PM Modi Tour’s | మూడు దేశాల పర్యనటకు మోదీ.. కీలక ఒప్పందాలపై చర్చించనున్న ప్రధాని
PM Modi Tour's | ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం మూడు దేశాల పర్యటనకు బయలుదేరారు. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ఆయన పర్యటించనున్నారు. ఈ పర్యటన భారత్‌కు చెందిన “యాక్ట్ ఈస్ట్ పాలసీ”, ఓషియన్ విజన్ (Ocean Vision)తో పాటు ఇండో-పసిఫిక్ ప్రాంతంపై వ్యూహాత్మక దృష్టిని మరింత బలోపేతం చేస్తుందని ప్రధాని కార్యాలయం (PMO) పేర్కొంది.
PM Modi Tour's | ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం మూడు దేశాల పర్యటనకు బయలుదేరారు. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ఆయన పర్యటించనున్నారు. ఈ పర్యటన భారత్‌కు చెందిన “యాక్ట్ ఈస్ట్ పాలసీ”, ఓషియన్ విజన్ (Ocean Vision)తో పాటు ఇండో-పసిఫిక్ ప్రాంతంపై వ్యూహాత్మక దృష్టిని మరింత బలోపేతం చేస్తుందని ప్రధాని కార్యాలయం (PMO) పేర్కొంది. ప్రధాని సోమవారం నుంచి బుధవారం వరకు ఇండోనేషియాలో పర్యటిస్తారు. ఆ దేశ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఆహ్వానం పర్యనటకు వెళ్లారు. 2018లో జరిగిన తన తొలి పర్యటనలోనే భారత్–ఇండోనేషియా సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి తీసుకెళ్లిన విషయాన్ని మోదీ ఓ ప్రకటనలో గుర్తు చేశారు. ఇటీవల రిపబ్లిక్ డే వేడుకల్లో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో ముఖ్య అతిథిగా పాల్గొన్నారని తెలిపారు. ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక, ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని మోదీ తెలిపారు. అలాగే, ఇండోనేషియాలో నివసిస్తున్న భారతీయ ప్రవాసులను కూడా ఆయన కలుసుకోనున్నారు. యోగ్యకర్తాలోని ప్రముఖ ప్రాంబనన్ దేవాలయ సముదాయాన్ని అధ్యక్షుడు ప్రబోవోతో కలిసి సందర్శించనున్నారు.
ఆస్ట్రేలియాలో ద్వైపాక్షిక చర్చలు
ఇండోనేషియా పర్యటన అనంతరం ప్రధాని మోదీ ఆస్ట్రేలియాకు బయలుదేరుతారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ఆహ్వానం ఆ దేశ పర్యటనకు వెళ్లనున్నారు. భారత్–ఆస్ట్రేలియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరుస్తుందని మోదీ తెలిపారు. రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, నైపుణ్య అభివృద్ధి, ప్రజల మధ్య సంబంధాలు వంటి రంగాల్లో విస్తృత చర్చలు జరుపనున్నారు. మెల్‌బోర్న్‌లో భారతీయ ప్రవాసులతో ఆయన ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. భారత–ఆస్ట్రేలియా సంబంధాల్లో ప్రవాస భారతీయుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. అలాగే ఆధునిక సాంకేతికత, క్రీడలు, క్రీడా శాస్త్రం వంటి కొత్త రంగాల్లో సహకారాన్ని విస్తరించేందుకు ఈ పర్యటన దోహదపడుతుందని తెలిపారు.
న్యూజిలాండ్‌లో కీలక భేటీ
ఆస్ట్రేలియా తర్వాత ప్రధాని మోదీ న్యూజిలాండ్ పర్యటనకు వెళ్తారు. న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్
ఆహ్వానం మేరకు ద్వీపదేశానికి మోదీ వెళ్లనున్నారు. 2025 మార్చిలో ప్రధాని లక్సన్ భారత్‌ను సందర్శించిన తర్వాత ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడ్డాయి. ఈ నేపథ్యంలో ఈ పర్యటన కొనసాగుతోందని మోదీ పేర్కొన్నారు. ఆర్థిక, వాణిజ్య, వ్యాపార సంబంధాలను మరింత విస్తరించే మార్గాలపై ఇరుదేశాల నేతలు చర్చించనున్నారు. భారత్–న్యూజిలాండ్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA)పై కూడా పురోగతి సాధించాలన్న దిశగా చర్చలు జరుపనున్నారు. న్యూజిలాండ్‌లోని భారతీయ సమాజంతో కూడా ప్రధాని మోదీ సమావేశమై, వారి కృషిని గుర్తించనున్నారని తెలిపారు. ఈ మూడు దేశాల పర్యటన భారత్ విదేశాంగ వ్యూహంలో కీలక మలుపుగా నిలవనుంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Komatireddy Venkatreddy | నాగ్‌పూర్ - విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ హైవే భూసేకరణ పూర్తి
- ●Anupama Parameswaran | పెళ్లి చేసుకున్న అనుపమ పరమేశ్వరన్ - ఫొటోల వెనకున్న అసలు కథ ఇదేనా?
- ●హైదరాబాద్‌కు ‘CURE’ మందా.. సామాన్యుడి జేబుకు చిల్లా?
- ●New Delhi Declaration | భారత్ దౌత్య విజయం.. న్యూఢిల్లీ డిక్లరేషన్‌కు బ్రిక్స్ దేశాల ఏకగ్రీవ ఆమోదం
- ●Telangana | తెలంగాణ భాష కేవలం ఒక్క భాష మాత్రమే కాదు.. ప్రజల జీవన విధానం కూడా
- ●Sterlite Technologies | ఏడాదిలో ఏకంగా 641 శాతం రాబడి.. ఇన్వెస్టర్లపై కాసులు కురిపిస్తున్న ఫైబర్ ఆప్టిక్స్ కంపెనీ షేర్..

Komatireddy Venkatreddy | నాగ్‌పూర్ - విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ హైవే భూసేకరణ పూర్తి

Anupama Parameswaran | పెళ్లి చేసుకున్న అనుపమ పరమేశ్వరన్ - ఫొటోల వెనకున్న అసలు కథ ఇదేనా?

హైదరాబాద్‌కు ‘CURE’ మందా.. సామాన్యుడి జేబుకు చిల్లా?

New Delhi Declaration | భారత్ దౌత్య విజయం.. న్యూఢిల్లీ డిక్లరేషన్‌కు బ్రిక్స్ దేశాల ఏకగ్రీవ ఆమోదం






