Amazon India | అమెజాన్ భారీ బెనిఫిట్స్.. డెలివరీ ఉద్యోగులకు రూ.10 లక్షల ఇన్సూరెన్స్..
Amazon India | ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా తమ లాస్ట్ మైల్ ఆపరేషన్స్ నెట్‌వర్క్‌లో పనిచేస్తున్న సుమారు 90 వేల డెలివరీ అసోసియేట్స్‌కు హెల్త్, ఇన్సూరెన్స్ బెనిఫిట్స్‌ను భారీగా విస్తరించినట్లు ప్రకటించింది. ఉద్యోగుల భద్రత, ఆరోగ్యం, ఆర్థిక సంక్షేమం మెరుగుపరచడంతోపాటు లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు ఇటీవల ప్రకటించిన రూ.2,800 కోట్ల పెట్టుబడిలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.
Amazon India | ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా తమ లాస్ట్ మైల్ ఆపరేషన్స్ నెట్‌వర్క్‌లో పనిచేస్తున్న సుమారు 90 వేల డెలివరీ అసోసియేట్స్‌కు హెల్త్, ఇన్సూరెన్స్ బెనిఫిట్స్‌ను భారీగా విస్తరించినట్లు ప్రకటించింది. ఉద్యోగుల భద్రత, ఆరోగ్యం, ఆర్థిక సంక్షేమం మెరుగుపరచడంతోపాటు లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు ఇటీవల ప్రకటించిన రూ.2,800 కోట్ల పెట్టుబడిలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పెట్టుబడిని 2030 నాటికి 35 బిలియన్ డాలర్లకు పైగా పెంచాలని అమెజాన్ లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఈ ప్రణాళికలో బిజినెస్ విస్తరణ, ఏఐ ఆధారిత డిజిటైజేషన్, ఎక్స్‌పోర్ట్ గ్రోత్, కోర్, క్విక్ కామర్స్ రంగాల్లో ఉద్యోగాల సృష్టిపై ప్రత్యేక దృష్టి పెట్టనుంది.
యాక్సిడెంట్ కవరేజ్ రూ.10 లక్షలకు పెంపు..
డెలివరీ అసోసియేట్స్‌కు తక్షణ వైద్య ఖర్చులు మాత్రమే కాకుండా తాత్కాలిక లేదా శాశ్వత వైకల్యం కారణంగా వచ్చే ఆదాయ నష్టాన్ని తగ్గించేలా కొత్త బెనిఫిట్స్ ప్యాకేజ్‌ను రూపొందించింది. కొత్త కవరేజ్‌లో మెడిక్లెయిమ్ పరిమితిని రూ.1.50 లక్షల వరకు పెంచింది. ఓపీడీ ఖర్చులకు రూ.10 వేల వరకు కవరేజ్ అందిస్తుంది. గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్‌ను రూ.10 లక్షల వరకు విస్తరించింది. ఈ బెనిఫిట్స్ డెలివరీ అసోసియేట్‌తోపాటు సంవత్సరానికి ముగ్గురు కుటుంబ సభ్యులకు కూడా వర్తిస్తాయి. మల్టీలింగ్వల్ వర్చువల్ డాక్టర్ కన్సల్టేషన్స్‌ను అన్‌లిమిటెడ్‌గా అందించడంతోపాటు ప్రతి కుటుంబానికి ఏడాదికి రెండు ఉచిత ఇన్‌పర్సన్ ఓపీడీ విజిట్స్ కూడా ఉంటాయి. అదనంగా డయాగ్నస్టిక్స్, ఫార్మసీ, డెంటల్, ఐ కేర్ సేవలపై డిస్కౌంట్లు, ప్రివెంటివ్ హెల్త్, ఫిట్‌నెస్ టూల్స్ కూడా అందుబాటులో ఉంటాయి.
ప్రత్యేక హెల్త్ క్యాంపులు, ఆశ్రయ్ సెంటర్లు..
ఈ ఫైనాన్షియల్ బెనిఫిట్స్‌కు తోడుగా థర్డ్ పార్టీ ఇన్సూరర్‌తో కలిసి దేశవ్యాప్తంగా డెలివరీ స్టేషన్లలో హెల్త్ క్యాంపులను నిర్వహిస్తోంది. మార్చిలో ఆరు మెట్రో, టియర్-2 నగరాల్లో ప్రారంభమైన ఈ క్యాంపులు ప్రొయాక్టివ్ హెల్త్ స్క్రీనింగ్, హీట్ రిస్క్ గుర్తింపుపై దృష్టి పెట్టాయి. ఈ క్యాంపుల్లో ఐ ఎగ్జామినేషన్స్, డెంటల్ చెకప్‌లు, బీఎంఐ అసెస్‌మెంట్స్, జనరల్ ఫిజీషియన్ కన్సల్టేషన్స్ అందిస్తున్నారు. ప్రభుత్వ గుర్తింపు కార్డు ద్వారా అసోసియేట్స్ ఈ సేవలను పొందవచ్చు. డెలివరీ ఉద్యోగుల భౌతిక భద్రత, పని పరిస్థితులు మెరుగుపర్చేందుకు అమెజాన్ పలు చర్యలు చేపట్టింది. ప్రాజెక్ట్ ఆశ్రయ్ పేరుతో అధిక రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక రెస్ట్ పాయింట్లను ఏర్పాటు చేస్తోంది. ఈ కేంద్రాలు కేవలం అమెజాన్ ఉద్యోగులకు మాత్రమే కాకుండా ఏ కంపెనీకి చెందిన డెలివరీ వర్కర్లకైనా అందుబాటులో ఉంటాయి. ఇక్కడ ఎయిర్ కండిషన్డ్ సీటింగ్, తాగునీరు, ఎలక్ట్రోలైట్స్, వాష్‌రూమ్స్, ఛార్జింగ్ స్టేషన్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్స్ వంటి సదుపాయాలు కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 100 ఆశ్రయ్ సెంటర్లను 2026 నాటికి 250కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. మే చివరి నాటికి మరో 50 కొత్త కేంద్రాలను ప్రారంభించనుంది.
