Indias 2036 Olympic bid | భారత్ ఒలింపిక్ బిడ్‌కు ఆస్ట్రేలియా మద్దతు
Indias 2036 Olympic bid | 2036 ఒలింపిక్ క్రీడలు (2036 Olympic) నిర్వహించేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలకు ఆస్ట్రేలియా పూర్తి మద్దతు ప్రకటించింది. న్యూఢిల్లీ బిడ్‌కు ఆస్ట్రేలియా మద్దతు ఇస్తుందని ఆ దేశ ప్రధాని అల్బనీస్ ప్రకటించారు.
International | Published On Jul 11, 2026, 4.01 pm IST
Indias 2036 Olympic bid | త్రినేత్ర.న్యూస్ : 2036 ఒలింపిక్ క్రీడలు (2036 Olympic) నిర్వహించేందుకు భారత్ తీవ్రంగా ప్రయత్నిస్తోన్న విషయం తెలిసిందే. ఇందుకోసం బిడ్ కూడా దాఖలు చేసింది. ఈ ప్రతిష్టాత్మక క్రీడల నిర్వహణ కోసం ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) ఇప్పటికే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC)కి తన 'లెటర్ ఆఫ్ ఇంటెంట్' సమర్పించింది. ప్రతిష్టాత్మక క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేందుకు రెఢీ అవుతున్న భారత్‌కు ఆస్ట్రేలియా పూర్తి మద్దతు ప్రకటించింది.
ప్రధాని మోదీ ఆస్ట్రేలియాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆదేశ ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఇరు దేశాల మధ్య క్రీడా రంగంలో సహకారాన్ని బలోపేతం చేసేందుకు 'భారత్-ఆస్ట్రేలియా స్పోర్ట్స్ కొలాబిరేషన్ రోడ్‌మ్యాప్'ను (India-Australia Sports Collaboration Roadmap) ఆవిష్కరించారు. భారత్ 2030 కామన్వెల్త్ గేమ్స్‌కు ఆతిథ్యమివ్వడానికి సిద్ధమవుతోందని, అలాగే 2036లో ఒలింపిక్ క్రీడలను నిర్వహించడానికి శ్రమిస్తోందని ఈ సందర్భంగా ప్రధాని మోదీ తెలిపారు. రాబోయే సంవత్సరాల్లో క్రీడా మౌలిక సదుపాయాలను భారీ స్థాయిలో అభివృద్ధి చేయనున్నట్లు ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా 2036 ఒలింపిక్ క్రీడల ఆతిథ్యం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నానికి కెన్‌బెర్రా పూర్తి మద్దతు ప్రకటించింది. న్యూఢిల్లీ బిడ్‌కు ఆస్ట్రేలియా మద్దతు ఇస్తుందని అల్బనీస్ ప్రకటించారు. దీంతో ఒలింపిక్స్ ఆతిథ్య హక్కుల విషయంలో భారత్‌కు భారీ మద్దతు లభించినట్లైంది. ఇప్పటికే రెండుసార్లు (మెల్‌బోర్న్ వేదికగా 1956లో, సిడ్నీలో 2000లో) ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చిన ఆస్ట్రేలియా.. మరోసారి క్రీడల నిర్వహకు సిద్ధమైంది. బ్రిస్బేన్‌లో 2032 ఒలింపిక్స్ జరగనున్నాయి. ఇక మూడుసార్లు కామన్వెల్త్ గేమ్స్‌ను ఆస్ట్రేలియా నిర్వహించింది. ఈ అనుభవాలను భారత్‌తో పంచుకోనుంది. ఒలింపిక్స్ నిర్వహణ విషయంలో సహాయసహకారాలు పంచుకోనుంది.
భారత్-ఆస్ట్రేలియా స్పోర్ట్స్ కొలాబిరేషన్ రోడ్‌మ్యాప్ ద్వారా క్రీడల రంగంలో ఇరు దేశాలు పరస్పరం సహకరించుకోనున్నాయి. క్రీడా శిక్షణ, మౌలిక వసతుల కల్పన, క్రీడా విజ్ఞానం, సాంకేతికత, క్రీడా పరిశ్రమ, పాఠశాల క్రీడలు, స్పోర్ట్స్ సైన్స్, పెట్టుబడుల్లో ఇరు దేశాలూ సహకారం అందించుకుంటాయి.
2036 వేసవి ఒలింపిక్స్‌ను భారతదేశంలో నిర్వహించాలని న్యూఢిల్లీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అహ్మదాబాద్‌ను ఒలింపిక్స్‌కు ప్రధాన కేంద్రంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. అంతకంటే ముందు 2030 కామన్వెల్త్ గేమ్స్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇందులో భాగంగా 2028 నాటికి మొత్తం 65 అంతర్జాతీయ క్రీడా ఈవెంట్‌లను విజయవంతంగా పూర్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అంతర్జాతీయ వేదికలపై భారత్‌కు మంచి పేరు తీసుకురావడం, ఒలింపిక్స్‌ను నిర్వహించేందుకు తమకున్న సామర్థ్యాన్ని ప్రపంచానికి నిరూపించడం ఈ నిర్ణయం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం. భారత్ లక్ష్యాలకు ఆస్ట్రేలియా నుంచి పూర్తి మద్దతు లభించనుంది.
Also Read..
బీజేపీలోకి మల్లారెడ్డి..? ముహూర్తం ఫిక్స్
వెనెజువెలాలో 4,000 దాటిన భూకంపం మృతులు
విద్య, ఉద్యోగం కోసం అమెరికా వెళ్లాలంటే ఇక కష్టమే.. మరింత కఠినంగా నిబంధనలు..?
తాజావార్తలు
- ●KTR | దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లు.. నువ్ మళ్లీ గెలవడం కలే
- ●Malla Reddy | బీజేపీలోకి మల్లారెడ్డి..? ముహూర్తం ఫిక్స్
- ●Keerthy Suresh | క్రికెట్ లీగ్ వేలంలో కీర్తి సురేష్ - కోట్లు కుమ్మరించి ఆటగాళ్లను కొన్న మహానటి - అసలు కథ ఏంటంటే?
- ●Semiconductor Hub Hyderabad | దేశంలోని ఇతర మెట్రో నగరాలను కాదని హైదరాబాద్‌లో సరికొత్త సెమీకండక్టర్ హబ్
- ●OpenAI | చాట్‌జీపీటీ వాయిస్‌లో భారీ అప్డేట్.. ఇక మనిషిలా మాట్లాడే కొత్త మోడళ్లు..
- ●Clash between beef vendors | జోగిపేటలో బీఫ్ దుకాణాదారుల లొల్లి.. కత్తులతో పరస్పర దాడులు

KTR | దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లు.. నువ్ మళ్లీ గెలవడం కలే

Malla Reddy | బీజేపీలోకి మల్లారెడ్డి..? ముహూర్తం ఫిక్స్

Keerthy Suresh | క్రికెట్ లీగ్ వేలంలో కీర్తి సురేష్ - కోట్లు కుమ్మరించి ఆటగాళ్లను కొన్న మహానటి - అసలు కథ ఏంటంటే?

Semiconductor Hub Hyderabad | దేశంలోని ఇతర మెట్రో నగరాలను కాదని హైదరాబాద్‌లో సరికొత్త సెమీకండక్టర్ హబ్



