త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Manali | లాంగ్ వీకెండ్‌.. మ‌నాలీకి క్యూ క‌ట్టిన ప‌ర్యాట‌కులు.. భారీగా ట్రాఫిక్ జామ్‌

Manali | వ‌రుస సెల‌వుల‌తో హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మనాలీ (Manali)కి పర్యాటకులు (tourists) పోటెత్తారు. ప‌లు రాష్ట్రాల నుంచి వేలాది మంది ప‌ర్యాట‌కులు మ‌నాలీకి క్యూ క‌ట్టారు. దీంతో ఎటు చూసినా ప‌ర్యాట‌కుల‌తో ఆయా ప్రాంతాలు సంద‌డిగా మారాయి.

D

National | Published On Oct 3, 2026, 10.48 am IST

Manali | లాంగ్ వీకెండ్‌.. మ‌నాలీకి క్యూ క‌ట్టిన ప‌ర్యాట‌కులు.. భారీగా ట్రాఫిక్ జామ్‌
Advertisement

Manali | త్రినేత్ర న్యూస్ : అక్టోబ‌ర్ 2 గాంధీ జ‌యంతి, శ‌నివారం, ఆదివారం.. ఇలా వ‌రుస సెల‌వుల‌తో లాంగ్ వీకెండ్ (long weekend) రావ‌డంతో హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మనాలీ (Manali)కి పర్యాటకులు (tourists) పోటెత్తారు. ఢిల్లీ, పంజాబ్‌, హ‌ర్యానా, చండీగ‌ఢ్ స‌హా స‌మీప రాష్ట్రాల నుంచి వేలాది మంది ప‌ర్యాట‌కులు మ‌నాలీకి క్యూ క‌ట్టారు.

దీంతో మనాలీకి వెళ్లే ప్రధాన రహదారులతో పాటు అటల్ టన్నెల్ (Atal Tunnel), సోలాంగ్ వ్యాలీ వైపు వెళ్లే మార్గాలు వాహ‌నాల‌తో కిక్కిరిసిపోయాయి. కిలోమీట‌ర్ల మేర వాహ‌నాలు బారులు తీరాయి. కొన్ని చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ (Traffic Jam) ఏర్ప‌డింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఎక్క‌డిక్క‌డ ట్రాఫిక్ క్లియ‌రెన్స్ చర్య‌లు చేప‌ట్టారు. మ‌రోవైపు ప‌ర్యాట‌కుల తాకిడి పెర‌గ‌డంతో స్థానికంగా హోట‌ళ్లు, హోమ్‌స్టేలు పూర్తిగా నిండిపోయాయి. ముంద‌స్తు బుకింగ్ లేని ప‌ర్యాట‌కులు తీవ్ర ఇబ్బందులు ప‌డాల్సి వ‌చ్చింది. ఇక‌ ఎటు చూసినా ప‌ర్యాట‌కుల‌తో ఆయా ప్రాంతాలు సంద‌డిగా మారాయి.

Also Read..

ఉగ్ర‌వాద భావ‌జాలం.. విమానాలు న‌డ‌ప‌డంపై నిషేధం.. ఫ్లైదుబాయ్ కో-పైల‌ట్ గురించి సంచ‌ల‌న విష‌యాలు

హెల్త్‌కేర్‌ పరిశ్రమలో పేలిన బాయిలర్‌.. న‌లుగురు దుర్మ‌ర‌ణం

ఉన్న‌త చ‌దువుల కోసం అమెరికా వెళ్లి.. క్యాన్స‌ర్‌తో న‌ల్ల‌గొండ యువ‌తి మృతి

Advertisement
Advertisement