Revanth Reddy | ఎమిరేట్స్ విమాన సర్వీసులు మరిన్ని పెంచండి
Revanth Reddy | హైదరాబాద్‌లో విమాన సర్వీసులను మరిన్ని పెంచాలని ఎమిరేట్స్ వైమానిక సంస్థ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ సార్థన్‌ను సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. తెలంగాణలో మరో రెండు కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు కాబోతున్నాయని.. అక్కడ కూడా Emirates MRO ఆపరేషన్స్ కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.
- సంస్థ వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ సార్థన్‌ను కోరిన సీఎం రేవంత్
- సానుకూలంగా స్పందించిన సార్థన్
Revanth Reddy | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్‌లో విమాన సర్వీసులను మరిన్ని పెంచాలని ఎమిరేట్స్ వైమానిక సంస్థ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ సార్థన్‌ను సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. తెలంగాణలో మరో రెండు కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు కాబోతున్నాయని.. అక్కడ కూడా Emirates MRO ఆపరేషన్స్ కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. గచ్చిబౌలి స్పోర్ట్స్ యూనివర్సిటీలో క్రీడాకారులకు శిక్షణ అందించేందుకు స్పాన్సర్షిప్‌కు ముందుకు రావాలన్నారు. విమాన సర్వీసులకు కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. జూబ్లీహిల్స్‌లోని నివాసంలో రేవంత్‌రెడ్డిని శనివారం మహమ్మద్ సార్థన్ (Mohammed Sarthan) మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా సీఎం పై విజ్ఞప్తులు చేశారు.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఎమిరేట్స్ A-38 సర్వీసులను ప్రారంభించేందుకు సార్థన్ సుముఖత వ్యక్తం చేశారు. Emirates వైమానిక సంస్థ 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆయన సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో విమానయాన రంగం విస్తరణ, అంతర్జాతీయ కనెక్టివిటీ, పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Naga Durga | నాగదుర్గ తెలుగు మూవీ షూటింగ్ షురూ - ఇడుపు కాయితం రిలీజ్ డేట్ ఇదేనా ?
- ●Meta | మెటా యూటర్న్.. ప్రైవసీ విమర్శలతో ఏఐ ఇమేజ్ ఫీచర్‌కు గుడ్‌బై..
- ●Anesthesia | పెదవి గాయానికి చికిత్స.. మత్తు ఇంజక్షన్ కారణంగా 18 నెలల చిన్నారి మృతి
- ●Spain vs Belgium | 16 ఏళ్ల నిరీక్షణకు తెర.. బెల్జియంను మట్టికరిపించి సెమీస్‌లోకి దూసుకెళ్లిన స్పెయిన్!
- ●EPFO | ఈపీఎఫ్‌వో పాస్‌బుక్ పోర్టల్ మళ్లీ అందుబాటులోకి.. పీఎఫ్ బ్యాలెన్స్ ఇలా చెక్ చేయండి..
- ●Rukmini Vasanth | క్రేజీ కాంబో సెట్ - నితిన్‌కు జోడీగా డ్రాగన్ బ్యూటీ - ప్రొడ్యూసర్‌గా హీరో నాని

Naga Durga | నాగదుర్గ తెలుగు మూవీ షూటింగ్ షురూ - ఇడుపు కాయితం రిలీజ్ డేట్ ఇదేనా ?

Meta | మెటా యూటర్న్.. ప్రైవసీ విమర్శలతో ఏఐ ఇమేజ్ ఫీచర్‌కు గుడ్‌బై..

Anesthesia | పెదవి గాయానికి చికిత్స.. మత్తు ఇంజక్షన్ కారణంగా 18 నెలల చిన్నారి మృతి

Spain vs Belgium | 16 ఏళ్ల నిరీక్షణకు తెర.. బెల్జియంను మట్టికరిపించి సెమీస్‌లోకి దూసుకెళ్లిన స్పెయిన్!






