త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ashwini Vaishnaw | బుల్లెట్ ట్రైన్ హ‌బ్‌గా హైదరాబాద్‌ : అశ్వినీ వైష్ణ‌వ్

Ashwini Vaishnaw | దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టనున్న ఏడు బుల్లెట్ రైళ్లలో మూడు తెలంగాణకే దక్కాయ‌ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్ (Ashwini Vaishnaw) తెలిపారు.

D

National | Published On Jul 11, 2026, 4.36 pm IST

Ashwini Vaishnaw | బుల్లెట్ ట్రైన్ హ‌బ్‌గా హైదరాబాద్‌ : అశ్వినీ వైష్ణ‌వ్
Advertisement

Ashwini Vaishnaw | త్రినేత్ర‌.న్యూస్ : దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టనున్న ఏడు బుల్లెట్ రైళ్లలో మూడు తెలంగాణకే దక్కాయ‌ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్ (Ashwini Vaishnaw) తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చొర‌వ‌తోనే ఇది సాధ్య‌మైంద‌ని వెల్లడించారు. రాబోయే రోజుల్లో హైద‌రాబాద్‌ దేశంలోనే ఒక పెద్ద బుల్లెట్ ట్రైన్‌ హబ్‌ (Hyderabad Bullet Train Hub)గా అవతరించబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న కేంద్ర మంత్రి ఈ సంద‌ర్భంగా కీల‌క వివ‌రాలు పంచుకున్నారు. "గత బడ్జెట్‌లో ప్రకటించిన విధంగా దేశ వ్యాప్తంగా ఏడు బుల్లెట్ రైళ్లు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. వీటిలో మూడు హైదరాబాద్ కేంద్రంగా న‌డ‌వ‌నున్నాయి. ప్రస్తుతం దేశంలో రైల్వే విప్లవం న‌డుస్తోంది. కొత్తగా సాంకేతికతను వినియోగిస్తూ.. పూర్తి స్థాయిలో అధునాతన సదుపాయాలతో రైళ్లను అందుబాటు లోకి తీసుకొస్తున్నాం. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ దేశంలో పెద్ద మార్పునకు శ్రీకారం చుట్టబోతోంది. కొంత‌మంది ఈ క్రెడిట్‌ను తీసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. భారతీయ రైల్వేలో సమూల మార్పులు, సంస్క‌ర‌ణ‌ల క్రెడిట్ ప్ర‌ధాని మోదీకే ద‌క్కుతుంది" అని అశ్వినీ వైష్ణ‌వ్ తెలిపారు.

తెలంగాణ‌కు ద‌క్కిన మూడు బుల్లెట్ ట్రైన్స్ హైద‌రాబాద్‌, ముంబై, చెన్నై, బెంగళూరు మ‌ధ్య న‌డ‌వ‌నున్న‌ట్లు తెలిపారు. ఇవి అందుబాటులోకి వ‌స్తే.. ఆయా మార్గాల్లో ప్ర‌యాణ స‌మ‌యం భారీగా త‌గ్గుతుంద‌ని చెప్పారు. హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ‌కు కేవ‌లం గంటా ప‌ది నిమిషాల్లోనే చేరుకోవ‌చ్చ‌ని మంత్రి చెప్పారు. ముంబైకి రెండు గంటల 20 నిమిషాలు.. హైదరాబాద్ నుంచి చెన్నైకి రెండు గంటల్లో చేరుకోవ‌చ్చ‌ని వివ‌రించారు. ఈ రైళ్ల రాక‌తో హైదరాబాద్ నగరవాసులకు ప్రయాణ కష్టాలు పూర్తిగా తొల‌గిపోతాయ‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు.

Also Read..

వియత్నాంలో ఘోర విషాదం: స్పీడ్‌బోట్ బోల్తా.. ఏపీ, తెలంగాణకు చెందిన పర్యాటకుల మృతి

భార‌త్ ఒలింపిక్‌ బిడ్‌కు ఆస్ట్రేలియా మ‌ద్ద‌తు

ద‌మ్ముంటే అసెంబ్లీ ర‌ద్దు చేసి ఎన్నిక‌ల‌కు వెళ్లు.. నువ్ మ‌ళ్లీ గెల‌వ‌డం క‌లే

Advertisement
Advertisement