.26 pm IST

Sai Pallavi | సాయిప‌ల్ల‌వికి కండీష‌న్లు పెట్టిన మ‌ణిర‌త్నం – న‌ల‌భై రోజులే డెడ్‌లైన్‌
Advertisement

Sai Pallavi | సాయిప‌ల్ల‌వి డేట్స్ కోసం ద‌క్షిణాదితో పాటు బాలీవుడ్ స్టార్స్ ఎదురుచూస్తున్నారు. సాయిప‌ల్ల‌వి దృష్టిలో పెట్టుకొని ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌లు చాలానే క‌థ‌ల‌ను రెడీ చేస్తున్నారు. కానీ ఈ నాచుర‌ల్ బ్యూటీ మాత్రం సినిమాల ఎంపికలో చాలా సెలెక్టివ్‌గా అడుగులు వేస్తోంది. రీసెంట్ టైమ్‌లో సాయిప‌ల్ల‌వి ఒప్పుకున్న సినిమాల కంటే రిజెక్ట్ చేసిన‌వే ఎక్కువ‌గా ఉన్నాయ‌ని టాక్ న‌డుస్తోంది.

గ్రీన్‌సిగ్న‌ల్‌...

ఇటీవ‌లే విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నంతో ఓ సినిమా చేసేందుకు సాయిప‌ల్ల‌వి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. ఫ్లాపుల్లో కార‌ణంగా మ‌ణిర‌త్నం ప‌నైపోయింద‌ని, ఔట్‌డేటెడ్ అయ్యారంటూ విమ‌ర్శ‌లు వ‌స్తోన్నాయి. ఈ ట్రోల్స్ న‌డుమ మ‌ణిర‌త్నంతో సినిమా చేసేందుకు సాయిప‌ల్ల‌వి అంగీక‌రించ‌డం త‌మిళ‌నాట ఆస‌క్తిక‌రంగా మారింది.

విజ‌య్ సేతుప‌తి...

రొమాంటిక్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో విజ‌య్ సేతుప‌తి హీరోగా న‌టిస్తోన్నాడు. కాగా ఈ సినిమా షూటింగ్ మొద‌లుకావ‌డానికి ముందే సాయిప‌ల్ల‌వికి మ‌ణిర‌త్నం కొన్ని కండీష‌న్లు పెట్టాడ‌ట‌. మ‌ణిర‌త్నం సినిమా అంటే ఏళ్ల‌కు ఏళ్లు షూటింగ్ చేస్తాడ‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని కొత్త సినిమాను కేవ‌లం న‌ల‌భై రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేయాల‌ని మ‌ణిర‌త్నం ప్లాన్ చేసుకుంటున్నాడ‌ట‌. వాటికి త‌గ్గ‌ట్లుగా డేట్స్ కేటాయించాల‌ని సాయిప‌ల్ల‌వితో పాటు విజ‌య్ సేతుప‌తికి ష‌ర‌తులు విధించాడ‌ట మ‌ణిర‌త్నం. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్స్‌లో న‌ల‌భై రోజులు అంటే క‌ష్ట‌మైనా మ‌ణిర‌త్నం మీద ఉన్న గౌర‌వంతో సాయిప‌ల్ల‌వి ఓకే అన్న‌ద‌ని అంటున్నారు.

కోల్‌క‌తాలో...

గురువారం ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్‌ను సెలైంట్‌గా మొద‌లుపెట్టారు. కోల్‌క‌తాలో ఫ‌స్ట్ షెడ్యూల్‌ను చిత్రీక‌రించ‌బోతున్నారు. ఈ షెడ్యూల్‌లో సాయిప‌ల్ల‌వి, విజ‌య్ సేతుప‌తితో పాటు ప్ర‌ధాన తారాగ‌ణం పాల్గొన‌నున్నారు. పాండిచ్చేరితో పాటు ఫారిన్‌లో మ‌రో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఈ మూడు షెడ్యూల్స్‌తోనే ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ కానున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. ఈ సినిమాకు ఆస్కార్ విన్న‌ర్ ఏఆర్ రెహ‌మాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ప్ర‌స్తుతం హిందీలో రామాయ‌ణ మూవీ చేస్తోంది సాయిప‌ల్ల‌వి. ర‌ణ‌భీర్ క‌పూర్ హీరోగా న‌టిస్తోన్న ఈ మూవీ ట్రైల‌ర్‌ను శుక్ర‌వారం విడుద‌ల చేయ‌బోతున్నారు. ఈ మైథ‌లాజిక‌ల్ మూవీ ఈ ఏడాది దీపావ‌ళికి థియేట‌ర్ల‌లోకి రాబోతుంది.రామాయ‌ణంతో పాటు త‌మిళంలో ఓం సినిమాను అంగీక‌రించింది.

 

Advertisement
Advertisement