ఉచిత లైఫ్ సపోర్ట్ ఆంబులెన్స్ సేవలు..
డెలివరీ అసోసియేట్స్‌కు 24*7 ఎమర్జెన్సీ సపోర్ట్ కూడా అందిస్తోంది. డయల్ 4242 భాగస్వామ్యంతో 730కిపైగా నగరాల్లో ఉచిత బేసిక్, అడ్వాన్స్‌డ్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉన్నాయి. వర్షాకాలం సీజన్‌లో డిఫెన్సివ్ డ్రైవింగ్ ట్రైనింగ్, తీవ్రమైన ఎండల సమయంలో అదనపు విశ్రాంతి విరామాలు వంటి చర్యలకు రియల్‌టైమ్ వెదర్ అలర్ట్స్‌ను ఉపయోగిస్తోంది. అలాగే తప్పనిసరి ప్రీ-ట్రిప్ వెహికల్ చెక్స్, ప్రివెంటివ్ వెల్‌నెస్ క్యాంపెయిన్స్‌ను కూడా నిర్వహిస్తోంది. నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ సందర్భంగా డెలివరీ అసోసియేట్స్, పార్ట్‌నర్స్, ట్రక్ డ్రైవర్ల కోసం దేశవ్యాప్తంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించింది. ఇందులో హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం, స్పీడ్ మేనేజ్‌మెంట్, డ్రైవింగ్‌లో డిస్ట్రాక్షన్స్ నివారణ, ఎమర్జెన్సీ ప్రిపేర్డ్‌నెస్‌పై అవగాహన కల్పించారు.
పిల్లల చదువులకు కూడా..
డెలివరీ అసోసియేట్స్, పార్ట్‌నర్స్ పిల్లల ఉన్నత విద్య కోసం ప్రతిధి స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోంది. దీని ద్వారా అండర్‌గ్రాడ్యుయేట్, పోస్ట్‌గ్రాడ్యుయేట్ చదువులు కొనసాగించేందుకు సహాయం చేస్తోంది. అదే సమయంలో మహిళా ఉద్యోగుల కోసం మెన్‌స్ట్రుయల్ లీవ్, ఆన్‌సైట్ మెడికల్, రెస్ట్ ఫెసిలిటీస్, శానిటరీ ప్యాడ్ డిస్పెన్సింగ్ మెషీన్స్‌ను ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లలో ఏర్పాటు చేసింది. వర్కింగ్ మదర్స్ కోసం డేకేర్ ఫెసిలిటీస్, కెరీర్ గ్రోత్ కోరుకునే అసోసియేట్స్‌కు అప్‌స్కిల్లింగ్ అవకాశాలను కూడా కల్పిస్తోంది. అమెజాన్ ఇండియా ఆపరేషన్స్ డైరెక్టర్ సలీం మెమాన్ మాట్లాడుతూ భారత్‌లో ఆపరేషన్స్ నెట్‌వర్క్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఫ్రంట్‌లైన్ వర్క్‌ఫోర్స్‌పై పెట్టుబడులు కొనసాగిస్తున్నామని తెలిపారు. డెలివరీ అసోసియేట్స్ భద్రత, సంక్షేమమే తమకు అత్యంత ప్రాధాన్యత అని చెప్పారు. ఓపీడీ, హాస్పిటలైజేషన్, యాక్సిడెంట్ బెనిఫిట్స్‌లో ఇన్సూరెన్స్ కవరేజ్‌ను విస్తరించామని, దేశవ్యాప్తంగా ఉచిత చెకప్‌లు, ప్రివెంటివ్ కేర్‌తో హెల్త్ క్యాంపులను కూడా ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమాలన్నీ రూ.2,800 కోట్ల పెట్టుబడిలో భాగంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

Amazon Prime Day 2026 | అమెజాన్ ప్రైమ్ డే 2026 బంపర్ డీల్స్.. స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలపై భారీ తగ్గింపులు..
జులై 3, 2026

Amazon | ప్రైమ్ వీడియోస్‌లో యాడ్స్ వివాదం.. చట్టపరమైన చిక్కుల్లో అమెజాన్
జులై 1, 2026

Amazon Prime Day 2026 | అమెజాన్ ప్రైమ్ డే 2026 సేల్.. కొత్త ప్రొడక్ట్స్, భారీ డిస్కౌంట్లు..
జూన్ 29, 2026
తాజావార్తలు
- ●POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!
- ●Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్
- ●Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!
- ●Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే
- ●SLBC tunnel project | 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి.. 4 లక్షల ఎకరాలకు సాగునీరు: మంత్రి ఉత్తమ్
- ●OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన సింగర్ సునీత కొడుకు మూవీ

POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!

Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్

Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!

Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే



