Delimitation Bill | వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరే వరకూ.. డీలిమిటేషన్ ప్రక్రియను వాయిదా వేయాలి : కాంగ్రెస్
Delimitation Bill | డీలిమిటేషన్ బిల్లును (Delimitation Bill) లోక్‌సభలో (Lok Sabha) ఆమోదింపజేసుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi), కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఇప్పటికీ అక్రమ పద్ధతిలో మూడింట రెండొంతుల (2/3) మెజారిటీ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారని కాంగ్రెస్ (Congress) పార్టీ ఆరోపించింది. అందుకే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను అధికారికంగా ముగించకుండా కాలయాపన చేస్తోందని విమర్శించింది. వికసిత్ భారత్ (Viksit Bharat) లక్ష్యం నెరవేరే వరకూ.. డీలిమిటేషన్ ప్రక్రియను వాయిదా వేయాలని డిమాండ్ చేసింది.
Delimitation Bill | త్రినేత్ర న్యూస్ : నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లును (Delimitation Bill) లోక్‌సభలో (Lok Sabha) ఆమోదింపజేసుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi), కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికీ అక్రమ పద్ధతిలో మూడింట రెండొంతుల (2/3) మెజారిటీ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి (Congress general secretary) జైరాం రమేష్ (Jairam Ramesh) ఆరోపించారు. అందుకే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడి నేటికి 100 రోజులు గడిచినా.. ప్రభుత్వం ఇంకా సమావేశాలను అధికారికంగా ముగించలేదని విమర్శించారు. ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి డీలిమిటేషన్ బిల్లును పాస్ చేయించుకోవడానికే మోదీ-షా ద్వయం ఇలా చేస్తోందని మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టారు.
ఈ ఏడాది ఏప్రిల్ 17న పాత డీలిమిటేషన్ బిల్లు పార్లమెంట్‌లో వీగిపోయిన తర్వాత కొత్త బిల్లులో ఏముందో ఎవరికీ తెలియదని జైరాం రమేష్ అన్నారు. దీనిపై ఏ రాజకీయ పార్టీతోనూ ప్రభుత్వం చర్చించలేదన్నారు. ప్రతిపాదిత సవరించిన బిల్లుపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇప్పటికే నాలుగుసార్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదని విమర్శించారు.
ప్రస్తుతం దేశం ముందు ఆర్థిక, రాజకీయ, సామాజిక, రక్షణ, విదేశాంగ విధానాలకు సంబంధించి ఎన్నో తీవ్రమైన సవాళ్లు ఉన్నాయని తెలిపారు. వాటిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ఆర్థిక వ్యవస్థపై ఆందోళనతో ఉన్నారని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో డీలిమిటేషన్ వంటి సున్నితమైన అంశంపై తొందరపాటు వద్దని సూచించారు.
గతంలో రాజ్యాంగపరంగా నియోజకవర్గాల పునర్విభజనను నిలిపివేసిన సందర్భాలను జైరాం రమేష్ ప్రస్తావించారు. 1976లో ఇందిరా గాంధీ, 2001లో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వాలు దేశ ప్రయోజనాల దృష్ట్యా డీలిమిటేషన్‌ను 25 ఏళ్ల చొప్పున వాయిదా వేశారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా వికసిత్ భారత్ (Viksit Bharat) లక్ష్యం నెరవేరే వరకూ ప్రస్తుత లోక్‌సభ స్థానాల సంఖ్యను, రాష్ట్రాల వారీ సీట్ల విభజనను అలాగే కొనసాగిస్తూ.. మహిళలకు 33శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Also Read..
H-1B ఉద్యోగుల పిల్లలకు అమెరికా గ్రీన్ కార్డ్! 21 ఏళ్ల గండం గట్టెక్కించే కొత్త బిల్లు.. అర్హతలివే!
ఆలోచనల్లోని హద్దులను చెరిపేస్తేనే దేశం అసలైన సామర్థ్యాన్ని గుర్తిస్తుంది : ప్రధాని మోదీ
వితంతు పింఛన్ మంజూరుకు రూ.10 వేలు లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

PM Modi | ఆలోచనల్లోని హద్దులను చెరిపేస్తేనే దేశం అసలైన సామర్థ్యాన్ని గుర్తిస్తుంది : ప్రధాని మోదీ
నవంబర్ 21, 2026

Congress | పార్టీ వ్యవహారాల ఇన్చార్జిని కలవండి.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశం
నవంబర్ 21, 2026

Kiren Rijiju | 1962 నాటి అవమానానికి కాంగ్రెస్ క్షమాపణలు చెబుతుందా..? : రాహుల్‌పై కేంద్ర మంత్రి ఫైర్
నవంబర్ 21, 2026
తాజావార్తలు
- ●US Green Card for H1B children | H-1B ఉద్యోగుల పిల్లలకు అమెరికా గ్రీన్ కార్డ్! 21 ఏళ్ల గండం గట్టెక్కించే కొత్త బిల్లు.. అర్హతలివే!
- ●Manchirevula | మంచిరేవుల దగ్గర ‘ఘర్ ఎ ముబారక్’ గుట్టల్లో ఎరుపు రంగు రాతలు
- ●Chamala Kirankumar Reddy | హరీశ్‌రావు, కేటీఆర్ డబ్బింగ్ చెప్తే కిషన్ రెడ్డి మాట్లాడ్తడు
- ●Indian Railways | రైలు సీట్లు, బెర్తులు ఎక్కువగా బ్లూ కలర్లోనే ఎందుకుంటయ్..? దీని వెనుక ఆసక్తికర కారణాలివే!
- ●PM Modi | ఆలోచనల్లోని హద్దులను చెరిపేస్తేనే దేశం అసలైన సామర్థ్యాన్ని గుర్తిస్తుంది : ప్రధాని మోదీ
- ●ACB Trap | వితంతు పింఛన్ మంజూరుకు రూ.10 వేలు లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

US Green Card for H1B children | H-1B ఉద్యోగుల పిల్లలకు అమెరికా గ్రీన్ కార్డ్! 21 ఏళ్ల గండం గట్టెక్కించే కొత్త బిల్లు.. అర్హతలివే!

Manchirevula | మంచిరేవుల దగ్గర ‘ఘర్ ఎ ముబారక్’ గుట్టల్లో ఎరుపు రంగు రాతలు

Chamala Kirankumar Reddy | హరీశ్‌రావు, కేటీఆర్ డబ్బింగ్ చెప్తే కిషన్ రెడ్డి మాట్లాడ్తడు

Indian Railways | రైలు సీట్లు, బెర్తులు ఎక్కువగా బ్లూ కలర్లోనే ఎందుకుంటయ్..? దీని వెనుక ఆసక్తికర కారణాలివే!



