త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Meta | మెటా యూటర్న్.. ప్రైవసీ విమర్శలతో ఏఐ ఇమేజ్ ఫీచర్‌కు గుడ్‌బై..

Meta | టెక్ దిగ్గ‌జ సంస్థ మెటా ఇటీవ‌లే త‌న ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్ ప్లాట్‌ఫామ్‌ల‌పై అందించిన మ్యూస్ ఇమేజ్ ఏఐ మోడ‌ల్‌పై తీవ్ర వ్య‌తిరేక‌త ఎదుర‌వుతున్న నేప‌థ్యంలో ఆ సంస్థ స్పందించింది. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఇమేజ్ జ‌న‌రేష‌న్ ఫీచ‌ర్‌ను ప్రారంభించిన కొద్ది రోజులకే ఆ సేవ‌ల‌ను నిలిపివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

S

Technology | Published On Jul 11, 2026, 5.19 pm IST

Meta | మెటా యూటర్న్.. ప్రైవసీ విమర్శలతో ఏఐ ఇమేజ్ ఫీచర్‌కు గుడ్‌బై..
Advertisement

Meta | టెక్ దిగ్గ‌జ సంస్థ మెటా ఇటీవ‌లే త‌న ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్ ప్లాట్‌ఫామ్‌ల‌పై అందించిన మ్యూస్ ఇమేజ్ ఏఐ మోడ‌ల్‌పై తీవ్ర వ్య‌తిరేక‌త ఎదుర‌వుతున్న నేప‌థ్యంలో ఆ సంస్థ స్పందించింది. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఇమేజ్ జ‌న‌రేష‌న్ ఫీచ‌ర్‌ను ప్రారంభించిన కొద్ది రోజులకే ఆ సేవ‌ల‌ను నిలిపివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. యూజ‌ర్ల ప్రైవ‌సీకి భంగం క‌లిగే అవ‌కాశం ఉండ‌డం, ఈ విష‌య‌మై తీవ్ర విమ‌ర్శ‌లు రావ‌డం, ఇన్‌స్టాగ్రామ్‌లో ప‌బ్లిక్‌గా ఉన్న ఫొటోల‌ను ముంద‌స్తు అనుమ‌తి లేకుండానే ఏఐ కోసం ఉప‌యోగించ‌డం వివాదానికి కార‌ణ‌మైంది. దీంతో ఈ ఫీచ‌ర్‌ను నిలిపివేస్తున్న‌ట్లు మెటా తెలిపింది. ఈ మేర‌కు మెటా ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఈ వారం ప్రారంభంలో అందుబాటులోకి వ‌చ్చిన ఈ ఫీచ‌ర్ ఇక‌పై అందుబాటులో ఉండ‌ద‌ని తెలియ‌జేసింది.

మెటాపై తీవ్ర విమ‌ర్శ‌లు..

ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే సృజ‌నాత్మ‌క సాధ‌నాన్ని అందించ‌డం, వారి ప‌బ్లిక్ కంటెంట్‌ను ఏ విధంగా ఉప‌యోగించాలి అనే అంశాల‌పై నియంత్ర‌ణ‌ను యూజ‌ర్ల‌కు ఇవ్వ‌డ‌మే త‌మ ఉద్దేశ‌మ‌ని మెటా తెలిపింది. కాగా మెటా త‌న మ్యూస్ ఇమేజ్ ఏఐ మోడ‌ల్‌ను ఈ వారం ప్రారంభంలో ప్ర‌వేశ‌పెట్ట‌గా, దీంతోపాటు ఇందులో కొత్త ఏఐ ఫీచ‌ర్‌ను అందించింది. దీని స‌హాయంతో ఇన్‌స్టాగ్రామ్ యూజ‌ర్లు ఏ ప‌బ్లిక్ ఖాతా యూజ‌ర్‌కు చెందిన ఫొటోల‌నైనా స‌రే ఎడిట్ చేసి కొత్త ఫోటోగా క్రియేట్ చేసే అవకాశం ల‌భిస్తుంది. అయితే ఇందుకు యూజ‌ర్ అనుమ‌తి అవ‌స‌రం ఉండ‌దు. తమ ఫొటోల‌ను ఇత‌రులు వాడే విష‌యం కూడా వారికి తెలియ‌దు. మ‌రోవైపు ఫొటోల‌ను క్రియేట్ చేసే వారు ఏ పబ్లిక్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను అయినా స‌రే ట్యాగ్ చేస్తే స‌రిపోతుంది. దీంతో ఫొటోల‌ను ఏఐ స‌హాయంతో ఎడిట్ చేసేందుకు వీలుంటుంది. అయితే యూజ‌ర్ల అనుమ‌తి లేకుండా వారి ఫొటోల‌ను ఇత‌రులు ఏఐ కోసం వాడ‌డం స‌రికాద‌ని అనేక మంది అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ విష‌యంపై మెటాను తీవ్రంగా విమ‌ర్శించారు. అందుక‌నే ఆ సంస్థ దిగి వ‌చ్చి ఆ ఫీచర్‌ను నిలిపివేస్తున్న‌ట్లు తెలిపింది.

త‌దుప‌రి చ‌ర్య‌ల‌పై ఆలోచ‌న‌..

మెటా సూప‌ర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ హెడ్ అలెగ్జాండ‌ర్ వాంగ్ ఈ విష‌యంపై స్పందిస్తూ ఈ ఫీచ‌ర్ ప‌ట్ల పెద్ద ఎత్తున అభిప్రాయాలు వ‌స్తున్నాయ‌ని అన్నారు. త‌మ‌కు భారీ స్థాయిలో ఫీడ్ బ్యాక్ వ‌స్తుంద‌ని, ఈ ఉత్ప‌త్తికి సంబంధించి త‌దుప‌రి చ‌ర్య‌ల‌పై జాగ్ర‌త్త‌గా ఆలోచిస్తున్నామ‌ని తెలిపారు. కాగా మెటాకు చెందిన సోష‌ల్ మీడియా ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో ఇటీవ‌ల యూజ‌ర్ నేమ్స్ ఫీచ‌ర్‌ను ప్ర‌వేశ‌పెడుతున్న‌ట్లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే దీనిపై కేంద్రం అభ్యంత‌రాలు వ్య‌క్తం చేయ‌గా, మెటా ఈ ఫీచ‌ర్‌ను కూడా తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే దీనిపై త్వ‌ర‌లోనే మెటా ఓ నిర్ణ‌యానికి రానున్న‌ట్లు తెలిసింది. యూజ‌ర్ నేమ్ ఫీచ‌ర్‌ను కొంత కాలం పాటు వాయిదా వేయాల‌ని చూస్తున్న‌ట్లు స‌మాచారం.

Advertisement
Advertisement